Samsung Galaxy S24 5G: రూ.18,000 తక్కువకే శాంసంగ్ గెలాక్సీ ఎస్24 5జీ, ఆఫర్ వివరాలు తెలుసుకోండి

Highlights

  • Samsung Galaxy S24 5G డిస్కౌంట్ ఆఫర్
  • రూ.18,000 వరకు ఫోన్ పై డిస్కౌంట్
  • డిస్కౌంట్ + ప్రైస్ డ్రాప్ కలిపి ఆఫర్

Samsung ఫ్లాగ్షిప్ ఫోన్లంటే జనాల్లో ఎంతో క్రేజ్ ఉన్న సంగతి మనకు తెలిసిందే. అయితే వాటి ఖరీదు ఎక్కువగా ఉండటంతో అందరూ కొనలేరు. కానీ, అప్పుడప్పుడు కంపెనీ తగ్గింపు ధరలు, బ్యాంక్ డిస్కౌంట్లు కలుపుకుంటే శాంసంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్‌ని సొంతం చేసుకోవడం తేలికే. అలాంటి సమయమే ఇప్పుడు కస్టమర్ల చెంతకు వచ్చింది. Samsung Galaxy S24 5G పై డిస్కౌంట్ మరియు ధర తగ్గింపు ఆఫర్ కలుపుకుని ఏకంగా రూ.18,000 వరకు యూజర్లకు ప్రయోజనం లభించనుంది. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Samsung Galaxy S24 5G ఆఫర్ వివరాలు

Samsung Galaxy S24 5G స్మార్ట్‌ఫోన్ 3 మెమొరీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లాంచ్ ధర నుంచి రూ.12,000 ను కంపెనీ తగ్గించింది. ఇది పరిమిత కాలం పాటు మాత్రమే. ఇంకా కూపన్ డిస్కౌంట్ రూ.5,500 లభించనుంది. అలాగే రూ.1,000 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ కూడా ఉంది. ఇవన్నీ కలుపుకుంటే రూ.18,000 వరకు యూజర్ కు బెనిఫిట్ లభిస్తుంది. క్రింద ఇచ్చిన టేబుల్‌లో 3 వేరియంట్స్ యొక్క ధరలను చూడండి.

అమెజాన్ ప్లాట్ఫామ్ లింక్ పై క్లిక్ చేసి ఆఫర్ వివరాలను మీరు స్వయంగా చూడండి.

Samsung Galaxy S24 ని మీరు కొనొచ్చంటారా?

Samsung Galaxy S24, శాంసంగ్ యొక్క లేటెస్ట్ ఫ్లాగ్షిప్ డివైజ్. ఇంకా నెక్ట్స్ జనరేషన్ సిరీస్ లాంచ్ కాలేదు. కాబట్టి లేటెస్ట్ ఫోన్ అనేది ఒక ప్లస్ పాయింట్. ఇంకా ఇందులో అందించిన పవర్ఫుల్ ఎగ్జినోస్ 2400 డెకా-కోర్ చిప్సెట్ మరొక ప్లస్ పాయింట్. 50ఎంపి మెయిన్ కెమెరా, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, అద్భుతమైన డైనమిక్ అమోలెడ్ డిస్ప్లే, 2600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి చక్కటి స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. కాబట్టి, ఈ ఫోన్ మీకు మంచి ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది.

Samsung Galaxy S24 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Samsung Galaxy S24 లో 6.2-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, డైనమిక్ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Samsung Galaxy S24 లో ఎగ్జినోస్ 2400 డెకా-కోర్ ప్రాసెసర్ ఉంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3.2 గిగాహెర్ట్జ్.

కెమెరా: Samsung Galaxy S24 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఇచ్చారు. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 10ఎంపి టెలీఫోటో 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 12ఎంపి ఏఐ కెమెరా అందించారు.

బ్యాటరీ, చార్జింగ్: Samsung Galaxy S24 లో పవర్ బ్యాకప్ కోసం 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Samsung Galaxy S24 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: Samsung Galaxy S24 లో 5జీ, డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.