Adani Data Networks - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 06 Jan 2023 08:03:45 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 2023 లో 5జీ సేవలను లాంచ్ చేయనున్న Adani Group https://www.91mobiles.com/telugu/adani-group-5g-services-enterprises-2023/ Fri, 06 Jan 2023 08:03:45 +0000 https://www.91mobiles.com/telugu/?p=4364 హైలైట్స్ ఈ ఏడాది ఎంటర్‌ప్రైజెస్ కి 5జీ సేవలు అందించనున్న అదాని గ్రూప్ ఇదే సంవత్సరంలో కన్జూమర్ అప్లికేషన్స్ ని తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోన్న అదాని గ్రూప్ ఇంకా ఇండస్ట్రియల్ క్లౌడ్ లో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపుతోన్న అదాని గ్రూప్ ఎంటర్‌ప్రైజెస్ కి అదాని గ్రూప్ 5జీ సేవలను అందించేందుకు సిద్ధమవుతోంది. తన డిజిటల్ స్ట్రేటజీలో భాగంగా కన్జూమర్ల కోసం యాప్స్ లాంచ్ చేయబోతున్నట్లు సదరు కంపెనీ వెల్లడించింది. అంటే ఇప్పుడప్పుడే టెలీకామ్ వైపు అడుగులు […]

The post 2023 లో 5జీ సేవలను లాంచ్ చేయనున్న Adani Group first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • ఈ ఏడాది ఎంటర్‌ప్రైజెస్ కి 5జీ సేవలు అందించనున్న అదాని గ్రూప్
  • ఇదే సంవత్సరంలో కన్జూమర్ అప్లికేషన్స్ ని తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోన్న అదాని గ్రూప్
  • ఇంకా ఇండస్ట్రియల్ క్లౌడ్ లో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపుతోన్న అదాని గ్రూప్

ఎంటర్‌ప్రైజెస్ కి అదాని గ్రూప్ 5జీ సేవలను అందించేందుకు సిద్ధమవుతోంది. తన డిజిటల్ స్ట్రేటజీలో భాగంగా కన్జూమర్ల కోసం యాప్స్ లాంచ్ చేయబోతున్నట్లు సదరు కంపెనీ వెల్లడించింది. అంటే ఇప్పుడప్పుడే టెలీకామ్ వైపు అడుగులు వేసే అవకాశం లేదని పరోక్షంగా కంపెనీ తెలిపినట్లు అర్థమవుతోంది. ప్రస్తుతం టెలీకామ్ రంగంలో రిలయన్స్ జియో మరియు ఎయిర్టెల్ సంస్థలు అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి.

కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని, గౌతమ్ అదాని తన ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ఏడాది కొన్ని రంగాల్లో తమ కంపెనీ పెట్టుబడులు పెట్టనుందని గౌతమ్ అదాని తెలిపారు. ఇండస్ట్రియల్ క్లౌడ్ కేపబులిటీస్, 5జీ రోలౌట్ సర్వీసెస్, డేటా సెంటర్స్ నెట్వర్క్, బిల్డింగ్ ఏఐ-ఎంఎల్, బీ2సీ యాప్స్ వంటి వాటిలో పెట్టుబడులు పెట్టనున్నట్లు అదాని వెల్లడించారు.

Adani Group 5G స్పెక్ట్రమ్ వివరాలు

అదాని డేటా నెట్వర్క్ 20 గిగాహెర్ట్జ్ మిల్లీమీటర్ బ్యాండ్ లో 400 మెగాహెర్ట్జ్ విలువగల స్పెక్ట్రమ్ ని 20 ఏళ్ళ కాలపరిమితికి గాను కొనుగోలు చేసింది. 5జీ బ్యాండ్స్ కొనుగోలు కోసం అదాని గ్రూప్ రూ.211 కోట్లు వెచ్చించింది. డిజిటల్ ఇన్ఫాస్ట్రక్చర్ పోర్ట్‌ఫోలియోని క్రియేట్ చేసేందుకు అదాని గ్రూప్ స్పెక్ట్రమ్ ని కొనుగోలు చేసింది. యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేయడంలో తమ కంపెనీ స్పెక్ట్రమ్ గా నిలుస్తుందని అదాని గ్రూప్ ప్రకటించింది.

