Aha ott - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 09 Dec 2022 09:38:42 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 ఇవాళ OTT లోకి ఎంట్రీ ఇచ్చిన తెలుగు సినిమాలు ఇవే https://www.91mobiles.com/telugu/four-telugu-films-streaming-on-ott-today/ Fri, 09 Dec 2022 09:38:42 +0000 https://www.91mobiles.com/telugu/?p=3903 హైలైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5, ఆహా, నెట్‌ఫ్లిక్స్ లలో స్ట్రీమ్ కానున్న పలు తెలుగు సినిమాలు ఓటీటీ ఆడియన్స్ ని పలకరించనున్న నితిన్ మాచర్ల నియోజకవర్గం, అల్లు శిరీష్ ఊర్వశివో రాక్షసివో, యశోద చిత్రాలు సోని లివ్ లో అందుబాటులో ఉన్న లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ సినిమా శుక్రవారం వచ్చిందంటే సినీ ప్రేమికులకు పండగేనని చెప్పాలి. ఎందుకంటే ఇదే రోజున ఎక్కువగా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఇటీవలి కాలంలో, ఓటీటీల ప్రభావం కూడా చాలా […]

The post ఇవాళ OTT లోకి ఎంట్రీ ఇచ్చిన తెలుగు సినిమాలు ఇవే first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5, ఆహా, నెట్‌ఫ్లిక్స్ లలో స్ట్రీమ్ కానున్న పలు తెలుగు సినిమాలు
  • ఓటీటీ ఆడియన్స్ ని పలకరించనున్న నితిన్ మాచర్ల నియోజకవర్గం, అల్లు శిరీష్ ఊర్వశివో రాక్షసివో, యశోద చిత్రాలు
  • సోని లివ్ లో అందుబాటులో ఉన్న లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ సినిమా

శుక్రవారం వచ్చిందంటే సినీ ప్రేమికులకు పండగేనని చెప్పాలి. ఎందుకంటే ఇదే రోజున ఎక్కువగా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఇటీవలి కాలంలో, ఓటీటీల ప్రభావం కూడా చాలా పెరిగింది. దీంతో థియేటర్లలో సినిమాలను మిస్ అయ్యే వారు ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు ఒకేసారి 4 సినిమాలు ఓటీటీ లో స్ట్రీమింగ్ కి వచ్చేశాయి. ఆ సినిమాలేంటో తెలుసుకుందాం పదండి.

1.మాచర్ల నియోజకవర్గం
2.యశోద
3.ఊర్వశివో రాక్షసివో
4.లైక్-షేర్ & సబ్‌స్క్రైబ్

1.మాచర్ల నియోజకవర్గం

నితిన్, కృతిశెట్టి ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో నితిన్ కలెక్టర్ గా కనిపించారు. పొలిటికల్ త్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా థియేటర్లలో పర్వాలేదనిపించింది. అయితే కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు. మరి ఓటీటీ ఆడియన్స్ ని అయినా మెప్పిస్తుందో లేదో చూడాలి. ఈ చిత్రం జీ5 ఓటీటీలో అందుబాటులో ఉంది.

2.యశోద

సమంతా ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం ఇటీవలె థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఓపెనింగ్స్ బాగానే రాబట్టినప్పటికీ, తర్వాత అదే ఊపుని కొనసాగించలేకపోయింది. దీంతో త్వరగానే థియేటర్ల నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేసింది. సమంతా ఈ చిత్రంలో పోరాట సన్నివేశాల్లో కూడా నటించి మెప్పించింది. వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, దివ్య శ్రీపాద ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి హరి-హరీశ్ దర్శకత్వం వహించారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు. శివలెంక కే ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఈ చిత్రం అందుబాటులో ఉంది.

3.ఊర్వశివో రాక్షసివో

ఈ చిత్రంలో అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రలు పోషించారు. రాకేశ్ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేటి నుంచి ఆహా ఓటీటీ తో పాటు, నెట్‌ఫ్లిక్స్ లో కూడా స్ట్రీమ్ అవుతోంది. వివాహం గొప్పదా లేక లివ్-ఇన్ రిలేషన్షిప్ బెటరా? అనే విషయాన్ని ఈ చిత్రంలో చర్చించారు.

