ఇటీవలె Samsung సంస్థ Samsung Galaxy S23 సిరీస్ ని లాంచ్ చేసింది. అయితే Samsung Galaxy S23 FE ని కూడా శాంసంగ్ లాంచ్ చేయబోతున్నట్లు దక్షిణ కొరియా మీడియా వార్తలను ప్రచురించింది. దీంతో ఫ్యాన్ ఎడిషన్ డివైజెస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.
ఇప్పటికే పలు ఫ్లాగ్షిప్ ఫోన్ల ఫ్యాన్ ఎడిషన్స్ విడుదల చేసిన శాంసంగ్ ఆ ప్రయత్నంలో విజయం సాధించింది. కస్టమర్ల నుంచి ఫ్యాన్ ఎడిషన్ ఫోన్లకు బాగానే ఆదరణ లభించింది. దీంతో Samsung Galaxy S23 FE ని త్వరలోనే లాంచ్ చేయాలని శాంసంగ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
గతంలో Samsung Galaxy S10 వేరియంట్ కి ఎకనమిక్ వర్షన్ Samsung Galaxy S10e ని శాంసంగ్ రంగంలోకి దింపింది. తర్వాత Galaxy S20 FE 4G, 5G మరియు Samsung Galaxy S21 FE 5G ఫోన్లు ఫ్యాన్ ఎడిషన్ సిరీస్ లో కస్టమర్లను పలకరించాయి. అయితే గత ఫ్లాగ్షిప్ Galaxy S22 యొక్క ఫ్యాన్ ఎడిషన్ Galaxy S22 FE ని మాత్రం శాంసంగ్ తీసుకురాలేదు. చిప్స్ కొరత వల్లన ఈ ఫోన్ ని తీసుకురాలేకపోయారు.
Samsung Galaxy S23 FE చిప్సెట్, లాంచ్ వివరాలు
2022 ఆరంభంలో శాంసంగ్ సంస్థ Samsung Galaxy S21 FE ని మార్కెట్ లోకి తీసుకొచ్చింది. అయితే Samsung Galaxy S21 FE తో పోల్చితే Samsung Galaxy S20 FE డివైజెస్ బాగా అమ్ముడయ్యాయి. కేవలం 2020 లోనే శాంసంగ్ 10 మిలియన్ యూనిట్లను విక్రయించింది.
Samsung Galaxy S21 FE లో ఉన్న Exynos 2100 చిప్సెట్ వల్లన 2023 లో కూడా జనాలు Samsung Galaxy S20 FE ని కొనేందుకు ఆసక్తి చూపించారు. అసలైతే, Galaxy S22 Ultra సేల్స్ పెంచేందుకే Galaxy S22 FE ని తీసుకురాలేదని సమాచారం. అయితే ఇది ఎంతవరకు నిజమో తెలియదు. ఈ విషయం పక్కనబెడితే, లేటెస్ట్ గా Galaxy S23 FE కి సంబంధించిన ఒక వార్త ఆసక్తిని కలిగిస్తోంది. ఆ విషయమేంటో తెలుసుకుందాం పదండి.
తాజా సమాచారాన్ని బట్టి, Samsung Galaxy S23 FE క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. FE సిరీస్ కి ఛార్మ్ ని తీసుకొచ్చేందుకు శాంసంగ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది. అలాగే సేల్స్ కూడా పెంచేందుకు ధరను కాస్త అందుబాటులో ఉండేట్లుగా పెట్టాలని శాంసంగ్ భావిస్తోందట. Qualcomm Snapdragon 8+ Gen 1 ప్రాసెసర్ 4 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. ఉత్తమమైన పెర్ఫామెన్స్, పవర్ ఎఫిషియెన్సీని ఈ చిప్ కలిగి ఉంటుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.
