
ప్రముఖ టెక్ బ్రాండ్ శాంసంగ్ త్వరలో తన గెలాక్సీ 23 సిరీస్ కి మరొక మోడల్ ని జత చేయనుంది. Samsung Galaxy S23 FE స్మార్ట్ ఫోన్ త్వరలోనే మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. అయితే శాంసంగ్ సంస్థ Samsung Galaxy S22 FE ని తీసుకురాలేదు. కానీ, ఇప్పుడు Samsung Galaxy S23 FE ని గతేడాది వచ్చిన చిప్సెట్స్ తో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Samsung Galaxy S23 FE డివైజ్ రెండు చిప్సెట్ వేరియంట్స్ లో రానుందని తాజాగా కొన్ని లీక్స్ ద్వారా తెలిసింది.
స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 చిప్‌తో నార్త్ అమెరికాలో ఎంట్రీ ఇవ్వనున్న Samsung Galaxy S23 FE
గీక్ బెంచ్ లిస్టింగ్ ద్వారా రివీలైన సమాచారాన్ని బట్టి, Samsung Galaxy S23 FE స్మార్ట్ ఫోన్ SM-S7711U1 మోడల్ నంబర్ కలిగి ఉంది. మదర్‌బోర్డ్ TARO అనే కోడ్ నేమ్ తో ఉంది. ఇది క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 చిప్ లేదా అండర్‌క్లాక్డ్ వర్షన్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ అయ్యుంటుందని అంచనా వేస్తున్నారు. దీని క్లాక్ స్పీడ్ గరిష్టంగా 3.0 గిగాహెర్ట్జ్ స్పీడ్ కలిగి ఉంటుంది.
మోడల్ నంబర్ లో ఉన్న U1 అనేది నార్త్ అమెరికన్ మార్కెట్స్ ని సూచిస్తోంది. అంటే అవి యూఎస్, కెనెడా అని అర్థం. ఇక Samsung Galaxy S23 FE ఫోన్ సింగిల్ కోర్ టెస్ట్ లో 1,549 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 3,718 పాయింట్లు నమోదు చేసినట్లు గీక్ బెంచ్ ద్వారా తెలుస్తోంది.
గత లిస్టింగ్స్ ని చూస్తే, Samsung Galaxy S23 FE డివైజ్ 8జిబి ర్యామ్ తో రానున్నట్లు తెలిసింది. ఇకపోతే Samsung సంస్థ Galaxy S23 FE డివైజ్ స్నాప్ డ్రాగన్ చిప్సెట్ వర్షన్ ని కూడా భారత్ లో లాంచ్ చేసే అవకాశాలున్నట్లు సమాచారం.
రీసెంట్ గా భారత్ లో శాంసంగ్ సంస్థ Samsung Galaxy S21 FE స్నాప్ డ్రాగన్ 888 వేరియంట్ ని లాంచ్ చేసింది. రానున్న కొన్ని రోజుల్లో Samsung Galaxy S23 FE డివైజ్ గ్లోబల్ గా లాంచ్ అవ్వనుంది. మరోవైపు జులై 26 వ తేదీన సియోల్ లో Galaxy Z Flip 5, Fold 5 స్మార్ట్ ఫోన్లు లాంచ్ కానున్నాయి.