4.లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్

ఈ చిత్రంలో సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా, సుదర్శన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా సోనిలివ్ ఓటీటీ లో అందుబాటులో ఉంది. మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు. రాము తూము ఎడిటింగ్ చేశాడు. ప్రవీణ్ లక్కరాజు ఈ చిత్రానికి సంగీతం అందించాడు.

మరింకేంటి, ఈ 4 తెలుగు సినిమాలని చూసేసి ఈ వీకెండ్ ని బాగా ఎంజాయ్ చేయండి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post ఇవాళ OTT లోకి ఎంట్రీ ఇచ్చిన తెలుగు సినిమాలు ఇవే first appeared on 91Mobiles Telugu.

]]>
Comedy Stock Exchange తో ఓటీటీకి ఎంట్రీ ఇస్తోన్న దర్శకుడు అనిల్ రావిపూడి https://www.91mobiles.com/telugu/aha-comedy-stock-exchange-anil-ravipudi-ott-debut/ Mon, 21 Nov 2022 13:43:04 +0000 https://www.91mobiles.com/telugu/?p=3568 హైలైట్స్ కామెడీ స్టాక్ ఎక్స్‌చేంజ్ పేరుతో ఒక వినోద కార్యక్రమాన్ని తీసుకొస్తోన్న ఆహా ఓటీటీ ఈ కార్యక్రమంతో ఓటీటీ లోకి ఎంట్రీ ఇస్తోన్న సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి షో లో చైర్మన్ గా వ్యవహరించనున్న అనిల్ రావిపూడి, హోస్టులుగా వ్యవహరించనున్న సుడిగాలి సుధీర్, దీపికా పిళ్ళై తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా, గతేడాది తెలుగు ఇండియన్ ఐడల్, డ్యాన్స్ ఐకన్, అన్‌స్టాపబుల్, సర్కార్ వంటి పలు కార్యక్రమాలను తీసుకొచ్చి, ఓటీటీ ఆడియన్స్ ని అమితంగా అలరించింది. […]

The post Comedy Stock Exchange తో ఓటీటీకి ఎంట్రీ ఇస్తోన్న దర్శకుడు అనిల్ రావిపూడి first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • కామెడీ స్టాక్ ఎక్స్‌చేంజ్ పేరుతో ఒక వినోద కార్యక్రమాన్ని తీసుకొస్తోన్న ఆహా ఓటీటీ
  • ఈ కార్యక్రమంతో ఓటీటీ లోకి ఎంట్రీ ఇస్తోన్న సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి
  • షో లో చైర్మన్ గా వ్యవహరించనున్న అనిల్ రావిపూడి, హోస్టులుగా వ్యవహరించనున్న సుడిగాలి సుధీర్, దీపికా పిళ్ళై

తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా, గతేడాది తెలుగు ఇండియన్ ఐడల్, డ్యాన్స్ ఐకన్, అన్‌స్టాపబుల్, సర్కార్ వంటి పలు కార్యక్రమాలను తీసుకొచ్చి, ఓటీటీ ఆడియన్స్ ని అమితంగా అలరించింది. ఇప్పుడు కొత్త జోనర్ ని ఎక్స్‌ప్లోర్ చేయబోతోంది ఆహా. త్వరలోనే Comedy Stock Exchange పేరుతో ఒక కామెడీ షోని లాంచ్ చేయనుంది. ఇదొక లైట్-హార్టెడ్ ఫ్యామిలీ కామెడీ షో. రైటర్, దర్శకుడు అనిల్ రావిపూడి ఈ కార్యక్రమంతో ఓటీటీ కి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ షో లో ఆయన చైర్మన్ గా వ్యవహరించనున్నారు. ఈ చైర్మన్ ఏంటని తెలుసుకోవాలని ఉందా? అయితే షో మొదలయ్యే వరకు ఆగాల్సిందే.