అదాని గ్రూప్ vs ఎయిర్టెల్ vs జియో

ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, అదాని గ్రూప్ యాప్ సెగ్మెంట్ లోకి ప్రవేశించనుంది. అయితే టెలీకామ్ సర్వీసెస్ లోకి వస్తున్నట్లు మాత్రం ప్రకటించలేదు. అయినప్పటికీ ఇప్పటికే మార్కెట్ లో ఉన్న టెలీకామ్ సంస్థలకు అదాని రాక కష్టాలను తేచ్చే అవకాశం ఉంది.

జియో మరియు ఎయిర్టెల్ 5జీ నెట్వర్క్ లో భారీ పెట్టుబడులు పెట్టాయి. ఈ ఏడాది ముగిసే నాటికి 5జీ విస్తరణలో భాగంగా రూ.2 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు జియో ప్రకటించింది.

దేశంలోని 26 నగరాల్లో 5జీ సేవలను లాంచ్ చేసిన జియో, గుజరాత్ లోని 33 జిల్లాల్లో 5జీ సేవలను ప్రారంభించింది. 2023 చివరి కల్లా, దేశం మొత్తం 5జీ నెట్వర్క్ ని విస్తరింపజేయాలని జియో లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు ఎయిర్టెల్ సంస్థ ఇప్పటికే 21 నగరాలకు 5జీ సేవలు అందిస్తోంది. 2024 కల్లా పూర్తి స్థాయిలో దేశ వ్యాప్తంగా 5జీ సేవలను విస్తరింపజేయాలని ఎయిర్టెల్ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇక్కడ అదాని గ్రూప్ యూనిఫైడ్ లైసెన్స్ తీసుకున్న సంగతిని మరిచిపోవద్దు. అంటే, దేశంలో టెలీకామ్ సేవలను అందించేందుకు అదాని గ్రూప్ యాక్సెస్ పొందింది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 2023 లో 5జీ సేవలను లాంచ్ చేయనున్న Adani Group first appeared on 91Mobiles Telugu.

]]>
టెలీకామ్ సర్వీసెస్ లైసెన్స్ పొందిన Adani కంపెనీ, Jio, Airtel ఆదిపత్యానికి తెరపడనుందా? https://www.91mobiles.com/telugu/adani-data-networks-gets-unified-license/ Wed, 12 Oct 2022 10:44:31 +0000 https://www.91mobiles.com/telugu/?p=2878 హైలైట్స్ టెలీకామ్ మార్కెట్ లోకి 6 ఏళ్ళ తర్వాత వస్తున్న కొత్త కంపెనీ టెలీకామ్ సర్వీసెస్ లైసెన్స్ పొందిన అదాని కంపెనీ మరోసారి మొబైల్ రీచార్జ్ ప్లాన్స్ ధరలు పడిపోనున్నాయా? ప్రస్తుతం భారతీయ టెలీకామ్ మార్కెట్ లో జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు టాప్-3 పొజిషన్ లో యాక్టివ్ గా సేవలు అందిస్తున్నాయి. రిలయన్స్ జియో అత్యధిక సబ్‌స్క్రైబర్లతో అగ్రస్థానంలో ఉండగా, తర్వాత స్థానాల్లో వరుసగా ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు ఉన్నాయి. భారత్ లో […]

The post టెలీకామ్ సర్వీసెస్ లైసెన్స్ పొందిన Adani కంపెనీ, Jio, Airtel ఆదిపత్యానికి తెరపడనుందా? first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • టెలీకామ్ మార్కెట్ లోకి 6 ఏళ్ళ తర్వాత వస్తున్న కొత్త కంపెనీ
  • టెలీకామ్ సర్వీసెస్ లైసెన్స్ పొందిన అదాని కంపెనీ
  • మరోసారి మొబైల్ రీచార్జ్ ప్లాన్స్ ధరలు పడిపోనున్నాయా?

