ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ రీసెంట్ గా ఎమ్-సిరీస్ లో ఎమ్34 అనే డివైజ్ ని లాంచ్ చేసింది. ఇప్పుడు Samsung Galaxy S23 FE ని లాంచ్ చేయాలని భావిస్తోంది. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో ఈ ఫోన్ లాంచ్ కానుందని సమాచారం. అంటే జులై, ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో ఈ డివైజ్ మార్కెట్ లోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఈ ఫ్యాన్ ఎడిషన్ తాజాగా బెంచ్ మార్కింగ్ ప్లాట్ఫామ్ అయిన గీక్బెంచ్ పై కనిపించింది. దీంతో పలు కీలక విషయాలు బయటకు వచ్చాయి. 2022 జనవరిలో లాంచైన ఎగ్జినోస్ 2200 చిప్సెట్ తో Samsung Galaxy S23 FE డివైజ్ గీక్ బెంచ్ లిస్టింగ్ పై కనిపించింది.
Geekbench లిస్టింగ్ వివరాలు
- Samsung Galaxy S23 FE స్మార్ట్ ఫోన్ గీక్ బెంచ్ పై SM-S711B అనే మోడల్ నంబర్ తో కనిపించింది. లిస్టింగ్ ద్వారా డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో రానుందని తెలుస్తోంది. అలాగే 8జిబి ర్యామ్ కూడా లిస్టింగ్ లో ఉంది. అయితే మిగతా ర్యామ్ వేరియంట్స్ కూడా ఉండవచ్చు. లాంచ్ సమయంలో ఈ వివరాలు వెల్లడవుతాయి.
- మదర్బోర్డ్ సెక్షన్ లో s5e9925 అని పేర్కొనబడి ఉంది. ఇది Exynos 2200 ప్రాసెసర్ కి సంబంధించిందేనని భావిస్తున్నారు. ఇకపోతే ఈ చిప్సెట్ క్లాక్ స్పీడ్ 2.80 గిగాహెర్ట్జ్ గా ఉంది. శాంసంగ్ తయారు చేసిన ఈ చిప్ మార్కెట్ లోకి వచ్చిన ఏడాదిన్నర అవుతోంది.
- స్టాండర్డ్ గెలాక్సీ ఎస్23 మోడల్స్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ ని కలిగి ఉండగా, Samsung Galaxy S23 FE డివైజ్ ఎగ్జినోస్ తో వస్తుండటం ఆశ్చర్యకరంగా ఉంది.
- తన వద్ద ఉన్న పరిమితికి మించిన స్టాక్ ని క్లియర్ చేసేందుకై Samsung Galaxy S23 FE లో Exynos 2200 చిప్ ని వినియోగిస్తున్నట్లు రూమర్ల ద్వారా తెలుస్తోంది.
- ఇకపోతే గీక్ బెంచ్ కంటే ముందు చైనాకు చెందిన 3C సర్టిఫికేషన్ వెబ్సైట్ పై Samsung Galaxy S23 FE డివైజ్ కనిపించింది. లీకైన రెండర్స్ ద్వారా ఫోన్ పూర్తి డిజైన్ రివీల్ అయ్యింది.
Samsung Galaxy S23 FE స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: Samsung Galaxy S23 FE లో 6.4-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
- ప్రాసెసర్: Samsung Galaxy S23 FE లో ఎగ్జినోస్ 2200 చిప్సెట్ ఉంటుందని సమాచారం.
- ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy S23 FE 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభించే అవకాశం ఉంది.
- కెమెరా: Samsung Galaxy S23 FE లో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి టెలీఫోటో లెన్స్, 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 12 ఎంపి ఫ్రంట్ కెమెరా అందించనున్నారు.
- బ్యాటరీ: Samsung Galaxy S23 FE లో పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
