ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung భారత్ తో సహా గ్లోబల్ మార్కెట్ లో తన సరికొత్త ఫోల్డబుల్ సిరీస్ ను లాంచ్ చేసింది. లైనప్ లో Galaxy Z Fold 6 మరియు Galaxy Z Flip 6 మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6 రెండు మెమొరీ వేరియంట్స్ లో, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 మూడు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. ఓసారి ఈ ఫోల్డబుల్ ఫోన్ల యొక్క ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.
Samsung Galaxy Z Flip 6, Z Fold 6 ధరలు
Samsung Galaxy Z Flip 6 యొక్క 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.1,09,999 గా నిర్ణయించారు.
Samsung Galaxy Z Flip 6 12జిబి + 512జిబి వేరియంట్ ధరను రూ.1,21,999 గా పెట్టారు.
Samsung Galaxy Z Fold 6 యొక్క 12జిబి ర్యామ్ + 256జిబి బేస్ వేరియంట్ ధర రూ.1,64,999 గా ఉంది. 12జిబి+512జిబి మిడ్ వేరియంట్ ధర రూ.1,76,999 గా ఉంది. 12జిబి+1టిబి టాప్ మోడల్ ధరను రూ.2,00,999 గా నిర్ణయించారు.
గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 మరియు జెడ్ ఫ్లిప్ 6 స్మార్ట్‌ఫోన్ల యొక్క ప్రీ-ఆర్డర్స్ జులై 10వ తేదీ నుంచి శాంసంగ్ వెబ్‌సైట్ ద్వారా ప్రారంభమవుతాయి. ఈ ఫోన్లను ప్రీ-ఆర్డర్ చేసుకునే కస్టమర్లకు గెలాక్సీ వాచ్ 7, గెలాక్సీ వాచ్ అల్ట్రా, మరియు గెలాక్సీ బడ్స్ 3 సిరీస్ పై 35 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.
అంతేకాదు, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 మరియు జెడ్ ఫ్లిప్ 6 ఫోన్లపై రూ.8,000 బ్యాంక్ క్యాష్‌బ్యాక్ లేదా అప్‌గ్రేడ్ బోనస్ లభిస్తుంది. మీరు ప్రస్తుతం వాడుతోన్న శాంసంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్ ఎక్స్‌చేంజ్ చేస్తే అప్పుడు అప్‌గ్రేడ్ బోనస్ రూ.15,000 లభిస్తుంది.
జులై 24వ తేదీ నుంచి Samsung Galaxy Z Fold 6, Z Flip 6 ఫోన్లను శాంసంగ్.కామ్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ మరియు ఇతర రిటైల్ పార్ట్నర్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
Samsung Galaxy Z Fold 6 స్పెసిఫికేషన్స్
ఇన్నర్ డిస్ప్లే: Samsung Galaxy Z Fold 6 లో 7.6-ఇంచ్ క్యూఎక్స్‌జీఏ+ ఇన్ఫినిటీ ఫ్లెక్స్ స్క్రీన్, డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ ప్యానెల్, 2160*1856 పిక్సెల్స్, 120 హెర్ట్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
కవర్ స్క్రీన్: Samsung Galaxy Z Fold 6 లో 6.3-ఇంచ్ హెచ్డీ+ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ ప్యానెల్, 2376*968 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
ప్రాసెసర్: Samsung Galaxy Z Fold 6 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ వాడారు.
సాఫ్ట్‌వేర్: Samsung Galaxy Z Fold 6 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6.1.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy Z Fold 6 డివైజ్ 12జిబి ర్యామ్ + 256జిబి/512జిబి/1టిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
కెమెరా: Samsung Galaxy Z Fold 6 లో 12ఎంపి మెయిన్ కెమెరా, 50ఎంపి ఓఐఎస్ లెన్స్, 10ఎంపి టెలీఫోటో 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ ఓఐఎస్ లెన్స్ ఉన్నాయి. 10ఎంపి కవర్ కెమెరాను ఈ ఫోన్ లో అందించారు. ఇంకా 4ఎంపి అండర్ డిస్ప్లే కెమెరా కూడా ఉంది.
బ్యాటరీ: Samsung Galaxy Z Fold 6 లో 4,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
కనెక్టివిటీ: Samsung Galaxy Z Fold 6 లో 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 6.3, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
ఇతర ఫీచర్లు: Samsung Galaxy Z Fold 6 లో ఐపీ48 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టన్స్ రేటింగ్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కార్ ఉన్నాయి.
Samsung Galaxy Flip 6 స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Samsung Galaxy Flip 6 లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ స్క్రీన్, ఇన్ఫినిటీ ఫ్లెక్స్ డిస్ప్లే, 2640*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
కవర్ డిస్ప్లే: Samsung Galaxy Flip 6 లో 3.4-ఇంచ్ సూపర్ అమోలెడ్ స్క్రీన్, 748*720 రెజుల్యూషన్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
ప్రాసెసర్: Samsung Galaxy Flip 6 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్ వాడారు.
సాఫ్ట్‌వేర్: Samsung Galaxy Flip 6 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6.1.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy Flip 6 ఫోన్ 12జిబి ర్యామ్ + 256జిబి/512జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
కెమెరా: Samsung Galaxy Flip 6 లో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 10ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
బ్యాటరీ: Samsung Galaxy Flip 6 లో పవర్ బ్యాకప్ కోసం 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
కనెక్టివిటీ: Samsung Galaxy Flip 6 డివైజ్ లో 5జీ, 4జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై 6ఈ, జీపీఎస్ ఉన్నాయి.
ఇతర ఫీచర్లు: Samsung Galaxy Flip 6 లో ఐపీ48 రేటింగ్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
