Home News భారత్‌లో మొదలైన Samsung Galaxy S23 సిరీస్ ప్రీ-బుకింగ్స్

భారత్‌లో మొదలైన Samsung Galaxy S23 సిరీస్ ప్రీ-బుకింగ్స్

హైలైట్స్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన నెక్ట్స్ ఫ్లాగ్షిప్ సిరీస్ Samsung Galaxy S23 యొక్క లాంచ్ తేదీని కన్ఫర్మ్ చేసింది. Samsung Galaxy S23 లైనప్ లో మొత్తం మూడు మోడల్స్ లాంచ్ కానున్నాయి. అవి: Samsung Galaxy S23, Samsung Galaxy S23 Plus, Samsung Galaxy S23 Ultra. ఈ మూడు ఫోన్లు గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ లో లాంచ్ కానున్నాయి.

Galaxy Unpacked 2023 ఈవెంట్ ఫిబ్రవరి 1 న జరగనుంది. ఆ తేదీకి ఇంకా కొన్ని రోజుల సమయం ఉంది. అయితే ఈలోపే శాంసంగ్ సంస్థ Samsung Galaxy S23 సిరీస్ ప్రీ-బుకింగ్ విండోని తెరిచింది. భారత్ లో ఆసక్తిగల కొనుగోలుదారులు టోకెన్ అమౌంట్ రూ.2,000 చెల్లించి ఫోన్ బుక్ చేసుకోవచ్చు. ప్రీ-బుకింగ్ చేసుకునే కస్టమర్లకు కొన్ని బెనిఫిట్స్ కూడా లభించనున్నాయి. మరి ఆ ప్రీ-బుకింగ్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం పదండి.

శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ప్రీ-బుకింగ్స్ ఆఫర్స్

Samsung Galaxy S23 సిరీస్ ఫోన్లను ఆసక్తిగల వారు శాంసంగ్ ఇండియా అధికార వెబ్ సైట్ ద్వారా ప్రీ-బుక్ చేసుకోవచ్చు. దీంతో ఫోన్స్ అఫీషియల్ గా సేల్ కి వచ్చిన తర్వాత ప్రీ-బుకింగ్ కస్టమర్స్ కి వెనువెంటనే డెలివరీ అవుతాయి. ప్రీ-బుక్ చేసుకునే వారికి శాంసంగ్ సంస్థ రూ.5,000 విలువజేసే వోచర్స్ ని అందిస్తోంది. మీరు గనుక, Samsung Galaxy S23 సిరీస్ ఫోన్ ని ముందస్తుగా బుక్ చేసుకోవాలంటే అందుకు టోకెన్ అమౌంట్ రూ.2,000 చెల్లించాలి. తర్వాత మీరు ఫోన్ ని కొనాలనుకుంటే గనుక అందులో నుంచి ఈ మొత్తం తగ్గించబడుతుంది.

కంపెనీ యొక్క వెబ్ సైట్ తో పాటు కస్టమర్లు నేరుగా సర్టిఫైడ్ శాంసంగ్ ఔట్‌లెట్స్ కి వెళ్ళి Samsung Galaxy S23 సిరీస్ ఫోన్లను ప్రీ-బుక్ చేసుకోవచ్చు. ముందస్తుగా ఫోన్ ని బుక్ చేసుకునే వారికి స్పెషల్ కలర్ ఆప్షన్స్ ని ఎంచుకునే అవకాశం లభిస్తుంది. ఈ ప్రత్యేకమైన రంగు ఎంపికలు కేవలం శాంసంగ్ వెబ్‌సైట్ లో మాత్రమే అందుబాటులో ఉంటాయి.

అంతేకాదండోయ్, శాంసంగ్ సంస్థ బోలెడన్ని లాంచ్ ఆఫర్లను అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఈ ఆఫర్లు ప్రీ-బుక్ చేసుకున్న కస్టమర్లకు కూడా వర్తిస్తాయి. అంటే ప్రీ-బుకింగ్ ఆఫర్లతో పాటు, అదనంగా సేల్ ఆఫర్స్ కూడా వర్తిస్తాయన్నమాట. అంటే ఇది డబుల్ ధమాకానే.

శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా స్పెసిఫికేషన్స్ (అంచనా)

Samsung Galaxy S23 Ultra స్మార్ట్‌ఫోన్ 6.8-ఇంచ్ క్యూహెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది. ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ వాడినట్లు సమాచారం. 16జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ తో ఈ ఫోన్ వస్తోంది. ఈ డివైజ్ 200 మెగాపిక్సెల్ భారీ కెమెరా సెన్సర్ తో వస్తోంది. దీనికి తోడు 10ఎంపి టెలీఫోటో లెన్స్, 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా ఉంటాయి.

పవర్ బ్యాకప్ కోసం Samsung Galaxy S23 Ultra లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్/45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.0/5.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.