హైలైట్స్
- నెట్టింట్లో ప్రత్యక్షమైన Samsung Galaxy S23 స్పెసిఫికేషన్స్
- వచ్చే ఏడాది లాంచ్ కానున్న Samsung Galaxy S23
- స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, 50ఎంపి కెమెరా, 3900 ఎంఏహెచ్ బ్యాటరీ, 25వాట్ ఫాస్ట్ చార్జింగ్ వంటి స్పెసిఫికేషన్స్ తో రానున్న Samsung Galaxy S23
Samsung Galaxy S23 స్పెసిఫికేషన్స్ నెట్టింట్లో ప్రత్యక్షమవుతున్నాయి. వచ్చే ఏడాది Samsung Galaxy S23 సిరీస్ ని లాంచ్ చేయాలని శాంసంగ్ ప్లాన్ చేస్తోంది. మునుపటి విడుదల పరంపరను చూస్తే, Samsung Galaxy S23 డివైజ్ 2023 జనవరి లేదా ఫిబ్రవరి మాసాల్లో లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ లైనప్ లో మూడు మోడల్స్ ఉండనున్నాయి. అవి: Samsung Galaxy S23, Samsung Galaxy S23 Plus, Samsung Galaxy S23 Ultra. అయితే ఇప్పటి వరకు శాంసంగ్ సంస్థ రాబోవు Samsung Galaxy S23 సిరీస్ కు సంబంధించి ఎటువంటి వివరాలను వెల్లడించలేదు. అయితే లాంచ్ కి ఇంకా నెలల సమయం ఉండగానే అప్పుడే నెట్టింట్లో లీక్స్ ప్రత్యక్షమవుతున్నాయి.
Samsung Galaxy S23 కి సంబంధించిన లేటెస్ట్ లీక్ ని ప్రముఖ టిప్‌స్టర్ యోగేశ్ బ్రార్ రివీల్ చేశాడు. రీసెంట్ గా స్టాండర్డ్ వేరియంట్ గీక్‌బెంచ్ వెబ్‌సైట్ పై కనిపించింది. మరి Samsung Galaxy S23 స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం పదండి.
Samsung Galaxy S23 స్పెసిఫికేషన్స్
2023 లో Samsung Galaxy S23 స్మార్ట్ ఫోన్ భారత్ తో పాటు, ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అవుతోంది. లాంచ్ తేదీని ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఈలోపు ప్రముఖ టిప్‌స్టర్ బ్రార్ స్టాండర్డ్ వేరియంట్ Samsung Galaxy S23 యొక్క స్పెసిఫికేషన్స్ ని లీక్ చేశాడు. ఈ డివైజ్ 3900 ఎంఏహెచ్ బ్యాటరీ, 25వాట్ ఫాస్ట్ చార్జింగ్, 15వాట్ వైర్లెస్ చార్జింగ్ తో వస్తోంది.
6.1-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, సెంటర్ హోల్-పంచ్ కటౌట్ కలిగి ఉన్నట్లు లీకైన రెండర్స్ ద్వారా స్పష్టమవుతోంది.
ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా ఉండనుంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తోంది. ఈ డివైజ్ లో ఇంకా 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 10ఎంపి టెలీఫోటో లెన్స్ ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 10ఎంపి కెమెరా ఉండనుంది.
8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో Samsung Galaxy S23 ఫోన్ ని శాంసంగ్ లాంచ్ చేయనుంది. ఇకపోతే ఈ డివైజ్ లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ ఉండనుంది. Samsung Galaxy S23 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత వన్ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
లీకైన వివరాలను బట్టి, Samsung Galaxy S23 ఇంక్రిమెంటల్ అప్‌గ్రేడ్ అని అర్థమవుతోంది. ఈ ఫోన్ కాస్త కొత్త డిజైన్ తో రానుంది. గెలాక్సీ ఎస్23 అల్ట్రాతో కొంచెం పోలికలు ఉంటాయి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.