ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలోనే తన తదుపరి ఫ్లాగ్షిప్ సిరీస్ Samsung Galaxy S24 ని లాంచ్ చేయనుంది. ఈ సిరీస్ లాంచ్ కోసం శాంసంగ్ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. 2024 ఆరంభంలో లాంచ్ ఉంటుందని రీసెంట్ గా వార్తలు బయటకు వచ్చాయి. ఈలోపు స్టాండర్డ్ వేరియంట్ Samsung Galaxy S24 యొక్క 5కే రెండర్స్, 360 డిగ్రీస్ వీడియో లీక్ అయ్యాయి. దీంతో లుక్, డిజైన్ రివీల్ అయ్యాయి. సరే, ఓసారి Samsung Galaxy S24 డివైజ్ కి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం పదండి.
Samsung Galaxy S24 రెండర్స్ (లీక్)
- Samsung Galaxy S24 కి సంబంధించిన 5కే రెండర్స్, 360 డిగ్రీస్ వీడియో నెట్టింట్లో లీక్ అయ్యాయి. వీటిని టిప్‌స్టర్ OnLeaks మరియు SmartPrix రివీల్ చేశాయి.
- ఇమేజెస్ ని బట్టి Samsung Galaxy S24 డివైజ్ బాక్సీ మిడ్ ఫ్రేమ్, రౌండెడ్ కార్నర్స్, ఫ్లాట్ ఎడ్జెస్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.
- డివైజ్ లో సెంటర్డ్ పంచ్ హోల్ కటౌట్ కనిపిస్తోంది.
- ఫోన్ లో అల్ట్రావైడ్ బ్యాండ్ (UWB) యాంటినా కనిపిస్తోంది. గెలాక్సీ ఎస్ సిరీస్ ఫోన్లలో ఇది మొదటిసారిగా కనిపిస్తోంది.
- Samsung Galaxy S24 డివైజ్ తెలుగు రంగులో కనిపిస్తోంది. చూస్తుంటే మ్యాట్ ఫినిషింగ్ ఉన్నట్లు తెలుస్తోంది.
- బ్యాక్ ప్యానెల్ పై బాటమ్ లో శాంసంగ్ బ్రాండింగ్ కనిపిస్తోంది.
- Samsung Galaxy S24 ని చూస్తుంటే ఓవరాల్ గా గత మోడల్ ఎస్23 మాదిరే కనిపిస్తోంది.
- డైమెన్షన్స్ విషయానికి వస్తే, Samsung Galaxy S24 డివైజ్ 147 మి.మీ పొడవు, 70.5 మి.మీ వెడల్పు, 7.6 మి.మీ మందం ఉంటుంది.
Samsung Galaxy S24 స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Samsung Galaxy S24 లో డైనమిక్ ఎమ్13 అమోలెడ్ ఎల్టీపీవో ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
- ప్రాసెసర్: Samsung Galaxy S24 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ లేదా ఎగ్జినోస్ 2400 చిప్ ఉండే అవకాశం ఉంది.
- మెమొరీ: Samsung Galaxy S24 లో 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఉంటాయి.
- కెమెరా: Samsung Galaxy S24 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 10ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 12ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- బ్యాటరీ: Samsung Galaxy S24 లో పవర్ బ్యాకప్ కోసం 4700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: Samsung Galaxy S24 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కనెక్టివిటీ: Samsung Galaxy S24 లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉంటాయి.
