Samsung లవర్స్ ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది. నేడు భారత్ తో పాటు, గ్లోబల్ గా Samsung Galaxy S23 సిరీస్ ని శాంసంగ్ లాంచ్ చేసింది. గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ లో గెలాక్సీ ఎస్23 సిరీస్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. Samsung Galaxy S23 సిరీస్ లో మొత్తం 3 మోడల్స్ ఉన్నాయి. అవి: Samsung Galaxy S23 Ultra, Samsung Galaxy S23 Plus, Samsung Galaxy S23. ఈ ఆర్టికల్ లో మనం Samsung Galaxy S23 Ultra గురించి తెలుసుకుందాం.
టాప్ మోడల్ అయిన Samsung Galaxy S23 Ultra స్మార్ట్ ఫోన్ 200ఎంపి భారీ కెమెరాతో వచ్చింది. ఈసారి రెండు 10ఎంపి టెలీఫోటో లెన్సెస్ తో ఈ ఫోన్ రావడం విశేషం. 12జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ హయ్యస్ట్ మెమొరీ మోడల్ గా ఉంది. 5జీ కనెక్టివిటీ, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, వన్‌యూఐ 5.1, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.3 వంటి స్పెసిఫికేషన్స్ తో ఈ ఫోన్ వచ్చింది. సరే, ఓసారి Samsung Galaxy S23 Ultra యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలను తెలుసుకుందాం పదండి.
Samsung Galaxy S23 Ultra ధర, కలర్ ఆప్షన్స్
Samsung Galaxy S23 Ultra స్మార్ట్ ఫోన్ అంచనా ధర ఎలా ఉందో చూద్దాం. Samsung Galaxy S23 Ultra ప్రారంభ ధర భారత్ లో రూ.1,14,999 గా ఉండే అవకాశం ఉంది. Samsung Galaxy S23 Ultra డివైజ్ ఫాంటమ్ బ్లాక్, బొటానిక్ గ్రీన్, కాటన్ ఫ్లవర్, మిస్టీ లైలాక్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.
Samsung Galaxy S23 Ultra స్పెసిఫికేషన్స్
Samsung Galaxy S23 Ultra స్మార్ట్ ఫోన్ 6.8-ఇంచ్ క్యూహెచ్డీ+ ఎడ్జ్ స్క్రీన్, డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ డిస్ప్లే, సూపర్ స్మూథ్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, విజన్ బూస్టర్, ఎన్హాన్స్‌డ్ కంఫర్ట్ తో వచ్చింది.
Samsung Galaxy S23 Ultra స్మార్ట్ ఫోన్ 163.4 మిల్లీ మీటర్ల పొడవు, 78.1 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.9 మిల్లీ మీటర్ల మందం, 234 గ్రాముల బరువు ఉంటుంది.
Samsung Galaxy S23 Ultra స్మార్ట్ ఫోన్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్ తో వచ్చింది. ఇందులో 200ఎంపి వైడ్ కెమెరా (F/1.7, FOV 85డిగ్రీస్), 12ఎంపి అల్ట్రావైడ్ కెమెరా (F/2.2, FOV 120 డిగ్రీస్), 10ఎంపి టెలీఫోటో లెన్స్ (3X ఆప్టికల్ జూమ్, F2.4, FOV 36 డిగ్రీస్), 10ఎంపి టెలీఫోటో లెన్స్ (10X ఆప్టికల్ జూమ్, F4.9, FOV 11 డిగ్రీస్) ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 12ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఇది F/2.2, FOV 80 డిగ్రీస్ కలిగి ఉంది.
Samsung Galaxy S23 Ultra స్మార్ట్ ఫోన్ లో Snapdragon 8 Gen 2 ప్రాసెసర్ వాడారు. ఈ చిప్ ని ప్రత్యేకించి ఎస్23 అల్ట్రా కొరకు రూపొందించారు. ఈ డివైజ్ 12జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ, 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ, 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.
Samsung Galaxy S23 Ultra స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఫాస్ట్ వైర్లెస్ చార్జింగ్ 2.0 టెక్నాలజీతో వస్తోంది. వైర్లెస్ పవర్ షేర్ కూడా ఈ ఫోన్ లో ఉంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.
