హైలైట్స్:
- అధికారికంగా లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4, బడ్స్ 2 ప్రో
- కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్+, అల్యూమినియమ్ ఫ్రేమ్స్, హింజ్ కవర్ లను కలిగి మంచి బిల్డ్ క్వాలిటీతో వస్తోన్న మడత ఫోన్లు
- 999 డాలర్లతో మొదలు కానున్న శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4, ఫోల్డ్ 4 ధరలు
ఊహించినట్లుగానే శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4 మరియు శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 మడతబెట్టే ఫోన్లు అఫీషియల్ గా లాంచ్ అయ్యాయి. రెండు ఫోన్లు కూడా కస్టమైజబుల్ ఫార్మ్ ఫాక్టర్స్ ని కలిగి ఉన్నాయని దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ చెబుతోంది. ఆండ్రాయిడ్ 12ఎల్ ఓఎస్ తో వస్తున్న తొలి డివైజ్ శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4 కావడం విశేషం. భారీ స్క్రీన్ కలిగిన డివైజెస్ కోసం గూగుల్ ఈ ఓఎస్ ను డిజైన్ చేసింది.
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4, ఫ్లిప్ 4 ఇదివరకు ఎన్నడూ లేని విధంగా, ఎంతో దృఢంగా వస్తున్నాయి. ఆర్మర్ అల్యూమినియమ్ ఫ్రేమ్స్, హింజ్ కవర్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్+ (కవర్ స్క్రీన్ పై, రియర్ గ్లాస్ పై) తో ఫోన్లు ఎంతో నాణ్యతతో వస్తున్నాయి. మెయిన్ స్క్రీన్ ప్యానెల్ యొక్క క్వాలిటీని మరింతగా పెంచారు. ఎక్స్‌టెర్నల్ షాక్ నుంచి డ్యామేజీ కలగకుండా లేయర్ స్ట్రక్చర్ ని ఆప్టిమైజ్ చేశారు. ఇవి ఐపీఎక్స్8 రేటెడ్ వాటర్ రెసిస్టన్స్ తో వస్తున్నాయి.
Samsung Galaxy Z Fold 4, Flip 4 ధర, లభ్యత
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4 ధర 1,799 డాలర్ల (దాదాపు రూ.1,42,000) నుంచి మొదలవుతుంది. మరోవైపు, శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 ధర రూ.999 (రూ.80,000) నుంచి ప్రారంభమవుతుంది. ప్రీ-రిజర్వేషన్స్ కొరకు ఈ ఫోన్స్ భారత్ లో ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. ఈ నెలలో వీటి సేల్ మొదలు కానుంది. భారతదేశంలో ఫోల్డ్ 4, ఫ్లిప్ 4 స్మార్ట్ ఫోన్స్ యొక్క ధరలను ఇంకా ప్రకటించాల్సి ఉంది.
గ్రేగ్రీన్, బీజ్, ఫాంటమ్ బ్లాక్ రంగుల ఆప్షన్స్ లో శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ 4 లభించనుంది. ఇక ఫ్లిప్ 4 విషయానికి వస్తే, ఈ ఫోన్ బోరా పర్పుల్, గ్రాఫైట్, పింక్ గోల్డ్, బ్లూ కలర్స్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంటుంది.
Samsung Galaxy Z Fold 4 స్పెసిఫికేషన్స్
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4 లో 6.2 అంగుళాల హెచ్డీ+ కవర్ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ డిస్ప్లే ఉంది. ఇది 2316*904 రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. అలాగే 7.6 అంగుళాల క్యూఎక్స్‌జీఏ+ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఇన్-స్క్రీన్ కెమెరా ఈ ఫోన్లో ఉన్నాయి. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్, అడ్రెనో జీపీయూ, 12జిబి ర్యామ్, 256జిబి/512జిబి/1టీబీ స్టోరేజీ, ఆండ్రాయిడ్ 12ఎల్, వన్ యూఐ కస్టమ్ స్కిన్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.
ఇప్పుడు కెమెరా విభాగం విశేషాలేంటో తెలుసుకుందాం. శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ 4 లో వెనకాల మూడు కెమెరాలున్నాయి. వీటిలో ఒకటి 50ఎంపి ప్రైమరీ కెమెరా (ఓఐఎస్, డ్యూయల్ పిక్సెల్ ఏఎఫ్), రెండోది 12ఎంపి అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, మూడోది 10ఎంపి టెలీఫోటో కెమెరా (పీడీఏఎఫ్ ఓఐఎస్, 3ఎక్స్ ఆప్టికల్ జూమ్). సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు 4ఎంపి ఇన్-స్క్రీన్ కెమెరా ఉంది. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఔటర్ స్క్రీన్ పై 85-డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ కలిగిన 10ఎంపి సెన్సర్ ఉంది.
