ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Samsung తన తదుపరి Galaxy Unpacked ఈవెంట్ లాంచ్ తేదీని అఫీషియల్ గా ప్రకటించింది. ఈ ఈవెంట్ లో శాంసంగ్ సంస్థ Galaxy Z Fold 5, Galaxy Flip 5 ఫోల్డబుల్ ఫోన్లను లాంచ్ చేస్తుందని సమాచారం. సరే, ఓసారి శాంసంగ్ నిర్వహించబోయే గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ తేదీ, సమయం, లైవ్ స్ట్రీమ్ వివరాలు తెలుసుకుందాం పదండి.
Samsung Galaxy Unpacked ఈవెంట్ తేదీ, సమయం, లైవ్ స్ట్రీమ్
జులై 26 వ తేదీన రాత్రి 7 గంటలకు గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ జరగనుంది. శాంసంగ్ వెబ్ సైట్ మరియు యూట్యూబ్ చానల్ ద్వారా ఈ ఈవెంట్ ని చూడవచ్చు. ప్రత్యక్షప్రసారం కానున్న ఈవెంట్ లో శాంసంగ్ తన కొత్త ఉత్పత్తులను లాంచ్ చేయనుంది. కంపెనీ ఇప్పటికే భారత్ లో ప్రీ-రిజర్వ్ సెషన్ ని ప్రారంభించింది.
జులైలో దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో అన్‌ప్యాక్డ్ ఈవెంట్ జరుగుతుందని శాంసంగ్ కన్ఫర్మ్ చేసింది. ఈ ఏడాది శాంసంగ్ నుంచి ఇది రెండవ అన్‌ప్యాక్డ్ ఈవెంట్. ఫిబ్రవరిలో శాన్ ఫ్రాన్సిస్కో లో జరిగిన మొదటి ఈవెంట్ లో Galaxy S23, Book 3 సిరీస్ ని శాంసంగ్ లాంచ్ చేసింది. కానీ, ఈసారి కంపెనీ స్వదేశంలో అన్‌ప్యాక్డ్ ఈవెంట్ ని నిర్వహిస్తోంది.
Samsung India వెబ్‌సైట్ లో మొదలైన ప్రీ-రిజర్వ్ సెషన్
గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ లో Galaxy Z Fold 5, Galaxy Z Flip 5 ఫోల్డబుల్ ఫోన్లు లాంచ్ అవుతాయని అంచనా వేస్తున్నారు. ఇతర ప్రొడక్ట్స్ విషయానికి వస్తే, Galaxy Tab S9, Tab S9 Plus, Tab S9 Ultra ఫ్లాగ్షిప్ ట్యాబ్లెట్స్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
శాంసంగ్ సంస్థ భారత్ లో ప్రీ-రిజర్వేషన్స్ ప్రారంభించింది. రూ.1,999 విలువగల రిఫండబుల్ ప్రీ-రిజర్వ్ పాస్ ని కొనుగోలు చేయవచ్చు. దీని వల్లన మొదటగా కొత్త గెలాక్సీ డివైజెస్ ని దక్కించుకునే అవకాశం పొందవచ్చు. అంతేకాదు, రూ.5,000 ఈ-వోచర్ ని శాంసంగ్ ఆన్‌లైన్ షాప్ లో ఉపయోగించుకోవచ్చు.
