ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో గెలాక్సీ జెడ్ ఫ్లిప్ సిరీస్ లో కొత్త డివైజ్‌ను లాంచ్ చేయనుంది. Samsung Galaxy Z Flip 6 పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా ఈ డివైజ్ ఎఫ్‌సీసీ డేటాబేస్ పై కనిపించింది. దీంతో డివైజ్ యొక్క ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఈ ఫోన్ స్నాపడ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలిసింది. ఓసారి ఎఫ్‌సీసీ లిస్టింగ్ వివరాలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.
Samsung Galaxy Z Flip 6 ఎఫ్‌సీసీ లిస్టింగ్ వివరాలు
Samsung Galaxy Z Flip 6 స్మార్ట్‌ఫోన్ ఎఫ్‌సీసీ డేటాబేస్ పై SM-F741U అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
ఎఫ్‌సీసీ వెబ్‌సైట్ పై రెండు డ్యూయల్ సెల్ బ్యాటరీలు EB-BF741ABY, EB-BF742ABY అనే మోడల్ నంబర్లతో లిస్ట్ అయ్యాయి.
ఎఫ్‌సీసీ సైట్ పై Samsung Galaxy Z Flip 6 డివైజ్ వై-ఫై 2.4 గిగాహెర్ట్జ్, 5 గిగాహెర్ట్జ్, వై-ఫై 6ఈ, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ సపోర్ట్ తో లిస్ట్ అయ్యింది.
Samsung Galaxy Z Flip 6 స్పెసిఫికేషన్స్ (అంచనా)
డిస్ప్లే: Samsung Galaxy Z Flip 6 డివైజ్ భారీ కవర్ డిస్ప్లే, ఇన్నర్ స్క్రీన్ తో రానున్నట్లు సమాచారం. కవర్ స్క్రీన్ సైజ్ 3.9-ఇంచెస్ గా ఉంటుందని అంచనా.
ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy Z Flip 6 డివైజ్ 8జిబి ర్యామ్ మరియు 12జిబి ర్యామ్ ఆప్షన్స్ లో లభిస్తుంది. 128జిబి/256జిబి స్టోరేజీతో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
బ్యాటరీ: Samsung Galaxy Z Flip 6 లో పవర్ బ్యాకప్ కోసం 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
కెమెరా: Samsung Galaxy Z Flip 6 లో 50ఎంపి ప్రైమరీ ఓఐఎస్ కెమెరా ఉంటుంది. ఇతర సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియదు.
ఓఎస్: Samsung Galaxy Z Flip 6 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో ఏఐ టెక్నాలజీని కూడా అందించనున్నారు.
