దక్షిణ కొరియా దిగ్గజ టెక్ కంపెనీ Samsung తన అన్‌ప్యాక్డ్ ఈవెంట్ లో Samsung Galaxy Z Fold 5, Galaxy Flip 5 డివైజెస్ ని లాంచ్ చేసింది. అసలైతే ఆగస్టులో ఈ ఈవెంట్ జరుగుతుంటుంది. కానీ, జులై నెలకు ఈవెంట్ ని ప్రీపోన్ చేసారు. ఈ ఫోల్డబుల్ ఫోన్లు గత డివైజెస్ తో పోల్చితే ఎన్నో అప్‌గ్రేడ్స్ తో వచ్చాయి. Galaxy Flip 5 డివైజ్ 3.4-ఇంచ్ కవర్ స్క్రీన్ తో వచ్చింది. గత మోడల్ ఫ్లిప్ 4 1.9-ఇంచ్ కవర్ డిస్ప్లేతో వచ్చింది. సరే, ఓసారి Samsung Galaxy Z Fold 5, Galaxy Flip 5 ఫోన్లలో ఉన్న టాప్-5 ఫీచర్లు ఏంటో తెలుసుకుందాం.
Samsung Galaxy Z Fold 5 టాప్ 5 ఫీచర్లు
1. డిస్ప్లే: Samsung Galaxy Z Fold 5 లో ఉన్న 7.6-ఇంచ్ క్యూఎక్స్‌జీఏ+ డైనమిక్ 2ఎక్స్ ఇన్ఫినిటీ ఫ్లెక్స్ డిస్ప్లే టాప్ 5 ఫీచర్లలో మొదటి స్థానంలో ఉంది.
2. కవర్ డిస్ప్లే: Samsung Galaxy Z Fold 5 లో ఉన్న 6.2-ఇంచ్ హెచ్డీ+ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ కవర్ డిస్ప్లే టాప్ 5 ఫీచర్లలో రెండో స్థానంలో ఉంది.
3. ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ టాప్ 3 ఫీచర్ గా నిలుస్తోంది.
4. కెమెరా: 50ఎంపి ఓఐఎస్ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ టాప్ 5 ఫీచర్లలో ఒకటిగా నిలుస్తోంది.
5. ఫ్రంట్ కెమెరా: అండర్ డిస్ప్లే 4ఎంపి కెమెరా ప్రత్యేకాకర్షణగా నిలుస్తోంది. ఇది టాప్ 5 ఫీచర్లలో ఒకటిగా దీన్ని చెప్పుకోవచ్చు.
Samsung Galaxy Z Flip 5 టాప్ 5 ఫీచర్లు
1. డిస్ప్లే: Samsung Galaxy Z Flip 5 లో 3.4-ఇంచ్ సూపర్ అమోలెడ్ కవర్ స్క్రీన్ టాప్ 5 ఫీచర్లలో ఒకటిగా చెప్పవచ్చు.
2. చిప్సెట్: Samsung Galaxy Z Flip 5 లో ఇవ్వబడిన స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 టాప్ 5 ఫీచర్లలో ఒకటిగా నిలుస్తోంది.
3. రియర్ కెమెరా: 12ఎంపి + 12ఎంపి డ్యూయల్ రియర్ కెమెరాలు టాప్ 5 ఫీచర్లలో స్థానం సంపాదించాయి. ఏఐ టెక్నాలజీతో వచ్చిన ఈ కెమెరాలు అద్భుతమైన పెర్ఫామెన్స్ ని అందించనున్నాయని కంపెనీ చెబుతోంది.
4. స్టోరేజీ: 512జిబి హయ్యస్ట్ స్టోరేజీ టాప్ 5 ఫీచర్లలో ఒకటిగా స్థానం సంపాదించింది.
5. ఐపీ రేటింగ్: Samsung Galaxy Z Flip 5 డివైజ్ ఐపీX8 వాటర్ రెసిస్టన్స్ రేటింగ్ తో వచ్చింది. టాప్ 5 ఫీచర్లలో దీనికి కూడా స్థానం కల్పించవచ్చు.
