ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ నేడు తన ఫ్లాగ్షిప్ ఫోల్డబుల్ ఫోన్స్ ని లాంచ్ చేసింది. దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో జరిగిన గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్ లో Samsung Galaxy Z Flip 5, Samsung Galaxy Z Fold 5
డివైజెస్ భారత్ తో పాటు గ్లోబల్ గా లాంచ్ అయ్యాయి. 6.7-ఇంచ్ డైనమిక్ అమోలెడ్ డిస్ప్లేతో Samsung Galaxy Z Flip 5 డివైజ్ మార్కెట్ లోకి వచ్చింది. ఈ డివైజ్ లో 3.4-ఇంచ్ సూపర్ అమోలెడ్ 60 హెర్ట్జ్ కవర్ స్క్రీన్ ని అందించారు. ఈ స్క్రీన్ 306 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ కలిగి ఉంది.
Samsung Galaxy Z Flip 5 స్మార్ట్ ఫోన్ తెరిచినప్పుడు 71.9 మి.మీ వెడల్పు, 165.1 మి.మీ పొడవు, 6.9 మి.మీ మందం ఉంటుంది. ఈ ఫోన్ 187 గ్రాముల బరువు ఉంటుంది. ఇప్పుడు Samsung Galaxy Z Flip 5 పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
భారత్ లో Samsung Galaxy Z Flip 5 ధర
- 8GB ర్యామ్, 128GB స్టోరేజీ మోడల్ ధర రూ.99,999
- 8GB ర్యామ్, 512GB స్టోరేజీ మోడల్ ధర రూ.1,09,999
Samsung Galaxy Z Flip 5 స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Samsung Galaxy Z Flip 5 లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డైనమిక్ అమోలెడ్ 2x డిస్ప్లే, 120 హెర్ట్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, ఇన్ఫినిటీ ఫ్లెక్స్ డిస్ప్లే ఉంటాయి.
- కవర్ స్క్రీన్: Samsung Galaxy Z Flip 5 లో 3.4-ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 720*748 పిక్సెల్ రెజుల్యూషన్, 306 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ ఉంటాయి.
- రియర్ కెమెరా: Samsung Galaxy Z Flip 5 లో 12ఎంపి వైడ్ యాంగిల్ మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి.
- ఫ్రంట్ కెమెరా: Samsung Galaxy Z Flip 5 లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 10 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా అందించారు.
- చిప్సెట్: Samsung Galaxy Z Flip 5 డివైజ్ లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ వాడారు.
- ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy Z Flip 5 డివైజ్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- బ్యాటరీ: Samsung Galaxy Z Flip 5 లో పవర్ బ్యాకప్ కోసం 3700 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 0 నుంచి 50 శాతం చార్జ్ అయ్యేందుకు 30 నిమిషాలు సమయం పడుతుందని కంపెనీ చెబుతోంది.
- వాటర్ రెసిస్టన్స్: Samsung Galaxy Z Flip 5 డివైజ్ ఐపీX8 వాటర్ రెసిస్టన్స్ రేటింగ్ తో వచ్చింది.
- ఓఎస్: Samsung Galaxy Z Flip 5 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్యూఐ 5.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కనెక్టివిటీ: Samsung Galaxy Z Flip 5 స్మార్ట్ ఫోన్ లో 5జీ, ఎల్టీఈ, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.3, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉంటాయి.
- కలర్ ఆప్షన్స్: Samsung Galaxy Z Flip 5 డివైజ్ మింట్, గ్రాఫైట్, క్రీమ్, లావెండర్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. శాంసంగ్.కామ్ పై కొనుగోలు చేస్తే, గ్రే, బ్లూ, గ్రీన్, యెల్లో కలర్ ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉంటాయి.