డిసెంబర్ 2 నుంచి కామెడీ స్టాక్ ఎక్స్‌చేంజ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. అనిల్ రావిపూడి ఈ కార్యక్రమంలో చైర్మన్ గా వ్యవహరిస్తుండగా, సుడిగాలి సుధీర్, దీపికా పిళ్ళై హోస్టింగ్ చేయనున్నారు. ప్రముఖ హాస్య నటులు వేణు, ముక్కు అవినాశ్, సద్దాం, ఎక్స్‌ప్రెస్ హరి, భాస్కర్, జ్ఞానేశ్వర్ ఈ కార్యక్రమంలో భాగం కానున్నారు. వీరంతా కలిసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తారని ఆశిద్దాం. ఈ షో లో మొత్తం మూడు రౌండ్స్ ఉంటాయి. లైవ్ ఆడియన్స్ తమ ఫేవరెట్ స్టాక్ (కమెడియన్) కి ఓటు వేయడం జరుగుతుంది.

ఎక్కువ ఓట్లు గెలిచిన వారిని చైర్మన్ టాప్ స్టాక్ గా ప్రకటిస్తారు. ఈ కార్యక్రమం లో మొత్తం 10 ఎపిసోడ్స్ ఉంటాయి. ప్రతీ వీకెండ్ కచ్చితంగా వినోదాన్ని పంచడం ఖాయం.

అనిల్ రావిపూడి ఓటీటీ ఎంట్రీ

తన ఓటీటీ ఎంట్రీ పట్ల దర్శకుడు అనిల్ రావిపూడి సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భాగం కావడం ఆనందంగా ఉందన్నారు. ఈ షో విభిన్న కామెడీ యాంగిల్స్ ని చూపిస్తుందని అనిల్ తెలిపారు. తన ఎంట్రీకి వేదికైనందుకు, అలాగే కామెడీ స్టాక్ ఎక్స్‌చేంజ్ షో లో అవకాశం ఇచ్చినందుకు ఆహా కి అనిల్ ధన్యవాదాలు తెలిపారు.

“నా తొలి ఓటీటీ కార్యక్రమం కావున, ఇది నా హృదయానికి ఎంతో దగ్గరైనది. నా అభిమానులు నన్ను ఒక కొత్త అవతారంలో చూస్తారు,” అని అనిల్ రావిపూడి అన్నారు. ఆహా ఓటీటీ తో అసోసియేట్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని, తనని తాను రీఇన్వెంట్ చేసుకునేందుకు ఇదొక చక్కటి అవకాశమని సుడిగాలి సుధీర్ అన్నారు.

తొలి తెలుగు ఓటీటీ గా మొదలైన ఆహా అనతి కాలంలోనే రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు దగ్గరైంది. ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు, విభిన్నమైన సినిమాలను ఓటీటీ ఆడియన్స్ కి అందిస్తూ అగ్ర ఓటీటీ సంస్థలకు గట్టి పోటీ ఇస్తోంది. కామెడీ స్టాక్ ఎక్స్‌చేంజ్ కార్యక్రమం తో వస్తోన్న ఆహా, ప్రేక్షకులకు కచ్చితంగా వినోదాన్ని పంచుతుందని ఆశిద్దాం.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Comedy Stock Exchange తో ఓటీటీకి ఎంట్రీ ఇస్తోన్న దర్శకుడు అనిల్ రావిపూడి first appeared on 91Mobiles Telugu.

]]>
OTT లో దూసుకెళ్తోన్న విశ్వక్ సేన్ నటించిన Ori Devuda https://www.91mobiles.com/telugu/ori-devuda-getting-tremendous-response-on-ott/ Wed, 16 Nov 2022 14:43:52 +0000 https://www.91mobiles.com/telugu/?p=3487 హైలైట్స్ ఓటీటీ లో స్ట్రీమ్ అవుతోన్న ఓరి దేవుడా చిత్రానికి అద్భుతమైన స్పందన 40 గంటల్లో 100 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్న ఓరి దేవుడా చిత్రం ఆహాలో ప్రసారమవుతోన్న ఓరి దేవుడా చిత్రం, ప్రధాన పాత్రలు పోషించిన విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశా భట్ విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశా భట్ ప్రధాన పాత్రలు పోషించిన ఓరి దేవుడా చిత్రం ఇటీవలె ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో ఆడియన్స్ కి వినోదాన్ని […]

