ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలో Samsung Galaxy S24 సిరీస్ ని లాంచ్ చేయనుంది. 2024 ఆరంభంలో Samsung Galaxy S24 సిరీస్ లాంచ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ లైనప్ లో మొత్తం 3 మోడల్స్ రానున్నాయి. అవి: Samsung Galaxy S24, Samsung Galaxy S24 Plus, Samsung Galaxy S24 Ultra. గత కొన్ని రోజులుగా ఈ ఫ్లాగ్షిప్ ఫోన్లు వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా WindowsReport Samsung Galaxy S24 సిరీస్ కలర్ ఆప్షన్స్ రివీల్ చేసింది.
Samsung Galaxy S24 సిరీస్ కలర్ ఆప్షన్స్
- Samsung Galaxy S24 సిరీస్ నాలుగు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి: టైటానియమ్ బ్లాక్, టైటానియమ్ గ్రే, టైటానియమ్ వయొలెట్, టైటానియమ్ యెల్లో.
- Samsung Galaxy S24, Samsung Galaxy S24 Plus డివైజెస్ ఆనిక్స్ బ్లాక్, మార్పుల్ గ్రే, కొబాల్ట్ వయొలెట్, అంబర్ యెల్లో కలర్ ఆప్షన్స్ లో లభిస్తాయి.
- Samsung Galaxy S24 Ultra కూడా ఇవే కలర్స్ లో లభ్యమవుతాయి కానీ, మార్కెటింగ్ నేమ్స్ వేరేగా ఉంటాయని సమాచారం. ఇకపోతే Samsung Galaxy S24 Ultra టైటానియమ్ మెటల్ తో వస్తుండటం విశేషం.
Samsung Galaxy S24 Ultra స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Samsung Galaxy S24 ప్లస్, అల్ట్రా మోడల్స్ లో 6.65-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, టైటానియమ్ చాసిస్ ఉంటాయి.
- ప్రాసెసర్: Samsung Galaxy S24 సిరీస్ లోని అల్ట్రా మోడల్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ ని కలిగి ఉంటుంది. ఇతర మోడల్స్ లో ఎగ్జినోస్ 2400 చిప్ ఉంటుందని అంచనా.
- మెమొరీ: Samsung Galaxy S24 అల్ట్రా మోడల్ 16జిబి వరకు ర్యామ్, 2టిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. ఇతర రెండు మోడల్స్ 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆఫర్ చేస్తాయి.
- కెమెరా: Samsung Galaxy S24 అల్ట్రా లో 200ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి టెలీఫోటో లెన్స్, 10ఎంపి పెరిస్కోప్ లెన్స్ ఉంటాయి. ఇతర రెండు మోడల్స్ లో 50ఎంపి ప్రైమరీ కెమెరా ఉంటుంది. మూడు మోడల్స్ లో కూడా 12ఎంపి సెల్ఫీ కెమెరా ఉంటుంది.
- బ్యాటరీ: Samsung Galaxy S24 అల్ట్రా లో 5100 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. Samsung Galaxy S24, Samsung Galaxy S24+ లో 5000 ఎంఏహెచ్ లేదా 4900 ఎంఏహెచ్ బ్యాటరీలు ఉండవచ్చు. ఇక అన్ని మోడల్స్ కూడా 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చే అవకాశం ఉంది.
- ఓఎస్: Samsung Galaxy S24 సిరీస్ ఫోన్లు ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్యూఐ 6 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.
