Home News లీకైన Samsung Galaxy S23 FE బ్యాటరీ, కెమెరా స్పెసిఫికేషన్స్

లీకైన Samsung Galaxy S23 FE బ్యాటరీ, కెమెరా స్పెసిఫికేషన్స్

Highlights
  • Samsung Galaxy S23 FE గురించి వినిపిస్తోన్న రూమర్లు
  • త్వరలోనే డివైజ్ లాంచ్ అవుతుందని అంచనా
  • ఈ ఏడాది వివిధ మార్కెట్స్ లో Galaxy S23 FE ఎంట్రీ ఇచ్చే అవకాశం

శాంసంగ్ సంస్థ త్వరలోనే కొత్త ఫ్యాన్ ఎడిషన్ సిరీస్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయనుందని తెలుస్తోంది. కంపెనీ నుంచి 2022 జనవరిలో Samsung Galaxy S21 FE డివైజ్ మార్కెట్ లోకి వచ్చింది. అయితే తర్వాత శాంసంగ్ కంపెనీ Samsung Galaxy S22 FE ని లాంచ్ చేయలేదు. తాజాగా Samsung Galaxy S23 FE ఫోన్ ఈ ఏడాది లాంచ్ కానుందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఒక కొత్త రిపోర్ట్ ద్వారా Samsung Galaxy S23 FE డివైజ్ బ్యాటరీ, కెమెరా స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. దక్షిణకొరియా అథారిటీ వెబ్ సైట్ పై ఈ డివైజ్ కనిపించినట్లు సమాచారం. సరే, Samsung Galaxy S23 FE లీకైన స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy S23 FE గురించి తెలిసిన విషయాలు

Samsung Galaxy S23 FE ఈ ఏడాది లాంచ్ అవ్వనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఫోన్ బ్యాటరీ సేఫ్టీకొరియా సర్టిఫికేషన్ క్లియర్ చేసినట్లు తెలుస్తోంది. GalaxyClub ప్రకారం, Samsung Galaxy S23 FE బ్యాటరీ, EB-BS711ABY అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. ఈ మోడల్ నంబర్ SM-S711 అనే మోడల్ నంబర్ గల ఫోన్ ది అని తెలుస్తోంది. ఇది Samsung Galaxy S23 FE డివైజ్‌దేనని అంటున్నారు.

బ్యాటరీ కెపాసిటీ గురించి ఏమీ తెలియలేదు. కానీ, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. WinFuture రిపోర్ట్ ప్రకారం, Samsung Galaxy S23 FE ఫోన్ 50ఎంపి మెయిన్ కెమెరా సెన్సర్ తో రానున్నట్లు తెలుస్తోంది.

Samsung Galaxy S23 FE స్మార్ట్ ఫోన్ ఎగ్జినోస్ 2200 చిప్సెట్ తో రానుందని సమాచారం. Samsung Galaxy S23 సిరీస్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో వచ్చిన విషయం తెలిసిందే.