Home News Galaxy Unpacked ఈవెంట్ తేదీని ప్రకటించిన Samsung

Galaxy Unpacked ఈవెంట్ తేదీని ప్రకటించిన Samsung

హైలైట్స్

శాంసంగ్ సంస్థ తాజాగా తన గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ ని అఫీషియల్ గా ప్రకటించింది. ఫిబ్రవరి 1 న గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ జరగబోతోంది. ఈవెంట్ ఉదయం 10 గంటలకు (రాత్రి 11.30 గంటలకు) శాన్ ఫ్రాన్సిస్కోలో ప్రారంభమవుతుంది. ఆవిష్కరణ యొక్క కొత్త తరం వస్తోందని శాంసంగ్ తన ఇన్విటేషన్ లో పేర్కొంది. ఈ ఈవెంట్ లో గెలాక్సీ ఎస్23, గెలాక్సీ ఎస్23 ప్లస్, గెలాక్సీ ఎస్23 అల్ట్రా మోడల్స్ లాంచ్ అవుతున్నాయి. అలాగే వీటితో పాటు, కొత్త స్మార్ట్ వాచ్ మరియు టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ కూడా లాంచ్ కానున్నాయి.

Galaxy Unpacked 2023 ఈవెంట్ ఫిబ్రవరి 1 న జరగనుంది. ఈసారి రాబోవు గెలాక్సీ ఎస్-సిరీస్ ఫోన్లు అల్టిమేట్ ప్రీమియమ్ ఎక్స్‌పీరియన్స్ ని అందిస్తాయని శాంసంగ్ చెబుతోంది. మరోవైపు శాంసంగ్ లవర్స్ ఈ ఈవెంట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Galaxy Unpacked 2023 నుంచి ఏం ఆశించవచ్చు?

Galaxy Unpacked 2023 ఈవెంట్ ఫిబ్రవరి 1 న జరగనుంది. ఈమేరకు శాంసంగ్ నుంచి ఇన్విటేషన్ రిలీజ్ అయ్యింది. ఇప్పటికే గత కొన్ని నెలల నుంచి గెలాక్సీ ఎస్23 సిరీస్ గురించి ఎన్నో విషయాలు బయటకు వచ్చాయి. లీకైన రెండర్స్ ద్వారా డిజైన్ ఎలా ఉండనుందో తెలిసింది. ఇంకా రూమర్డ్ స్పెసిఫికేషన్స్ ద్వారా ఈ డివైజెస్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, మూడు విభిన్న స్క్రీన్ సైజెస్, 200ఎంపి కెమెరా, 45 వాట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు తెలిసింది. మరి రూమర్లు ఎంతవరకు నిజమనేది ఈవెంట్ రోజున బయటపడనుంది.

అయితే శాంసంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్ తో పాటు ఇతర గ్యాడ్జెట్స్ ఏవి లాంచ్ కానున్నాయో ఇంకా తెలియదు. అయితే శాంసంగ్ కంపెనీ, Buds 2 Pro, Galaxy Watch 5 ని కూడా లాంచ్ చేయనున్నట్లు సమాచారం. లాంచ్ సమయంలో పూర్తి వివరాలు తెలియనున్నాయి.

Samsung Galaxy S23 సిరీస్ భారత్ లో ఎప్పుడు లాంచ్ అవుతుంది?

గ్లోబల్ లాంచ్ తర్వాత కొన్ని రోజులకు భారత్ కి గెలాక్సీ ఫోన్లను తీసుకొస్తుంది శాంసంగ్. గత కొన్నేళ్ళుగా ఇదే తంతు నడుస్తోంది. గతేడాది శాంసంగ్ గెలాక్సీ ఎస్22 గ్లోబల్ లాంచ్ తర్వాత సరిగ్గా వారానికి ఇండియాలో శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ లాంచ్ అయ్యింది. గెలాక్సీ ఎస్23 సిరీస్ విషయంలో కూడా ఇలానే జరగనుందని అంచనా వేయవచ్చు. ఫిబ్రవరి 1 న గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ జరుగుతుంది. తర్వాత వారానికి ఫిబ్రవరి 8 న భారత్ లో శాంసంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్ లాంచ్ అవుతుంది. అన్‌ప్యాక్డ్ ఈవెంట్ కోసం శాంసంగ్ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.