ప్రస్తుతం భారతీయ టెలీకామ్ మార్కెట్ లో జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు టాప్-3 పొజిషన్ లో యాక్టివ్ గా సేవలు అందిస్తున్నాయి. రిలయన్స్ జియో అత్యధిక సబ్‌స్క్రైబర్లతో అగ్రస్థానంలో ఉండగా, తర్వాత స్థానాల్లో వరుసగా ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు ఉన్నాయి.

భారత్ లో 5జీ సేవలు ప్రారంభమయ్యాక, జియో మరియు ఎయిర్టెల్ మధ్య పోటీ పెరిగింది. కానీ, చూస్తుంటే త్వరలోనే భారతీయ టెలీకామ్ మార్కెట్ లో మార్పు రానుందని తెలుస్తోంది. ఈ మూడు సంస్థలకు తోడు త్వరలోనే అదాని డేటా నెట్వర్క్ జత చేరనుందని సమాచారం. అదాని డేటా నెట్వర్క్స్ టెలీకామ్ సర్వీసెస్ లైసెన్స్ పొందినట్లు తెలుస్తోంది. దీంతో అదాని కంపెనీ కూడా టెలీకామ్ సేవలను అందించనుంది.

యూనిఫైడ్ లైసెన్స్ పొందిన Adani Data Networks

దేశ వ్యాప్తంగా టెలీకామ్ సేవలను అందించేందుకు భారత ప్రభుత్వం నుంచి అదాని నెట్వర్క్స్ కి లైసెన్స్ జారీ అయినట్లు తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. అదాని డేటా నెట్వర్క్స్ కి యూనిఫైడ్ లైసెన్స్ ఇవ్వబడింది. దీంతో జియో, ఎయిర్టెల్ సంస్థల మాదిరి అదాని డేటా నెట్వర్క్స్ కూడా టెలీకామ్ సేవలను అందించనుంది. టెలీకామ్ మార్కెట్ లోకి అదాని ఎంట్రీ మార్కెట్ స్వరూపాన్ని పూర్తిగా మార్చనుంది. ముకేశ్ అంబాని యొక్క జియో, సునీల్ భారతి మిట్టల్ యొక్క ఎయిర్టెల్ కు నష్టం తీవ్రస్థాయిలో ఉండటం ఖాయమని సమాచారం.

3 నెలల పాటు ఉచిత 5G సేవలు

ఎప్పుడైతే ముకేశ్ అంబాని రిలయన్స్ జియో ని మార్కెట్ లోకి లాంచ్ చేశారో అప్పుడు జియో 4జీ సేవలను కొన్ని నెలల పాటు ఉచితంగా అందించారు. ఉచితంగా 4జీ డేటా, 4జి సిమ్ లభిస్తుండటంతో, జనాలు జియో సిమ్ ని కొన్నారు. జియో స్టోర్ల వద్ద జనాలు క్యూ కట్టారు. అదాని నెట్వర్క్ సర్వీసెస్ విషయంలో కూడా ఇదే పరిస్థితి ఉండనుంది. జియో మాదిరి, అదాని 5జీ సేవలు కూడా కొన్ని నెలల పాటు ఉచితంగా ఇచ్చే అవకాశం ఉంది.

6 ఏళ్ళ తర్వాత వస్తున్న కొత్త కంపెనీ

భారత ప్రభుత్వం నడిపిస్తోన్న BSNL తో పాటు, జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి మరో మూడు ప్రైవేటు టెలీకామ్ కంపెనీలు మాత్రమే ప్రస్తుతం మార్కెట్ లో ఉన్నాయి. వొడాఫోన్, ఐడియా సంస్థలు కలిసి వీఐ పేరుతో ఒకే సంస్థగా ఏర్పడిన సంగతి తెలిసిందే.

