లాంచ్ కి ముందు లీకైన Samsung Galaxy S23, Galaxy S23+ కేసెస్

హైలైట్స్:

  • 2023 ప్రథమార్థంలో లాంచ్ కానున్న Samsung Galaxy S23 సిరీస్
  • ఈ లైనప్ లో రానున్న Samsung Galaxy S23, Galaxy S23+, Galaxy S23 Ultra
  • తాజాగా లీక్ అయిన Samsung Galaxy S23 మోడల్స్ యొక్క కేసెస్

Samsung Galaxy S22 సక్సెసర్ సిరీస్, Samsung Galaxy S23 ని లాంచ్ చేసేందుకు శాంసంగ్ రెడీ అవుతోంది. 2023 మొదట్లో, ఎస్23 సిరీస్ లాంచ్ కానుంది. Samsung Galaxy S23 లైనప్ లో Samsung Galaxy S23, Galaxy S23+, Galaxy S23 Ultra అనే మోడల్స్ ఉండనున్నాయి. రీసెంట్ గా ఎస్23, ఎస్23+ లకి సంబంధించిన డిజైన్, స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఇప్పుడు ఓ టిప్‌స్టర్ ఈ రెండు మోడల్స్ యొక్క కేసెస్ ఇమేజెస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కేసెస్ రెండు రంగుల్లో కనిపిస్తున్నాయి. ఆ వివరాలేంటో చూద్దాం పదండి.

 

ప్రొటెక్టివ్ కేసెస్ ని బట్టి స్టాండర్డ్ వేరియంట్ యొక్క డిజైన్ ఎలా ఉండనుందో తెలుస్తోంది. బటన్ ప్లేస్మెంట్, కెమెరా కటౌట్స్, సన్నని డిజైన్, కెమెరా బంప్ తదితర విషయాలు స్ఫష్టంగా తెలుస్తున్నాయి. కెమెరా బంప్ ని చూస్తే గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4 లో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇదే తరహా కెమెరా బంప్ ని గెలాక్సీ ఏ14 మోడల్ లో కూడా వాడబోతున్నట్లు తెలుస్తోంది.

Samsung Galaxy S23 సిరీస్ స్పెసిఫికేషన్స్ (అంచనా)

Samsung Galaxy S23 స్మార్ట్ ఫోన్ 6.1-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే తో వచ్చే అవకాశం ఉంది. ఫోన్ మందపాటి బెజెల్స్ ని కలిగి ఉంది. గెలాక్సీ ఎస్22 మాదిరి 146.3 మిల్లీ మీటర్ల పొడవు, 70.8 మిల్లీ మీటర్ల వెడల్పు, 7.6 మిల్లీ మీటర్ల మందం ఉంటుంది. Samsung Galaxy S23 క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో గ్లోబల్ గా లాంచ్ కానున్నట్లు సమాచారం. ఈ లైప్ 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Samsung Galaxy S23 Ultra కూడా 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వస్తున్నట్లు తెలుస్తోంది. గత మోడల్ గెలాక్సీ ఎస్22 అల్ట్రా 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కలిగి ఉన్న విషయం గమనించాలి. ఇప్పుడు Samsung Galaxy S23 Ultra కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్లో 200 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 10 మెగా పిక్సెల్ టెలీఫోటో కెమెరా ఉండనున్నాయి. 10 ఎంపి టెలీఫోటో లెన్స్ లో 3x ఆప్టికల్ జూమ్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 40 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండనుంది. ఇకపోతే ఈ డివైజ్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది.

Samsung Galaxy S23 సిరీస్ స్పెసిఫికేషన్స్ కి సంబంధించిన మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో తెలియనున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.