శాంసంగ్ ఫ్యాన్ ఎడిషన్ ఫోన్ Samsung Galaxy S23 FE పైన ఈ మధ్య కాలంలో చాలా చర్చ జరుగుతోంది. రీసెంట్ గా లీక్స్ ద్వారా డివైజ్ లాంచ్ తేదీ అక్టోబర్ 4 అంటూ ఒక వార్త బయటకు వచ్చింది. అయితే కంపెనీ నుంచి అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఈలోపు MySmartPrice వెబ్సైట్ Samsung Galaxy S23 FE యొక్క యూఎస్ మార్కెట్ ధరను రివీల్ చేసింది. సరే, ఓసారి Samsung Galaxy S23 FE డివైజ్ ధర, ఇతర వివరాలను తెలుసుకుందాం పదండి.
Samsung Galaxy S23 FE ధర (అంచనా)
- MySmartPrice వెబ్సైట్ కి అందిన సమాచారం ప్రకారం, Samsung Galaxy S23 FE ధర యూఎస్ మార్కెట్ లో 599 డాలర్లు (సుమారు రూ.49,800) ఉంటుందని తెలుస్తోంది.
- Samsung Galaxy S23 FE డివైజ్ గ్రాఫైట్, మింట్, పర్పుల్, వైట్, ఇండిగో, ట్యాంజరిన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఇండిగో, ట్యాంజరిన్ కలర్ ఆప్షన్స్ శాంసంగ్ స్టోర్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయి.
- Samsung Galaxy S23 FE డివైజ్ తో పాటు Galaxy Buds FE కూడా లాంచ్ అవుతాయని సమాచారం. ఈ బడ్స్ ధర కూడా రివీల్ అయ్యింది. వీటి ధర 99 డాలర్లు (సుమారు రూ.8,300) ఉంటుందని అంచనా.
- Samsung Galaxy S23 FE భారత మార్కెట్ ధర ఇంకా రివీల్ కాలేదు. త్వరలోనే దీనికి సంబంధించిన ఏదైనా సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది.
Samsung Galaxy S23 FE స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: Samsung Galaxy S23 FE లో 6.4-ఇంచ్ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1450 నిట్స్ బ్రైట్నెస్ ఉంటాయి.
- ప్రాసెసర్: Samsung Galaxy S23 FE లో ఎగ్జినోస్ 2200 చిప్సెట్ ఉంటుంది. అమెరికా, కెనడా మార్కెట్స్ లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 చిప్ ఉండవచ్చు.
- ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy S23 FE లో 8జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 128జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉంటాయి.
- కెమెరా: Samsung Galaxy S23 FE లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 8ఎంపి ఓఐఎస్ టెలీఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 10ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- బ్యాటరీ: Samsung Galaxy S23 FE లో పవర్ బ్యాకప్ కోసం 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: Samsung Galaxy S23 FE లో ఐపీ68 రేటింగ్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ ఉంటాయి.