ఇకపోతే రిలయన్స్ జియో సంస్థ 2016 లో టెలీకామ్ మార్కెట్ లోకి ప్రవేశించింది. నేటితో రిలయన్స్ జియో వచ్చి 6 సంవత్సరాలు అవుతోంది. మరే ఇతర టెలీకామ్ సంస్థ కూడా ఈ ఆరేళ్ళలో మార్కెట్ లోకి రాలేదు. జనాలకు వేరే ఆప్షన్ లేకపోవడంతో, అన్ని టెలీకామ్ సంస్థల ప్లాన్స్ కూడా దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో అదాని టెలీకామ్ కంపెనీ ఎంట్రీ మొబైల్ వినియోగదారులకు ఎంతో ప్రయోజనం చేకూర్చనుంది. అదాని టెలీకామ్ సర్వీసెస్ ఎంట్రీతో మరోసారి మొబైల్ రీచార్జ్ ప్లాన్స్ ధరలు పడిపోయే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post టెలీకామ్ సర్వీసెస్ లైసెన్స్ పొందిన Adani కంపెనీ, Jio, Airtel ఆదిపత్యానికి తెరపడనుందా? first appeared on 91Mobiles Telugu.

]]>
6 సర్కిల్స్ లో 5G సేవలను ప్రారంభించనున్న Adani Group, Jio పై ప్రభావం ఉంటుందా? https://www.91mobiles.com/telugu/adani-data-networks-5g-services-jio-5g-services/ Tue, 23 Aug 2022 14:37:37 +0000 https://www.91mobiles.com/telugu/?p=1846 హైలైట్స్: 6 సర్కిల్స్ లో 5జీ సేవలను మొదలు పెట్టనున్న అదానీ గ్రూప్ అంబానీకి చెందిన జియో కి అదానీ గ్రూప్ పోటీ ఇవ్వనుందా? 5జీ వేలంలో 400 మెగా హెర్ట్జ్ స్పెక్ట్రమ్ ని సొంతం చేసుకున్న అదానీ డేటా నెట్వర్క్ దేశంలో 5జీ స్పెక్ట్రమ్ వేలం ముగిసింది. ప్రధాన టెలీకామ్ ఆపరేటర్లు తమ వంతు స్పెక్ట్రమ్ షేర్ ని దక్కించుకున్నారు. జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కాకుండా అదానీ గ్రూప్ కూడా వేలంలో పాల్గొని అందరినీ […]

The post 6 సర్కిల్స్ లో 5G సేవలను ప్రారంభించనున్న Adani Group, Jio పై ప్రభావం ఉంటుందా? first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • 6 సర్కిల్స్ లో 5జీ సేవలను మొదలు పెట్టనున్న అదానీ గ్రూప్
  • అంబానీకి చెందిన జియో కి అదానీ గ్రూప్ పోటీ ఇవ్వనుందా?
  • 5జీ వేలంలో 400 మెగా హెర్ట్జ్ స్పెక్ట్రమ్ ని సొంతం చేసుకున్న అదానీ డేటా నెట్వర్క్

దేశంలో 5జీ స్పెక్ట్రమ్ వేలం ముగిసింది. ప్రధాన టెలీకామ్ ఆపరేటర్లు తమ వంతు స్పెక్ట్రమ్ షేర్ ని దక్కించుకున్నారు. జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కాకుండా అదానీ గ్రూప్ కూడా వేలంలో పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచింది. అదానీ గ్రూప్ కి చెందిన అదానీ డేటా నెట్వర్క్స్ ఎంట్రీతో అంబానీకి చెందిన జియో పై ఏమైన ప్రభావం పడనుందా? ఆ విషయాలు మున్ముందు తెలుసుకుందాం. పదండి.

Adani Data Networks యొక్క 5G ప్లాన్

5జీ వేలంలో అదానీ డేటా నెట్వర్క్ 400 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ ను సొంతం చేసుకుంది. ఈ 26 గిగాహెర్ట్జ్ బ్యాండ్స్ కొరకు అదానీ గ్రూప్ రూ.212 కోట్లు చెల్లించనుంది. ఈ బ్యాండ్స్ అన్నీ కూడా హై-బ్యాండ్ స్పెక్ట్రమ్ కి సంబంధించినవని గమనించాలి. అదానీ డేటా నెట్వర్క్స్ లో-బ్యాండ్, మిడ్-బ్యాండ్ లపై ఆసక్తి కనబరచలేదు. లో, మిడ్, హై బ్యాండ్స్ గురించి మేం ఎందుకు మాట్లాడుతున్నామో మీరు తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. మనం రెగ్యులర్ గా స్మార్ట్ ఫోన్స్ లో వాడే ఇంటర్నెట్ కొరకు లో-బ్యాండ్, మిడ్-బ్యాండ్ ఫ్రీక్వెన్సీ కావాలి. దాదాపుగా ఈ బ్యాండ్స్ పైనే మొబైల్ ఫోన్స్ పని చేస్తాయి.