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4 లో 4,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే రివర్స్ వైర్లెస్ చార్జింగ్ కి కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ మడతబెట్టే ఫోన్లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఎస్ పెన్ సపోర్ట్ ఉన్నాయి. 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.2, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఐపీఎక్స్8 వాటర్ రెసిస్టన్స్ రేటింగ్ ని ఈ ఫోన్ కలిగి ఉంది. శాంసగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4 బరువు 263 గ్రాములు. ఆండ్రాయిడ్ 12ఎల్ ఓఎస్ యూఐ అనుభూతిని మరింత మెరుగుపరచనుంది. పీసీ మాదిరి లేఔట్ ను ఇది అందిస్తుంది. ఇంకా మరెన్నో ఫీచర్లున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్ లతో శాంసంగ్ జట్టుకట్టడం వల్లన మల్టీ టాస్కింగ్ అనేది మరోస్థాయికి వెళ్ళింది.
Samsung Galaxy Z Flip 4 స్పెసిఫికేషన్స్
6.7 అంగుళాల డైనమిక్ 2ఎక్స్ అమోలెడ్ డిస్ప్లే, 2640*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, సెంటర్ పొజిషన్డ్ పంచ్ హోల్ కటౌట్, సిమెట్రికల్ బెజెల్స్, 1.9-ఇంచ్ సెకండరీ అమోలెడ్ బ్యాక్ ప్యానెల్ స్క్రీన్, 260*512 పిక్సెల్స్ రెజుల్యూషన్, స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్, 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి/512జిబి స్టోరేజీ, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, వన్ యూఐ 4.1 కస్టమ్ స్కిన్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.
ఈ ఫోన్లో 3,700 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అంటే ఫ్లిప్ 3 తో పోల్చితే ఇది కాస్త మెరుగ్గా ఉందని చెప్పవచ్చు. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇందులో ఉంది. 5జీ, వై-ఫై 802.11 ఏ/బీ/జీ/ఎన్/ఏసీ/ఏఎక్స్, బ్లూటూత్ 5.2, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఐపీఎక్స్8 వాటర్ రెసిస్టన్స్ రేటింగ్ జెడ్ ఫ్లిప్ 4 లో ఉన్నాయి.
ఇప్పుడు కెమెరా విభాగం విశేషాలను చూద్దాం. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 వెనకాల రెండు కెమెరాలున్నాయి. వీటిలో ఒకటి 12ఎంపి వైడ్-యాంగిల్ కెమెరా (డ్యూయల్ పిక్సెల్ ఏఎఫ్, ఓఐఎస్) కాగా, రెండోది 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 10ఎంపి కెమెరా ఉంది. ఇది 80 డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ ని కలిగి ఉంది. ఈ ఫోన్ బరువు 187 గ్రాములు.
Samsung Galaxy Buds 2 Pro విశేషాలు
గెలాక్సీ బడ్స్ 2 ప్రో ని కూడా శాంసంగ్ లాంచ్ చేసింది. ఈ టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ కస్టమ్ కోయాక్సియల్ 2-వే (ట్వీటర్+వూఫర్) స్పీకర్ తో వస్తున్నాయి. 24-బిట్ హై-ఫై ఆడియో క్వాలిటీని ఈ బడ్స్ అందిస్తాయి. అలాగే డైరెక్ట్ మల్టీ-చానల్ ద్వారా 360 ఆడియోను అందిస్తాయి. యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ తో ఈ ఇయర్ బడ్స్ వస్తున్నాయి. ఆంబియంట్ మరియు వాయిస్ డిటెక్షన్ మోడ్స్ ఇందులో ఉన్నాయి. గెలాక్సీ బడ్స్ 2 ప్రో లో 61ఎంఏహెచ్ బ్యాటరీ (రెండు బడ్స్ లో చెరొకటి) ఉంది. ఇక క్యారీ కేస్ లో 515ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఈ బడ్స్ బ్లూటూత్ 5.3 ద్వారా కనెక్ట్ అవుతాయి. అలాగే శాంసంగ్ యొక్క కోడెక్ హైఫై, ఏఏసీ, ఎస్‌బీసీ కి సపోర్ట్ చేస్తాయి. ఈ ఇయర్ బడ్స్ ఐపీఎక్స్7 వాటర్ రెసిస్టన్స్ రేటింగ్ తో వస్తోంది.