ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలో తన ఫ్లాగ్షిప్ సిరీస్ S24 ని లాంచ్ చేసే ప్రయత్నాల్లో ఉంది. 2024 లో ఈ సిరీస్ మార్కెట్ లోకి వస్తుంది. ఈ లైనప్ లో Samsung Galaxy S24, Samsung Galaxy S24 Plus, Samsung Galaxy S24 Ultra డివైజెస్ ఎంట్రీ ఇవ్వనున్నాయి. తాజాగా Samsung Galaxy S24 Ultra మోడల్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ వెబ్సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఇండియా లాంచ్ కన్ఫర్మ్ అయ్యింది. సరే, ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.
Samsung Galaxy S24 Ultra బీఐఎస్ లిస్టింగ్
- Samsung Galaxy S24 Ultra డివైజ్ తాజాగా బీఐఎస్ సర్టిఫికేషన్ సైట్ లో లిస్ట్ అయ్యింది. SM-S928B/DS అనే మోడల్ నంబర్ ని ఈ ఫోన్ కలిగి ఉంది.
- బీఐఎస్ లిస్టింగ్ ద్వారా Samsung Galaxy S24 Ultra కి సంబంధించిన మరే ఇతర వివరాలు బయటకు రాలేదు.
- 2024 జనవరిలో భారత్ లో Samsung Galaxy S24 Ultra లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
- Samsung Galaxy S24 Ultra మోడల్ తో పాటు Samsung Galaxy S24, Samsung Galaxy S24 Plus కూడా లాంచ్ అవ్వనున్నాయి.
Samsung Galaxy S24 Ultra స్పెసిఫికేషన్స్ (అంచనా)
- స్క్రీన్: Samsung Galaxy S24 Ultra లో 6.7-ఇంచ్ డబ్ల్యూక్యూహెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+, డాల్బీ విజన్ ఉంటాయి.
- ప్రాసెసర్: Samsung Galaxy S24 Ultra లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది.
- కెమెరా: Samsung Galaxy S24 Ultra లో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 200ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి పెరిస్కోప్ 5x జూమ్ కెమెరా, 10ఎంపి 3x జూమ్ టెలీఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 12ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- బ్యాటరీ: Samsung Galaxy S24 Ultra లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: Samsung Galaxy S24 Ultra డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్యూఐ 6 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కనెక్టివిటీ: Samsung Galaxy S24 Ultra లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉంటాయి.