వినియోగదారుల కొరకు ఎక్కువగా మిడ్-బ్యాండ్ ని వాడతారు. ఈ మిడ్-బ్యాండ్స్ పట్టణాలు, నగరాల్లో మంచి సిగ్నల్, కవరేజీని అందిస్తాయి. కానీ అదానీ తన సొంత మొబైల్ నెట్వర్క్ ని తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నట్లు కనిపించడం లేదు. ఆయనకు ఆ ఉద్దేశ్యం లేదని తెలుస్తోంది. ఆయన మిడ్-బ్యాండ్ పై పెట్టుబడి పెట్టకపోవడంతో ఇది స్పష్టమవుతోంది.

Jio 5G ప్లాన్

అదానీ తర్వాత ఇప్పుడు అంబానీ గురించి తెలుసుకుందాం. ఇక అంబానీ 5జీ వేలంలో అత్యధిక స్పెక్ట్రమ్ ని దక్కించుకుని అగ్రస్థానంలో నిలిచారు. రూ.88,078 కోట్ల విలువైన 24,740 మెగాహెర్ట్జ్ 5జీ స్పెక్ట్రమ్ ని అంబానీ సొంతం చేసుకున్నారు. దీంతో టెలీకామ్ కంపెనీల్లో జియో పైచేయి సాధించినట్లైంది.

మరోవైపు అదానీ పెట్టుబడి పెట్టిన 26 గిగాహెర్ట్జ్ హై ఫ్రీక్వెన్సీ బ్యాండ్, జియో పొందిన 5జీ బ్యాండ్స్ లో ఒకటి. దానికి తోడు, జియో వద్ద శక్తివంతమైన 5జీ బ్యాండ్ అని చెప్పబడుతోన్న 700 మెగాహెర్ట్జ్ 5జీ బ్యాండ్ ఉంది. ప్రస్తుతం 5జీ సేవలు అందించేందుకు 700 మెగాహెర్ట్జ్ బ్యాండ్ సరైనదని చెబుతున్నారు.

అంబానీ వర్సెస్ అదానీ (Ambani vs Adani)

ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. అదానీకి, అంబానీకి మధ్య 5జీ సమరం ఉండబోదని చెప్పాలి. ఎందుకంటే, అదానీ డేటా నెట్వర్క్స్ ఇన్‌స్టిట్యూషనల్ 5జీ సేవలను అందించనుంది. మరోవైపు అంబానీకి చెందిన రిలయన్స్ జియో సెల్యూలర్ 5జీ సర్వీస్ లను అందిస్తుంది. అందువల్లన, అదానీ గ్రూప్ 5జీ సెక్టర్ లోకి ప్రవేశించడం వల్లన, జియో పై ఎటువంటి ప్రభావం ఉండదు.

అయితే భవిష్యత్తులో అదానీ డేటా నెట్వర్క్స్ తమ ప్రణాళికల్లో మార్పులు చేసి, వేరే ఏదైనా టెలీకామ్ ఆపరేటర్ తో చేతులు కలిపితే కనుక, అప్పుడు జియో కి సమస్యలు మొదలవుతాయి. అయితే ప్రస్తుతం భారత 5జీ మార్కెట్ లో అటువంటి పరిణామాలు జరిగే అవకాశం కనిపించడం లేదు.

లేటెస్ట్ టెలీకామ్ న్యూస్ కొరకు 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ ని విజిట్ చేయండి.

The post 6 సర్కిల్స్ లో 5G సేవలను ప్రారంభించనున్న Adani Group, Jio పై ప్రభావం ఉంటుందా? first appeared on 91Mobiles Telugu.

]]>