
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung నేడు భారతీయ మార్కెట్ లో Galaxy XCover7 అనే రగ్డ్ ఫోన్ ని భారత్ లో తొలిసారిగా లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఐపీ68 రేటింగ్ మరియు మిలిటరీ గ్రేడ్ రేటింగ్ తో వచ్చింది. అంటే, ఈ డివైజ్ నీరు, దుమ్ము లేదా ఎత్తు నుంచి పడటం లాంటి వాటి నుంచి తట్టుకుని నిలుస్తుంది. Samsung Galaxy XCover7 డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100 చిప్సెట్, 6జిబి ర్యామ్, 50ఎంపి ప్రైమరీ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ తో లాంచ్ అయ్యింది. సరే, ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.
Samsung Galaxy XCover7 ధర మరియు లభ్యత
- Samsung Galaxy XCover7 స్మార్ట్‌ఫోన్ భారత్ లో స్టాండర్డ్ మరియు ఎంటర్‌ప్రైజ్ ఎడిషన్స్ లో లాంచ్ అయ్యింది.
- Samsung Galaxy XCover7 స్టాండర్డ్ మోడల్ ధర రూ.27,208 గా ఉంది. ఎంటర్‌ప్రైజ్ ఎడిషన్ ధర రూ.27,530 గా ఉంది.
- స్టాండర్డ్ మోడల్ పై 1 ఏడాది వ్యారంటీ, ఎంటర్‌ప్రైజ్ ఎడిషన్ పై 2 ఏళ్ళ వ్యారంటీ లభిస్తుంది.
- శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్ మరియు శాంసంగ్ కార్పొరేట్ స్టోర్ ద్వారా Samsung Galaxy XCover7 ని కొనుగోలు చేయవచ్చు.
- Samsung Galaxy XCover7 ఎంటర్‌ప్రైజ్ ఎడిషన్ పై కంపెనీ 12 నెలల Knox Suite సబ్‌స్క్రిప్షన్ ని ఆఫర్ చేస్తోంది.
Samsung Galaxy XCover7 స్పెసిఫికేషన్స్
- స్క్రీన్: Samsung Galaxy XCover7 లో 6.6-ఇంచ్ డిస్ప్లే అందించారు.
- ప్రాసెసర్: Samsung Galaxy XCover7 లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ వాడారు.
- ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy XCover7 లో 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి.
- కెమెరా: Samsung Galaxy XCover7 లో 50ఎంపి సింగిల్ రియర్ కెమెరా ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
- బ్యాటరీ: Samsung Galaxy XCover7 లో పవర్ బ్యాకప్ కోసం 4,050 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.
- సెక్యూరిటీ: Samsung Galaxy XCover7 లో భద్రత కోసం MIL-STD-810H మిలిటరీ స్టాండర్డ్ రేటింగ్, ఐపీ68 రేటింగ్ ఉన్నాయి.
- ఓఎస్: Samsung Galaxy XCover7 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: Samsung Galaxy XCover7 లో 5జీ, 4జీ, వై-ఫై బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ, యూఎస్బీ 2.0 పోర్ట్, డాల్బీ అట్మాస్ ఉన్నాయి.











