హైలైట్స్:
- ఫ్లిప్ కార్ట్ బిగ్ దివాళి సేల్ లో రూ.60,000 కే లభిస్తోన్న Samsung Galaxy Z Flip 3
- అక్టోబర్ 10 నుంచి అందుబాటులోకి రానున్న కొత్త ధర
- స్నాప్ డ్రాగన్ 888 చిప్, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.7-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే కలిగిన Samsung Galaxy Z Flip 3
పండుగ సీజన్లో శాంసంగ్ కంపెనీ, తన Samsung Galaxy Z సిరీస్ పై ఎగ్జైటింగ్ ఆఫర్లను అందిస్తోంది. ఫ్లిప్ కార్ట్ బిగ్ దివాళి సేల్ సందర్భంగా Samsung Galaxy Z Flip 3 ఎన్నడూ లేని విధంగా రూ.60,000 లోపు ధరలో లభించబోతుంది. ఇదే రీతిలో, Samsung Galaxy Z Fold 3 కూడా కూపన్ డిస్కౌంట్ తో కలిపి రూ.1,09,999 ధరకే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సమయంలో అందుబాటులోకి వచ్చింది. ఇది సూపర్ డీల్ అని చెప్పవచ్చు. కనీవినీ ఎరుగని విధంగా ఈ ఫ్లాగ్షిప్స్ ధరలు ఈ స్థాయికి రావడం నిజంగా ఆశ్చర్యకరమే.
అక్టోబర్ 8 న అమెజాన్ లో ఫోల్డ్ 3 ధర ఎంతో రివీల్ అవుతుంది. అక్టోబర్ 10 న Samsung Galaxy Z Flip 3 ఫ్లిప్ కార్ట్ లో తగ్గిన ధరతో అందుబాటులోకి వస్తుంది. గతేడాది అన్‌ప్యాక్డ్ ఈవెంట్ లో Samsung Galaxy Z Flip 3, Fold 3 ఫ్లాగ్షిప్ ఫోన్లు లాంచ్ అయ్యాయి.
రూ.60,000 లోపు ధరలో Samsung Galaxy Z Flip 3
Flipkart Big Diwali Sale అక్టోబర్ 10 నుంచి ప్రారంభం అవుతోంది. ఈ సేల్ సందర్భంగా Samsung Galaxy Z Flip 3 ఫోన్ రూ.60,000 లోపు ధరతో అందుబాటులోకి వస్తోంది. రూ.84,990 ధరతో ఈ ఫోన్ గతేడాది లాంచ్ అయ్యింది. క్లామ్‌షెల్ డిజైన్ కలిగిన ఈ ఫోన్ సగానికి ఫోల్డ్ అవుతుంది. అలాగే ఇందులో డైనమిక్ 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే ఉంది. ఇది నిజంగా కస్టమర్లకు అద్భుతమైన ఆఫర్ అని చెప్పాలి.
Samsung Galaxy Z Flip 3 లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ 2X ఇన్ఫినిటీ ఫ్లెక్స్ డిస్ప్లే అమర్చారు. ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 425 పీపీఐ, 2640*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 1.9-ఇంచ్ సూపర్ అమోలెడ్ సెకండరీ డిస్ప్లే, 302 పీపీఐ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 888 చిప్సెట్, 8జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 128జిబి/256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉన్నాయి.
ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై ఈ ఫోన్ పని చేస్తుంది. 3300 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో అమర్చారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది. 5జీ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.1 ఎల్ఈ, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా డాల్బి అట్మాస్, యూఎస్బీ టైప్ సీ, ఐపీ68 రేటింగ్, 12ఎంపి ప్రైమరీ సెన్సర్, 12ఎంపి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ లతో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 10ఎంపి కెమెరా ఉంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.