ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Samsung భారత్ లో గెలాక్సీ ఎస్23 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో మొత్తం 3 ఫోన్లు వచ్చాయి. అవి: Samsung Galaxy S23, Samsung Galaxy S23 Plus, Samsung Galaxy S23 Ultra. Samsung Galaxy S23 Ultra ఫోన్ ఎస్-పెన్ మరియు కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లేతో వచ్చింది.
Samsung Galaxy S23 Plus ఈ లైనప్ లో రెండో స్థానంలోని ఫ్లాగ్షిప్. ఈ ఫోన్ ఎస్23 కంటే పెద్ద డిస్ప్లే, బ్యాటరీతో వచ్చింది. ఇక ఎస్23 ఫోన్ కాంపాక్ట్ డిజైన్ తో వచ్చింది. ప్రస్తుతం Samsung Galaxy S23 సిరీస్ వివిధ మాధ్యమాల్లో అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఓసారి భారత్ లో Samsung Galaxy S23 సిరీస్ ఫోన్ల ధరలు, స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
భారత్ లో Samsung Galaxy S23 ధర
స్టాండర్డ్ వేరియంట్ Samsung Galaxy S23 రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. బేస్ మోడల్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ కలిగి ఉంటుంది. దీని ధర రూ.74,999. 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.79,999 గా ఉంది. ఫ్యాంటమ్ బ్లాక్, గ్రీన్, ల్యావెండర్, క్రీమ్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.
భారత్ లో Samsung Galaxy S23 Plus ధర
Samsung Galaxy S23 Plus 8జిబి + 256జిబి వేరియంట్ ధర రూ.94,999 గా ఉంది. 8జిబి + 512జిబి వేరియంట్ ధర రూ.1,04,999 గా ఉంది. ఫ్యాంటమ్ బ్లాక్, క్రీమ్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.
భారత్ లో Samsung Galaxy S23 Ultra ధర
Samsung Galaxy S23 Ultra 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ధర రూ.1,24,999 గా ఉంది. 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.1,34,999 గా ఉంది. ఇక 1టిబి వేరియంట్ ధర రూ.1,54,999 గా ఉంది.
Samsung Galaxy S23 Ultra ఫ్యాంటమ్ బ్లాక్, గ్రీన్, క్రీమ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అయతే ఈ డివైజ్ రెడ్, గ్రాఫైట్, లైమ్, స్కై బ్లూ కలర్ ఆప్షన్స్ లో కేవలం శాంసంగ్.కామ్ ద్వారా మాత్రమే లభించనుంది.
Samsung Galaxy S23 Ultra ప్రీ-బుకింగ్ ద్వారా పలు ఆఫర్లు లభించనున్నాయి. గెలాక్సీ వాచ్ 4 ఎల్టీఈ క్లాసిక్ మరియు గెలాక్సీ బడ్స్ 2 ప్రత్యేక ధర రూ.4,999 వద్ద లభిస్తాయి. Samsung Galaxy S23+ ని ప్రీ-ఆర్డర్ చేసుకునే కస్టమర్లు Galaxy Watch 4 BT ని రూ.4,999 కే సొంతం చేసుకోవచ్చు.
Samsung Galaxy S23 ని ప్రీ-బుక్ చేసుకునే కస్టమర్లు రూ.5000 విలువజేసే స్టోరేజీ అప్‌గ్రేడ్ ఆఫర్ ని పొందనున్నారు. అదనంగా రూ.8,000 బ్యాంక్ క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.
