ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung నేడు దక్షిణ కొరియాలో Samsung Galaxy XCover7 డివైజ్ ని లాంచ్ చేసింది. ఇది MIL-STD-810H రేటింగ్ తో వచ్చింది. యూఎస్ మిలిటరీ ఈ టెస్టింగ్ స్టాండర్డ్ ని డిజైన్ చేసింది. ఈ రగ్డ్ ఫోన్ కఠిన పరిస్థితులను తట్టుకుని నిలవగలదు. నీరు, దుమ్ము నుంచి పటిష్టమైన రక్షణ ఈ ఫోన్ కి అందించారు. Samsung Galaxy XCover7 1.5ఎమ్ షాక్ రెసిస్టన్స్ ని కలిగి ఉంది.
Samsung Galaxy XCover7 ధర
- Samsung Galaxy XCover7 డివైజ్ ధరను కంపెనీ ఇంకా ప్రకటించాల్సి ఉంది. త్వరలోనే ప్రకటన రానుంది.
- అలాగే ఈ డివైజ్ కొన్ని ఎంపిక చేయబడిన మార్కెట్స్ కి మాత్రమే పరిమితం కానుంది.
Samsung Galaxy XCover7 స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Samsung Galaxy XCover7 లో 6.6-ఇంచ్ టీఎఫ్టీ ఎల్సీడీ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియో, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్+ ఉన్నాయి.
- ప్రాసెసర్: Samsung Galaxy XCover7 లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్, మాలి జీ57 జీపీయూ ఉన్నాయి.
- ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy XCover7 డివైజ్ లో 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్ ఉన్నాయి.
- సాఫ్ట్వేర్: Samsung Galaxy XCover7 ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కెమెరా: Samsung Galaxy XCover7 లో 50ఎంపి మెయిన్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.
- బ్యాటరీ: Samsung Galaxy XCover7 లో పవర్ బ్యాకప్ కోసం 4,050 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. యూఎస్బీ టైప్-సీ పోర్ట్, చార్జింగ్ కోసం POGO పిన్స్ ఉన్నాయి.
- సెక్యూరిటీ: Samsung Galaxy XCover7 లో భద్రత కోసం ఫేస్ అన్లాక్, శాంసంగ్ నాక్స్, శాంసంగ్ నాక్స్ వాల్ట్ ఉన్నాయి. ఇంకా ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్, MIL-STD-810H మిలిటరీ స్టాండర్డ్స్ రేటింగ్ ఉన్నాయి.
- బరువు, చుట్టుకొలత: Samsung Galaxy XCover7 డివైజ్ 169.0 మి.మీ పొడవు, 80.1 మి.మీ వెడల్పు, 10.2 మి.మీ మందం, 240 గ్రాముల ఉంటుంది.
- కనెక్టివిటీ: Samsung Galaxy XCover7 లో డ్యూయల్-సిమ్ (నానో + ఇసిమ్), 5జీ, వై-ఫై, వై-ఫై డైరెక్ట్, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్సీ, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ, యూఎస్బీ 2.0 ఉన్నాయి.
