Home News ఆగస్టు 10 న జరగనున్న శాంసంగ్ గెలాక్సీ అన్ ప్యాక్డ్ 2022 ఈవెంట్

ఆగస్టు 10 న జరగనున్న శాంసంగ్ గెలాక్సీ అన్ ప్యాక్డ్ 2022 ఈవెంట్

హైలైట్స్:

కొన్ని నెలల పాటు వచ్చిన లీకులు, రూమర్ల తర్వాత, శాంసంగ్ ఎట్టకేలకు తదుపరి గెలాక్సీ అన్ ప్యాక్డ్ ఈవెంట్ తేదీని ప్రకటించింది. 2022, ఆగస్టు 10 న ఈవెంట్ జరగనుంది. అయితే ఇది ఆన్-లైన్ ఈవెంట్ అని తెలుస్తోంది. ఎందుకంటే, ఈవెంట్ కు సంబంధించిన ప్రమోషనల్ వీడియోలో గాని, ప్రమోషనల్ పోస్టర్ లో గాని ఆఫ్ లైన్ వేదిక వివరాలను పేర్కొనలేదు. ఈ ఈవెంట్ ను శాంసంగ్.కామ్ పై ఉదయం 9 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడవచ్చు. ఈవెంట్ లో శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4, శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4, శాంసంగ్ గెలాక్సీ వాచ్ 5 సిరీస్ (స్టాండర్డ్ వర్షన్ మరియు ప్రో వర్షన్), శాంసంగ్ గెలాక్సీ బడ్స్ 2 ని లాంచ్ చేసే అవకాశముంది.

ఆగస్టు 10 న జరగనున్న Samsung Galaxy Unpacked Event

పైన ప్రమోషనల్ వీడియోలో చూపిన విధంగా, తదుపరి గెలాక్సీ అన్ ప్యాక్డ్ 2022 ఈవెంట్ 2022, ఆగస్టు 10 న జరగబోతున్నట్లు స్పష్టమైంది. వీడియోలో ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్, శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 లిలాక్ కలర్ లో కనిపిస్తోంది. విభిన్న రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశముంది.

Samsung Galaxy Z Fold 4 స్పెసిఫికేషన్స్ (అంచనా)

శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4 లో 7.6 అంగుళాల అమోలెడ్ 2కే డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6.2 అంగుళాల హెచ్డీ+ కవర్ డిస్ప్లే, 10ఎంపి సెల్ఫీ కెమెరా, 50ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 12ఎంపి టెలీఫోటో లెన్స్ ఉండనున్నాయి.

ఇప్పుడు బ్యాటరీ వివరాలు చూద్దాం. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4 లో 4,400ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనున్నట్లు సమాచారం. అలాగే ఇది 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉండనుంది. 15 వాట్ వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఇక 10 వాట్ రివర్స్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4 కి శక్తిని అందించనుంది. అలాగే ఈ ఫోన్ లో 12జిబి వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఉన్నాయి. ఇక ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది.

ఈవెంట్ లో శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4, శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4, శాంసంగ్ గెలాక్సీ వాచ్ 5 సిరీస్ (స్టాండర్డ్ వర్షన్ మరియు ప్రో వర్షన్), శాంసంగ్ గెలాక్సీ బడ్స్ 2 ని లాంచ్ చేసే అవకాశముంది. అయితే వీటిలో ఏవేవి కచ్చితంగా లాంచ్ అవుతాయో చెప్పలేం. ఇప్పటికైతే, అందుతోన్న సమాచారాన్ని బట్టి శాంసంగ్ కంపెనీ పైన పేర్కొన్న అన్ని ప్రోడక్ట్స్ ని లాంచ్ చేయబోతుందని తెలుస్తోంది. ఈవెంట్ రోజున మరిన్ని విషయాలు తెలిసే అవకాశముంది. దాంతో పాటు రానున్న రోజుల్లో ఈవెంట్ కు సంబంధించి శాంసంగ్ ఏమైనా హైలైట్స్ ను టీజ్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. అంటే శాంసంగ్ నుంచి మరిన్ని ఆసక్తికర విషయాలను మనం ఆశించవచ్చన్న మాట. రానున్న రోజుల్లో ఏం జరగనుందో చూద్దాం. ఏ విధంగా చూసినా, శాంసంగ్ బ్రాండ్ లవర్స్ కి మాత్రం ఆగస్టు 10 ఒక పండుగ రోజు కానుంది.