
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung ఫ్లిప్ ఫోన్లు, ఫోల్డబుల్ ఫోన్ల మార్కెట్ లో అగ్రగామిగా కొనసాగుతోంది. ఫ్లిప్ ఫోన్ లవర్స్ కి ఇప్పుడొక శుభావార్త వచ్చేసింది. శాంసంగ్ యొక్క లేటెస్ట్ ఫ్లిప్ ఫోన్ Galaxy Z Flip 5 పై ఆకట్టుకునే డీల్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ పై ప్రత్యక్షమైంది. అమెజాన్ ఇండియాపై గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 తక్కువ ధరకే లభిస్తోంది. ఓసారి ఆఫర్ వివరాలు మరియు డివైజ్ స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.
Samsung Galaxy Z Flip 5 డిస్కౌంట్ వివరాలు
Samsung Galaxy Z Flip 5 స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్ + 512జిబి మోడల్ ధర అమెజాన్ ఇండియాపై రూ.1,09,999 గా ఉంది. అయితే రూ.20,000 కూపన్ డిస్కౌంట్‌తో ఇది రూ.89,999 కి చేరుతోంది. అంతేకాదు, హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ కి రూ.14,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఇది ఈఎంఐ మరియు పూర్తి చెల్లింపు లావాదేవీల ద్వారా పొందవచ్చు. అంటే ఈ ఫోన్ ధర దాదాపుగా రూ.80 వేల లోపు, కచ్చితంగా చెప్పాలంటే రూ.75,999 కి చేరుతోంది.
Samsung Galaxy Z Flip 5 డిస్కౌంట్ ఆఫర్ 2024 మే 31వ తేదీ వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఓసారి ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.
Samsung Galaxy Z Flip 5 స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Samsung Galaxy Z Flip 5 లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డైనమిక్ అమోలెడ్ 2x డిస్ప్లే, 120 హెర్ట్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, ఇన్ఫినిటీ ఫ్లెక్స్ డిస్ప్లే ఉంటాయి.
కవర్ స్క్రీన్: Samsung Galaxy Z Flip 5 లో 3.4-ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 720*748 పిక్సెల్ రెజుల్యూషన్, 306 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ ఉంటాయి.
రియర్ కెమెరా: Samsung Galaxy Z Flip 5 లో 12ఎంపి వైడ్ యాంగిల్ మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి.
ఫ్రంట్ కెమెరా: Samsung Galaxy Z Flip 5 లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 10 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా అందించారు.
చిప్సెట్: Samsung Galaxy Z Flip 5 డివైజ్ లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ వాడారు.
ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy Z Flip 5 డివైజ్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
బ్యాటరీ: Samsung Galaxy Z Flip 5 లో పవర్ బ్యాకప్ కోసం 3700 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 0 నుంచి 50 శాతం చార్జ్ అయ్యేందుకు 30 నిమిషాలు సమయం పడుతుందని కంపెనీ చెబుతోంది.
వాటర్ రెసిస్టన్స్: Samsung Galaxy Z Flip 5 డివైజ్ ఐపీX8 వాటర్ రెసిస్టన్స్ రేటింగ్ తో వచ్చింది.
ఓఎస్: Samsung Galaxy Z Flip 5 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
కనెక్టివిటీ: Samsung Galaxy Z Flip 5 స్మార్ట్ ఫోన్ లో 5జీ, ఎల్టీఈ, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.3, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉంటాయి.
కలర్ ఆప్షన్స్: Samsung Galaxy Z Flip 5 డివైజ్ మింట్, గ్రాఫైట్, క్రీమ్, లావెండర్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. శాంసంగ్.కామ్ పై కొనుగోలు చేస్తే, గ్రే, బ్లూ, గ్రీన్, యెల్లో కలర్ ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉంటాయి.











