ఈ నెల ఆరంభంలో Samsung Galaxy S23 సిరీస్ గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. ఇప్పటికే ఈ ఫోన్లు సేల్ అవుతున్నాయి. ఇప్పటివరకు లైనప్ లో ఉన్న 3 మోడల్స్ కి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. ఇప్పుడు, దక్షిణ కొరియా టెక్ దిగ్గజం కొత్త ఫ్యాన్ ఎడిషన్ పై పని చేస్తున్నట్లు తెలుస్తోంది. అంటే త్వరలోనే Samsung Galaxy S23 FE 5G స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో లాంచ్ కానుందన్నమాట.
Samsung Galaxy S23 FE 5G స్మార్ట్ ఫోన్ గతంలో వచ్చిన Samsung Galaxy S21 FE 5G కి సక్ససర్ గా వస్తోంది. ఈ ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలల్లో Samsung Galaxy S23 FE 5G డివైజ్ లాంచ్ కానుందని సమాచారం.
స్మార్ట్ ఫోన్స్ కి డిమాండ్ పడిపోవడం, చిప్సెట్ కొరత వల్లన Samsung Galaxy S22 FE 5G రావడం జాప్యమైంది. ఒకానొక సమయంలో శాంసంగ్ సంస్థ FE సిరీస్ ని నిలిపివేయనుందని కూడా టాక్ నడిచింది. కానీ, అది నిజం కాదనిపిస్తోంది. త్వరలోనే మళ్ళీ తన FE సిరీస్ ఫోన్ Samsung Galaxy S23 FE 5G తో శాంసంగ్ తన వినియోగదారుల ముందుకు రానుంది. అయితే ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇంకా తెలియాల్సి ఉంది.
Samsung Galaxy S21 FE 5G స్పెసిఫికేషన్స్
Samsung Galaxy S21 FE 5G లో 6.4-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డైనమిక్ అమోలెడ్ డిస్ప్లే, 2340 x 1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ ఉంటాయి. ఈ ఫోన్ Exynos 2100 ప్రాసెసర్, 8జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ తో వచ్చింది. Samsung Galaxy S21 FE 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
Samsung Galaxy S21 FE 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 12ఎంపి ప్రైమరీ వైడ్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ (123-డిగ్రా ఫీల్డ్ ఆఫ్ వ్యూ), 8ఎంపి టెలీఫోటో లెన్స్ (30x డిజిటల్ జూమ్) ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
Samsung Galaxy S21 FE 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం ఇందులో టైప్-సీ పోర్ట్ ఇచ్చారు. ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో ఈ ఫోన్ వచ్చింది. భద్రత కోసం ఈ ఫోన్ లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.
