Home News లాంచ్‌కి ముందు లీకైన Samsung Galaxy S23 సిరీస్ ధరలు

లాంచ్‌కి ముందు లీకైన Samsung Galaxy S23 సిరీస్ ధరలు

Highlights
  • భారత్ తో పాటు, గ్లోబల్ గా ఫిబ్రవరి 1 న లాంచ్ అవుతోన్న Samsung Galaxy S23 సిరీస్
  • లీకైన ధరలను బట్టి చూస్తే, రూ.79,999 ప్రారంభ ధరతో మార్కెట్ లోకి రానున్న Samsung Galaxy S23 సిరీస్
  • ఇదే స్థాయి ధరతో మొదలవుతోన్న iPhone 14 సిరీస్

Samsung సంస్థ తన నెక్ట్స్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ సిరీస్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. భారత్ తో పాటు, గ్లోబల్ గా Samsung Galaxy S23 సిరీస్ వచ్చే వారం లాంచ్ అవుతోంది. 2023 గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ కి ముందు Samsung Galaxy S23 సిరీస్ యొక్క ధరలు లీక్ అయ్యాయి. ప్రముఖ టిప్‌స్టర్ యోగేశ్ బ్రార్ సౌజన్యంతో MySmartPrice ఈ సమాచారాన్ని వెలువరించింది. చూస్తుంటే Samsung Galaxy S23 సిరీస్ ధరలు గత ఫ్లాగ్షిప్ శ్రేణి ధరలకు సమీపంలోనే ఉన్నాయి. అయితే Galaxy S22 తో పోల్చితే ఖరీదు కాస్త ఎక్కువగానే ఉండనుంది.

భారత్ లో Samsung Galaxy S23 సిరీస్ ధర (లీకైన సమాచారం ప్రకారం)

రిపోర్ట్ ప్రకారం, Samsung Galaxy S23 స్టాండర్డ్ మోడల్ ధర రూ.79,999 గా ఉండనుంది. భారత్ లో iPhone 14 ధర కంటే ఇది రూ.99 ఎక్కువ. లైనప్ లో మిండ్ రేంజ్ మోడల్ అయిన Galaxy S23 Plus ధర రూ.89,999 గా ఉంటుందని సమాచారం. మరోవైపు టాప్ వేరియంట్ Galaxy S23 Ultra ధర రూ.1,14,999 గా ఉంటుందని అంచనా.

2022 లో వచ్చిన ఫ్లాగ్షిప్ లైనప్ Galaxy S22 సిరీస్ డివైజెస్ ధరలను గమనిస్తే.. గెలాక్సీ ఎస్22 ధర రూ.72,999, ఎస్22 ప్లస్ ధర రూ.84,999 ఉండగా, గెలాక్సీ ఎస్22 అల్ట్రా ధర రూ.1,09,999 గా ఉంది. దీని బట్టి, ఎస్23 సిరీస్ ధర రూ.5,000 నుంచి రూ.7,000 మేర ఎక్కువున్నట్లు స్పష్టమవుతోంది.

వినియోగదారుల నుంచి స్మార్ట్ ఫోన్ల కొరకై డిమాండ్ తగ్గిపోవడంతో ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. కౌంటర్ పాయింట్ రిపోర్ట్ ప్రకారం, గతేడాది భారత్ లో స్మార్ట్ ఫోన్ మార్కెట్ 9 శాతం మేర పడిపోయింది. ఇది రానున్న రోజుల్లో మరింతగా దిగజారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Samsung Galaxy S23 సిరీస్ లో టాప్ వేరియంట్ అయిన Samsung Galaxy S23 Ultra విశేషాలేంటో తెలుసుకుందాం. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ తో వస్తోంది. ఈ ఫోన్ లో 12జిబి ర్యామ్, 1టిబి ఇంటర్నల్ స్టోరేజీ ఉంటాయి. డిస్ప్లే విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 6.8-ఇంచ్ క్వాడ్ హెచ్డీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 స్క్రీన్ ప్రొటెక్షన్ ఉంటాయి.

Samsung Galaxy S23 Ultra లో హైలైట్ పాయింట్ గా మెయిన్ కెమెరా నిలవనుంది. ఈ ఫోన్ 200 మెగాపిక్సెల్ భారీ కెమెరాతో వస్తోంది. ఇక పవర్ బ్యాకప్ కోసం ఈ హ్యాండ్సెట్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.