Home News Samsung Galaxy S23 సిరీస్ ర్యామ్, స్టోరేజీ, కలర్ ఆప్షన్స్

Samsung Galaxy S23 సిరీస్ ర్యామ్, స్టోరేజీ, కలర్ ఆప్షన్స్

హైలైట్స్

Samsung Galaxy S23 సిరీస్ యొక్క లాంచ్ తేదీ ఇటీవలె లీకైంది. కంపెనీ యొక్క కొలంబియా డివిజన్ టీజర్ ఇన్వైట్ తో పాటు Samsung Galaxy S23 కి సంబంధించిన కొన్ని ప్రధాన వివరాలను కన్ఫర్మ్ చేసింది. వచ్చే నెల శాంసంగ్ 3 ప్రీమియమ్ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేయనుంది. ఫిబ్రవరి 1 న డివైజెస్ ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. శాంసంగ్ ఇంకా అధికారికంగా వివరాలను ఖరారు చేయాల్సి ఉంది. ఈలోపు ఒక కొత్త లీక్ ద్వారా Samsung Galaxy S23 కి సంబంధించిన మరికొన్ని వివరాలు బయటకు వచ్చాయి.

ప్రముఖ టిప్‌స్టర్ Snoopy Tech త్వరలో రాబోవు Samsung Galaxy S23 యొక్క ర్యామ్, స్టోరేజీ మరియు కలర్ ఆప్షన్స్ ని రివీల్ చేసింది. టిప్‌స్టర్ ప్రకారం, Samsung Galaxy S23 సిరీస్ లో వచ్చే బేస్ మోడల్ కనీసం 8జిబి ర్యామ్ కలిగి ఉంటుందని టిప్‌స్టర్ తెలిపింది.

Samsung Galaxy S23 Ultra ఈ లైనప్ లో వస్తోన్న టాప్ మోడల్. ఇది 12జిబి ర్యామ్ మరియు 1టిబి స్టోరేజీ ఆప్షన్ లో కూడా లభించనున్నట్లు సమాచారం. 1టిబి వేరియంట్ కేవలం శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్ ద్వారా మాత్రమే లభించనుంది. ఇంకా అల్ట్రా కేటగిరీలో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ బేస్ మోడల్, 12జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ కల్గిన మరొక మోడల్ కూడా లభించనున్నాయి.

ఇక Samsung Galaxy S23 Plus మోడల్ అల్ట్రా మరియు స్టాండర్డ్ మోడల్ కి మధ్య ఉంటుంది. ఎస్23 ప్లస్ ఫోన్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

స్టాండర్డ్ Samsung Galaxy S23 ఫోన్ ఈ లైనప్ లో ఎంట్రీ లెవెల్ ప్రీమియమ్ ఆఫరింగ్ గా నిలుస్తుంది. ఈ ఫోన్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభించనుంది. స్టాండర్డ్ వేరియంట్ లో మాత్రమే 128జిబి స్టోరేజీ ఆప్షన్ ఉంటుందని ఈ సమాచారంతో అర్థమవుతోంది.

Samsung Galaxy S23 సిరీస్ లోని 3 డివైజెస్ కూడా బొటానిక్ గ్రీన్, మిస్టీ లిలాక్, ఫాంటమ్ బ్లాక్ మరియు కాటన్ ఫ్లవర్ కలర్ ఆప్షన్స్ లో లభించనున్నాయి. శాంసంగ్ ఈ-స్టోర్ ద్వారా మరిన్ని కలర్ ఆప్షన్స్ లభ్యమవుతాయి.

Samsung Galaxy S23 సిరీస్ స్పెసిఫికేషన్స్

Samsung Galaxy S23 Ultra ఫోన్ ఈసారి ఎన్నో అప్‌గ్రేడ్స్ తో వస్తున్నట్లు సమాచారం. ఈ ఫోన్ ఇదివరకు మోడల్స్ లాగే క్వాడ్ కెమెరా సెటప్ తో వస్తోంది. ప్రైమరీ కెమెరా విషయానికి వస్తే అప్‌గ్రేడ్ గమనించవచ్చు. సరికొత్త 200ఎంపి ప్రైమరీ సెన్సర్ ఎస్23 అల్ట్రాలో భాగమవుతోంది. ఇది కాకుండా, 12ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, రెండు 10ఎంపి టెలీఫోటో కెమెరాలు కలిసి రియర్ కెమెరా విభాగం ఫీచర్ రిచ్ గా ఉండబోతోంది. టెలీఫోటో కెమెరాలు 3x నుంచి 10x ఆప్టికల్ జూమ్ వరకు ఆఫర్ చేస్తాయి.

ఇక ఈ డివైజ్ లో 6.8-ఇంచ్ డైనమిక్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, క్యూహెచ్డీ+ రెజుల్యూషన్, హోల్-పంచ్ కటౌట్ టాప్ సెంటర్ లో ఉంటాయి. ఈ అల్ట్రా డివైజ్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 15 వాట్ వైర్లెస్ చార్జింగ్, 10 వాట్ రివర్స్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయి. ఈ ఫోన్ ఎస్-పెన్ తో వస్తోంది.

Samsung Galaxy S23 Plus ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 10ఎంపి టెలీఫోటో 3x ఆప్టికల్ జూమ్ లెన్స్ ఉంటాయి. ఈ ఫోన్ లో 4700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. స్టాండర్డ్ మోడల్ లో 3900 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 25 వాట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.

ఈ ఫోన్ లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. స్టాండర్డ్ మోడల్ అయిన Samsung Galaxy S23 5G లో 6.1-అమోలెడ్ డిస్ప్లే, సెంటర్ హోల్-పంచ్ కటౌట్, 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

Samsung Galaxy S23 సిరీస్ లోని మూడు ఫోన్లు కూడా ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి. ఈ సిరీస్ లోని 3 ఫోన్లు 12ఎంపి ఫ్రంట్ కెమెరా, స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో వస్తాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.