ప్రముఖ టెక్ కంపెనీ Samsung 2024 లో తన S24 సిరీస్‌ని లాంచ్ చేయబోతోంది. ఈ లైనప్ లో Samsung Galaxy S24, Samsung Galaxy S24 Plus మరియు Samsung Galaxy S24 Ultra వంటి మూడు మొబైల్‌లు ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఈసారి ఫోన్లలో రెండు రకాల ప్రాసెసర్లను శాంసంగ్ సంస్థ వినియోగించనుందని సమాచారం. చిప్సెట్ తయారీ సంస్థ క్వాల్కామ్ సీఈఓ ఈ మేరకు ఓ కీలక ప్రకటన చేశారు. ఈ పోస్ట్ ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకోండి.
Samsung Galaxy S24 సిరీస్ ప్రాసెసర్ వివరాలు
- Qualcomm CEO క్రిస్టియానో అమోన్ ప్రకారం, S24 సిరీస్ లాంచ్ తో అత్యధిక మార్కెట్ వాటాను పొందాలని సదరు సంస్థ భావిస్తున్నట్లు అర్థమవుతోంది.
- దీనితో, S24 లైనప్‌లో Snapdragon 8 Gen 3 మరియు Exynos 2400 చిప్సెట్ అందుబాటులో ఉంటుందని దాదాపుగా ధృవీకరించబడింది.
- నివేదిక ప్రకారం, Galaxy S24 Ultra డివైజ్ ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్స్ లోనూ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ తో రానుంది.
- ఉత్తర అమెరికాకు వచ్చే Galaxy S24 మరియు S24 Plus మోడల్‌లు స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్లు మరియు ఇతర చోట్ల Exynos ప్రాసెసర్లతో రావచ్చు.
Samsung Galaxy S24 సిరీస్ స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిజైన్: Samsung Galaxy S24 సిరీస్ లో వస్తోన్న డివైజెస్ కర్వ్డ్ ఎడ్జెస్, టైటానియమ్ ఫ్రేమ్ తో వస్తున్నట్లు సమాచారం.
- డిస్ప్లే: Samsung Galaxy S24 వేరియంట్ 6.2-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, ప్లస్ వేరియంట్ 6.7-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, అల్ట్రా మోడల్ 6.8-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్ కలిగి ఉంటాయి. టాప్ మోడల్ అల్ట్రా 2,200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కి సపోర్ట్ చేస్తుంది.
- ప్రాసెసర్: Samsung Galaxy S24 మరియు Samsung Galaxy S24+ డివైజెస్ ఎగ్జినోస్ 2400 చిప్సెట్ తో వస్తున్నాయి. ఇకపోతే అల్ట్రా మోడల్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ తో వస్తోంది.
- కెమెరా: Samsung Galaxy S24 Ultra లో 200ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 50ఎంపి టెలీఫోటో లెన్స్, 10ఎంపి పెరిస్కోప్ లెన్స్ ఉంటాయి. స్టాండర్డ్ మరియు ప్లస్ వేరియంట్స్ లో 50ఎంపి ప్రైమరీ లెన్స్ ఉంటుంది. ఈ మూడు ఫోన్లలో కూడా 12ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- బ్యాటరీ: Samsung Galaxy S24 లో 4,900 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉంటాయి. ప్లస్ వేరియంట్ లో 4,900 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉంటాయి. అల్ట్రా మోడల్ లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: Samsung Galaxy S24 సిరీస్ ఫోన్లు ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.
- కనెక్టివిటీ: Samsung Galaxy S24 సిరీస్ లో వస్తోన్న డివైజెస్ లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, ఎన్ఎఫ్సీ వంటి ఆప్షన్స్ ఉంటాయి.
