90km రేంజ్, ఫైర్-రెసిస్టన్స్ బ్యాటరీతో లాంచైన Stella Buzz ఎలక్ట్రిక్ స్కూటర్

హైలైట్స్

  • భారత్ లో Stella Buzz అనే ఈ-స్కూటర్ ని లాంచ్ చేసిన Stella Moto సంస్థ
  • 90 కిలోమీటర్ల రేంజ్, 55 కేఎంపీహెచ్ టాప్ స్పీడ్ తో లాంచైన Stella Buzz
  • Stella Buzz ధర రూ.95,000, 3 ఏళ్ళ వ్యారంటీని ఆఫర్ చేస్తున్న కంపెనీ
  • 2.16kWh లిథియమ్ ఐరన్ పాస్పేట్ (LFP) బ్యాటరీ ప్యాక్ తో వచ్చిన బండి

Stella Moto కంపెనీ తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ Stella Buzz ని లాంచ్ చేసింది. ఈ బండి ఎక్స్‌షోరూమ్ ధర రూ.95,000 గా నిర్ణయించారు. Stella Buzz సింగిల్ చార్జ్ పై 90 కిలోమీటర్ల దూరం వెళ్తుంది. ఈ బండి అత్యధిక వేగం 55కేఎంపీహెచ్ అని కంపెనీ చెబుతోంది.

ఈ బండి మైక్రో-ప్రాసెసర్ డ్రైవర్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ తో వస్తున్నట్లు సంస్థ చెబుతోంది. ఇది బ్యాటరీ హెల్త్ ని ఎప్పటికప్పుడు పరీక్షిస్తుంటుంది. దీని వల్లన బ్యాటరీ మంటల్లో చిక్కుకునే ప్రమాదాన్ని నివారించే అవకాశం ఉంటుందని కంపెనీ అంటోంది. Stella Buzz ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పటికే మార్కెట్ లో ఉన్న Bounce Infinity E1, Ola S1 Air, Ola S1, TVS iQube ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోటీపడనుంది.

భారత్ లో Stella Buzz ఎలక్ట్రిక్ స్కూటర్ ధర, లభ్యత

Stella Buzz ఎలక్ట్రిక్ స్కూటర్ భారత్ లో రూ.95,000 ఎక్స్-షోరూమ్ ధరతో లాంచ్ అయ్యింది. Stella Buzz నాలుగు రంగుల్లో లభిస్తుంది. అవి: గ్రే, మ్యాట్ బ్లూ, రెడ్, బ్రౌన్. ఈ బండిపై కంపెనీ 3 ఏళ్ళ వ్యారంటీని ఆఫర్ చేస్తోంది. Stella Buzz డెలివరీలు ఈ నెలలోనే మొదలవుతాయని కంపెనీ చెబుతోంది.

Stella Buzz స్పెసిఫికేషన్స్

Stella Buzz ఎలక్ట్రిక్ స్కూటర్ 2 కిలోవాట్ బీఎల్డీసీ మోటర్, 2.16kWh లిథియమ్ ఐరన్ పాస్పేట్ (LFP) బ్యాటరీ ప్యాక్ తో వస్తోంది. LPF బ్యాటరీ ప్యాక్, లిథియమ్ అయాన్ బ్యాటరీతో పోల్చితే అత్యధిక ఫైర్-రెసిస్టన్స్ ని కలిగి ఉంటుందని కంపెనీ చెబుతోంది. అలాగే బండిలో ఎన్నో సెన్సర్స్ ఉంటాయని మరియు మైక్రో-ప్రాసెసర్ బేస్డ్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ బ్యాటరీ హెల్త్ ని భారతీయ పరిస్థితుల ఆధారంగా పరీక్షిస్తూ ఉంటుందని కంపెనీ చెబుతోంది. దీని వల్లన బ్యాటరీ పేలుళ్ళను నివారించేందుకు ఆస్కారముంటుంది. ఏదేమైనా ఈ తరహా కొత్త రకం బ్యాటరీలు రావాల్సిన అవసరం చాలా ఉంది.

Stella Buzz ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్ చార్జ్ పై 90 కిలోమీటర్ల దూరం వెళ్తుంది. దీని గరిష్ట వేగం 55 కేఎంపీహెచ్. Stella Buzz యొక్క మోత సామర్థ్యం 150 కిలోలు. ఇక ఈ బండి 180 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ ని కలిగి ఉంది. ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, డిస్క్ బ్రేక్స్, ట్యూబ్లెస్ టైర్స్, డిజిటల్ స్పీడోమీటర్, సెంట్రల్ లాకింగ్, యూఎస్బీ చార్జర్, క్రూజ్ కంట్రోల్, యాంటీ-థెఫ్ట్ సిస్టమ్ వంటివి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఉంటాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.