Home How To SBI కస్టమర్లు ఎస్ఎమ్ఎస్, మిస్డ్ కాల్ ద్వారా తేలిగ్గా బ్యాలన్స్ తెలుసుకోవచ్చు; విధానమిదిగో!

SBI కస్టమర్లు ఎస్ఎమ్ఎస్, మిస్డ్ కాల్ ద్వారా తేలిగ్గా బ్యాలన్స్ తెలుసుకోవచ్చు; విధానమిదిగో!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ఖాతాదారులకు ఉచిత మిస్డ్ కాల్ మరియు SMS బ్యాంకింగ్ సేవల ద్వారా బ్యాంక్ బ్యాలెన్స్, మినీ స్టేట్‌మెంట్‌ను చెక్ చేసుకునే సౌకర్యాన్ని అందిస్తోంది. దీంతో పాటు, SBI కస్టమర్లు వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి కేవలం మిస్డ్ కాల్ లేదా SMS ద్వారా వారి ఖాతాకు సంబంధించిన ఇతర వివరాలను తెలుసుకోవచ్చు. ఈ రోజు మేము మీకు SBI యొక్క ఆ రెండు సేవల గురించి సమాచారాన్ని అందిస్తున్నాము, దీని ద్వారా మీరు ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా ఇంట్లో కూర్చొని మీ ఖాతా గురించి సమాచారాన్ని పొందవచ్చు.

SBI క్విక్ మిస్డ్ కాల్ సర్వీస్

SBI క్విక్ మిస్డ్ కాల్ సర్వీస్ ద్వారా, కస్టమర్‌లు తమ ఖాతా బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్, ATM కార్డ్ బ్లాక్ మరియు PM సోషల్ సెక్యూరిటీ స్కీమ్ గురించి సమాచారాన్ని పొందవచ్చు. దీని కోసం, కస్టమర్లు తమ ఖాతాలో క్విక్ మిస్డ్ కాల్ ఫీచర్ కోసం నమోదు చేసుకోవాలి.

SBI క్విక్ మిస్డ్ కాల్ బ్యాంకింగ్‌ని రిజిస్టర్ చేసుకోవడం ఎలా?

రిజిస్ట్రేషన్ తర్వాత, SBI వినియోగదారులు 09223766666కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తమ ఖాతా వివరాలను తనిఖీ చేసుకోవచ్చు.

SBI బ్యాలన్స్ ఎంక్వైరీ నంబర్

SBI బ్యాంక్ కస్టమర్లు మిస్డ్ కాల్ లేదా SMS ఇవ్వడం ద్వారా తమ బ్యాంక్ బ్యాలెన్స్‌ని కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ సేవ ద్వారా, వినియోగదారులు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి సందేశం పంపడం ద్వారా బ్యాంక్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. బ్యాలెన్స్‌ని చెక్ చేయడానికి, కస్టమర్‌లు 9223766666కు BAL అని టైప్ చేయడం ద్వారా SMS పంపాలి. దీనితో పాటు, SBI కస్టమర్‌లు 9223766666కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా ఖాతా బ్యాలెన్స్‌ని తనిఖీ చేయవచ్చు.

మినీ స్టేట్మెంట్ చెక్ చేయడం ఎలా?

SBI కస్టమర్లు మిస్డ్ కాల్ ఇవ్వడం లేదా SMS పంపడం ద్వారా కూడా మినీ స్టేట్‌మెంట్ పొందవచ్చు. కస్టమర్లు తమ ఖాతాలోని చివరి ఐదు లావాదేవీల సమాచారాన్ని దీని ద్వారా పొందవచ్చు. SBI కస్టమర్‌లు 9223866666కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా లేదా MSTMT అని టైప్ చేసి సందేశం పంపి SMS ద్వారా కూడా మినీ స్టేట్‌మెంట్‌ను పొందవచ్చు.

ATM కార్డ్‌ని బ్లాక్ చేయడం ఎలా?

మీరు ఎస్బీఐ ఏటీఎమ్ కార్డ్ ని కోల్పోతే, ఎస్ఎంఎస్ ద్వారా కార్డుని బ్లాక్ చేయవచ్చు. దీని కోసం, కస్టమర్లు BLOCK అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి తర్వాత ఏటీఎమ్ కార్డులోని చివరి నాలుగు నంబర్లు ఎంటర్ చేయాలి. ఈ మెసేజ్ ని 567676 కి ఎస్ఎంఎస్ చేయాలి.

SBI కి సంబంధించిన ప్రశ్నలు మరియు సమాధానాలు

ప్రశ్న: ఎస్బీఐ అకౌంట్ తో మొబైల్ నంబర్ ని లింక్ చేయకుండా బ్యాంక్ బ్యాలన్స్ చేసుకోవడం ఎలా?

జవాబు: బ్యాలన్స్ ఎంక్వైరీ కోసం కస్టమర్లు తమ మొబైల్ నంబర్ ని బ్యాంకు ఖాతాతో లింక్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే, ఎస్బీఐ బ్యాంకు కస్టమర్ యొక్క ఖాతా సమాచారాన్ని వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కి పంపిస్తుంది.

ప్రశ్న: రెండు SBI అకౌంట్స్ కి ఒకే మొబైల్ నంబర్ రిజిస్టర్ అయి ఉంటే ఎలా?

జవాబు: మీకు గనుక రెండు ఖాతాలు ఉంటే, ఒక అకౌంట్ సమాచారాన్ని మాత్రమే ఎస్ఎంఎస్ మరియు మిస్డ్ కాల్ సేవల ద్వారా పొందవచ్చు. మరొక ఖాతా సమాచారం కోసం వేరే నంబర్ ద్వారా మాత్రమే ఎస్ఎంఎస్ మరియు మిస్డ్ కాల్ సేవలను పొందవచ్చు.

ప్రశ్న: ఖాతాకి లింక్ అయిన మొబైల్ నంబర్ ని మార్చుకోవడం ఎలా?

జవాబు: మీ ఎస్బీఐ ఖాతాకి లింక్ అవ్వబడి ఉన్న మొబైల్ నంబర్ ని మార్చుకోవాలనుకుంటే, మీరు బ్యాంకుకి వెళ్ళాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా కూడా మొబైల్ నంబర్ ని మార్చుకునే వీలుంది.