భారతదేశపు బీఐఎస్ సర్టిఫికేషన్ మరియు డబ్ల్యూపీసీ డేటాబేస్ లపై కనిపించిన Samsung Galaxy S23 FE తాజాగా యూఎస్ కి చెందిన బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కనిపించింది. దీంతో Samsung Galaxy S23 FE లాంచ్ త్వరలోనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే, కంపెనీ నుంచి ఇప్పటి వరకు అధికార ప్రకటన రాలేదు. గ్లోబల్ మార్కెట్స్ తో పాటు భారత్ లో కూడా Samsung Galaxy S23 FE లాంచ్ ఉంటుందని బీఐఎస్ సర్టిఫికేషన్ ద్వారా తెలుస్తోంది.
Samsung Galaxy S23 FE కి సంబంధించిన అధికార ప్రకటన రాలేదు కానీ, వచ్చే నెలలో కంపెనీ ఈ ఫోన్ ని లాంచ్ చేస్తుందని రీసెంట్ రిపోర్ట్ ద్వారా తెలిసింది.
Samsung Galaxy S23 FE బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్
Samsung Galaxy S23 FE స్మార్ట్ ఫోన్ ని బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్స్ పై ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ గుర్తించారు. లిస్టింగ్స్ ఒక్కొకటి ఒక్కో మోడల్ నంబర్ కలిగి ఉన్నాయి. SM-S711U, SM-S711W, SM-S711U1, SM-S7110, SM-S711B_DS, SM-S711B అనే మోడల్ నంబర్స్ లిస్టింగ్స్ పై ఉన్నాయి. అయితే ఈ మోడల్ నంబర్స్ తప్పా ఇంకా ఏ విషయాలు రివీల్ కాలేదు.
రీసెంట్ గా Samsung Galaxy S23 FE వివిధ సర్టిఫికేషన్ ప్లాట్ఫామ్స్ పై కనిపించింది. వాటిలో బీఐఎస్, వైర్లెస్ పవర్ కన్సార్టియమ్, గీక్ బెంచ్ వంటివి ఉన్నాయి. దీంతో Samsung Galaxy S23 FE లాంచ్ సమయం దగ్గర్లోనే ఉందని అర్థమవుతోంది.
Samsung Galaxy S23 FE స్పెసిఫికేషన్స్ (అంచనా)
- స్క్రీన్: Samsung Galaxy S23 FE లో 6.4-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
- రియర్ కెమెరా: Samsung Galaxy S23 FE లో 50ఎంపి ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 12ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటాయి.
- సెల్ఫీ కెమెరా: సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం Samsung Galaxy S23 FE లో 10ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- చిప్సెట్: Samsung Galaxy S23 FE లో మార్కెట్ ని బట్టి, ఎగ్జినోస్ 2200 చిప్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్ అందిస్తున్నారు.
- స్టోరేజీ: Samsung Galaxy S23 FE డివైజ్ 6జిబి+128జిబి మరియు 8జిబి+256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- ఓఎస్: Samsung Galaxy S23 FE స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- బ్యాటరీ: Samsung Galaxy S23 FE లో పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ అందిస్తున్నారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
