6 సర్కిల్స్ లో 5G సేవలను ప్రారంభించనున్న Adani Group, Jio పై ప్రభావం ఉంటుందా?

హైలైట్స్:

  • 6 సర్కిల్స్ లో 5జీ సేవలను మొదలు పెట్టనున్న అదానీ గ్రూప్
  • అంబానీకి చెందిన జియో కి అదానీ గ్రూప్ పోటీ ఇవ్వనుందా?
  • 5జీ వేలంలో 400 మెగా హెర్ట్జ్ స్పెక్ట్రమ్ ని సొంతం చేసుకున్న అదానీ డేటా నెట్వర్క్

దేశంలో 5జీ స్పెక్ట్రమ్ వేలం ముగిసింది. ప్రధాన టెలీకామ్ ఆపరేటర్లు తమ వంతు స్పెక్ట్రమ్ షేర్ ని దక్కించుకున్నారు. జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కాకుండా అదానీ గ్రూప్ కూడా వేలంలో పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచింది. అదానీ గ్రూప్ కి చెందిన అదానీ డేటా నెట్వర్క్స్ ఎంట్రీతో అంబానీకి చెందిన జియో పై ఏమైన ప్రభావం పడనుందా? ఆ విషయాలు మున్ముందు తెలుసుకుందాం. పదండి.

Adani Data Networks యొక్క 5G ప్లాన్

5జీ వేలంలో అదానీ డేటా నెట్వర్క్ 400 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ ను సొంతం చేసుకుంది. ఈ 26 గిగాహెర్ట్జ్ బ్యాండ్స్ కొరకు అదానీ గ్రూప్ రూ.212 కోట్లు చెల్లించనుంది. ఈ బ్యాండ్స్ అన్నీ కూడా హై-బ్యాండ్ స్పెక్ట్రమ్ కి సంబంధించినవని గమనించాలి. అదానీ డేటా నెట్వర్క్స్ లో-బ్యాండ్, మిడ్-బ్యాండ్ లపై ఆసక్తి కనబరచలేదు. లో, మిడ్, హై బ్యాండ్స్ గురించి మేం ఎందుకు మాట్లాడుతున్నామో మీరు తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. మనం రెగ్యులర్ గా స్మార్ట్ ఫోన్స్ లో వాడే ఇంటర్నెట్ కొరకు లో-బ్యాండ్, మిడ్-బ్యాండ్ ఫ్రీక్వెన్సీ కావాలి. దాదాపుగా ఈ బ్యాండ్స్ పైనే మొబైల్ ఫోన్స్ పని చేస్తాయి.

వినియోగదారుల కొరకు ఎక్కువగా మిడ్-బ్యాండ్ ని వాడతారు. ఈ మిడ్-బ్యాండ్స్ పట్టణాలు, నగరాల్లో మంచి సిగ్నల్, కవరేజీని అందిస్తాయి. కానీ అదానీ తన సొంత మొబైల్ నెట్వర్క్ ని తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నట్లు కనిపించడం లేదు. ఆయనకు ఆ ఉద్దేశ్యం లేదని తెలుస్తోంది. ఆయన మిడ్-బ్యాండ్ పై పెట్టుబడి పెట్టకపోవడంతో ఇది స్పష్టమవుతోంది.

Jio 5G ప్లాన్

అదానీ తర్వాత ఇప్పుడు అంబానీ గురించి తెలుసుకుందాం. ఇక అంబానీ 5జీ వేలంలో అత్యధిక స్పెక్ట్రమ్ ని దక్కించుకుని అగ్రస్థానంలో నిలిచారు. రూ.88,078 కోట్ల విలువైన 24,740 మెగాహెర్ట్జ్ 5జీ స్పెక్ట్రమ్ ని అంబానీ సొంతం చేసుకున్నారు. దీంతో టెలీకామ్ కంపెనీల్లో జియో పైచేయి సాధించినట్లైంది.

మరోవైపు అదానీ పెట్టుబడి పెట్టిన 26 గిగాహెర్ట్జ్ హై ఫ్రీక్వెన్సీ బ్యాండ్, జియో పొందిన 5జీ బ్యాండ్స్ లో ఒకటి. దానికి తోడు, జియో వద్ద శక్తివంతమైన 5జీ బ్యాండ్ అని చెప్పబడుతోన్న 700 మెగాహెర్ట్జ్ 5జీ బ్యాండ్ ఉంది. ప్రస్తుతం 5జీ సేవలు అందించేందుకు 700 మెగాహెర్ట్జ్ బ్యాండ్ సరైనదని చెబుతున్నారు.

అంబానీ వర్సెస్ అదానీ (Ambani vs Adani)

ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. అదానీకి, అంబానీకి మధ్య 5జీ సమరం ఉండబోదని చెప్పాలి. ఎందుకంటే, అదానీ డేటా నెట్వర్క్స్ ఇన్‌స్టిట్యూషనల్ 5జీ సేవలను అందించనుంది. మరోవైపు అంబానీకి చెందిన రిలయన్స్ జియో సెల్యూలర్ 5జీ సర్వీస్ లను అందిస్తుంది. అందువల్లన, అదానీ గ్రూప్ 5జీ సెక్టర్ లోకి ప్రవేశించడం వల్లన, జియో పై ఎటువంటి ప్రభావం ఉండదు.

అయితే భవిష్యత్తులో అదానీ డేటా నెట్వర్క్స్ తమ ప్రణాళికల్లో మార్పులు చేసి, వేరే ఏదైనా టెలీకామ్ ఆపరేటర్ తో చేతులు కలిపితే కనుక, అప్పుడు జియో కి సమస్యలు మొదలవుతాయి. అయితే ప్రస్తుతం భారత 5జీ మార్కెట్ లో అటువంటి పరిణామాలు జరిగే అవకాశం కనిపించడం లేదు.

లేటెస్ట్ టెలీకామ్ న్యూస్ కొరకు 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ ని విజిట్ చేయండి.