Home News 6.8-inch డిస్ప్లే, 8 Gen 2 ప్రాసెసర్ తో వస్తున్న Samsung Galaxy S23 Ultra

6.8-inch డిస్ప్లే, 8 Gen 2 ప్రాసెసర్ తో వస్తున్న Samsung Galaxy S23 Ultra

హైలైట్స్

Samsung Galaxy S23 Ultra స్మార్ట్ ఫోన్ TENAA వెబ్ సైట్ పై కనిపించింది. దీంతో ఈ ఫ్లాగ్షిప్ డివైజ్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. ఇదివరకు Samsung Galaxy S23 మోడల్స్ FCC సర్టిఫికేషన్ పై కనిపించాయి. Samsung Galaxy S23 మోడల్స్ గత మోడల్ గెలాక్సీ ఎస్22 సిరీస్ కి సక్సెసర్ గా వస్తున్నాయి. TENAA లిస్టింగ్ ప్రకారం, Samsung Galaxy S23 Ultra 163.4 మిల్లీ మీటర్ల పొడవు, 78.1 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.9 మిల్లీ మీటర్ల మందం, 233 గ్రాముల బరువు ఉండనుంది. అంటే గత మోడల్ గెలాక్సీ ఎస్22 అల్ట్రా మాదిరి డైమెన్షన్స్ నే ఎస్23 అల్ట్రా కూడా కలిగి ఉందన్నమాట. అలాగే శాంసంగ్ డిజైన్ పరంగా కూడా ఏమీ మార్పులు చేసి ఉండకపోవచ్చు.

ఇంకా చూస్తే, Samsung Galaxy S23 Ultra 6.8-ఇంచ్ డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో రానున్నట్లు తెలుస్తోంది. శాంసంగ్ కంపెనీ గ్లోబల్ గా కూడా ఇదే చిప్సెట్ తో ఫోన్ ని లాంచ్ చేసే అవకాశం ఉందని సమాచారం.

TENAA పై కనిపించిన Samsung Galaxy S23 Ultra

TENAA ప్రకారం, Samsung Galaxy S23 Ultra 4,885 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. అయితే దీన్ని 5000ఎంఏహెచ్ యూనిట్ గా మార్కెట్ చేసే అవకాశం ఉంది. Samsung Galaxy S23 Ultra లో 6.8-ఇంచ్ డిస్ప్లే, 1440*3088 పిక్సెల్స్ రెజుల్యూషన్, 19.3:9 యాస్పెక్ట్ రేషియో ఉంటాయి.

Samsung Galaxy S23 Ultra ఫోన్ యొక్క సీపీయూ ఫ్రీక్వెన్సీ క్లస్టర్స్ 3.36 గిగాహెర్ట్జ్, 2.8 గిగాహెర్ట్జ్ మరియు 2.0 గిగాహెర్ట్జ్ గా ఉన్నాయి. Samsung Galaxy S23 Ultra హయ్యర్ క్లాక్ స్పీడ్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ డివైజ్ 8జిబి లేదా 12జిబి ర్యామ్ మరియు 256జిబి/512జిబి లేదా 1టీబీ స్టోరేజీ తో రానుంది.

TENAA లిస్టింగ్ Samsung Galaxy S23 Ultra యొక్క కెమెరా స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేయలేదు. Samsung Galaxy S23 Ultra లో 200 ఎంపి ప్రైమరీ కెమెరా, 12ఎంపి సెకండరీ లెన్స్, 10ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటాయని అంచనా. మెయిన్ కెమెరా 8కే వీడియో రికార్డింగ్ సపోర్ట్ తో వస్తోంది. ఇక శాటిలైట్ కమ్యూనికేషన్ సపోర్ట్ ఈ ఫోన్ లో ఉంటుందో లేదో ఇంకా తెలియదు. ఐఫోన్ 14 లో ఈ తరహా కమ్యూనికేషన్ సపోర్ట్ ని ఇంట్రడ్యూస్ చేశారు.

శాంసంగ్ విషయానికి వస్తే, ఇరిడియమ్ శాటిలైట్ నెట్వర్క్ ని వాడబోతున్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ నెట్వర్క్ ద్వారా యూజర్లు షార్ట్ మెసేజెస్ తో పాటు, తమ స్నేహితులతో ఇమేజెస్ ని కూడా పంచుకోవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.