The post OTT లో దూసుకెళ్తోన్న విశ్వక్ సేన్ నటించిన Ori Devuda first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • ఓటీటీ లో స్ట్రీమ్ అవుతోన్న ఓరి దేవుడా చిత్రానికి అద్భుతమైన స్పందన
  • 40 గంటల్లో 100 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్న ఓరి దేవుడా చిత్రం
  • ఆహాలో ప్రసారమవుతోన్న ఓరి దేవుడా చిత్రం, ప్రధాన పాత్రలు పోషించిన విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశా భట్

విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశా భట్ ప్రధాన పాత్రలు పోషించిన ఓరి దేవుడా చిత్రం ఇటీవలె ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో ఆడియన్స్ కి వినోదాన్ని పంచిన ఈ చిత్రం వసూళ్ళ పరంగా పర్వాలేదనిపించింది. తమిళంలో ఘన విజయం సాధించిన ఓ మై కడవులే చిత్రానికి ఓరి దేవుడా తెలుగు రీమేక్.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా ఓరి దేవుడా సినిమా డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం ఆహా లో స్ట్రీమ్ అవుతోంది. కాగా, స్ట్రీమ్ మొదలైన 40 గంటల్లోనే ఈ చిత్రం 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను సాధించింది. ఆమేరకు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా అధికార ప్రకటన విడుదల చేసింది. దీంతో ఆహా ఓటీటీ మాంచి జోష్ మీద ఉంది. జనాలు మెచ్చే సినిమాలను ఏరికోరి తీసుకొచ్చే ఆహా చాలా తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకుల మనసులను గెలిచింది. ఇతర భాషల్లో విజయం సాధించిన, కంటెంట్ బాగున్న చిత్రాలను కూడా తెలుగులోకి అనువదించి మన ప్రేక్షకులకు అందిస్తోంది ఆహా.

ఓరి దేవుడా చిత్రం 40 గంటల్లో 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలు సాధించడం చెప్పుకోదగిన విషయం. ఇది ప్రేక్షకులు సినిమా పట్ల చూపిస్తోన్న ఆదరణకు సాక్ష్యంగా నిలుస్తోంది. విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్ ల నటన, వెంకటేశ్ ప్రత్యేక పాత్రలో అలరించడం వంటి వాటితో సినిమాకు క్రేజ్ ఏర్పడింది. అన్నింటికంటే ముఖ్యంగా కథ ఈ చిత్రానికి ప్రధాన బలం.

ఓరి దేవుడా చిత్రానికి అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించాడు. ఇతడే ఒరిజినల్ తమిళ వర్షన్ ని తెరకెక్కించాడు. లియోన్ జేమ్స్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ సంభాషణలు రాశాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తో కలిసి పీవీపీ సినిమా ఈ చిత్రాన్ని నిర్మించింది.

చిత్ర కథ

‘ఓరి దేవుడా’ చిత్ర కథ ఇద్దరు కపుల్ చుట్టూ తిరుగుతుంది. అర్జున్ పాత్రలో విశ్వక్ కనిపిస్తాడు. అర్జున్ తన చిన్ననాటి స్నేహితురాలుని వివాహం చేసుకుంటాడు. అయితే పెళ్ళి తర్వాత జీవితం పట్ల ఆసక్తిని కోల్పోతాడు. అతడికి ఆ అమ్మాయి పట్ల లవ్ ఫీలింగ్స్ కలగడపోవడమే అందుకు కారణం. దీంతో ఇద్దరు డివోర్స్ కి సిద్ధమవుతారు. మరి వారి నిర్ణయం సరైనదేనా? వారి వివాహ బంధానికి ఏమైందనేది మిగతా కథ.

సరదాగా సాగే రొమాంటిక్ కామెడీ జోనర్ లను ఇష్టపడే ప్రేక్షకులకు ఓరి దేవుడా వినోదాన్ని పంచడం ఖాయం. మిథిలా పాల్కర్, ఆశా భట్ లతో కలిసి విశ్వక్ చేసిన సందడిని చూసి ఎంజాయ్ చేయండి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post OTT లో దూసుకెళ్తోన్న విశ్వక్ సేన్ నటించిన Ori Devuda first appeared on 91Mobiles Telugu.

]]>
బాలయ్య Unstoppable-2 అప్డేట్ https://www.91mobiles.com/telugu/unstoppable-season-2-update-balakrishna-aha-ott/ Wed, 21 Sep 2022 15:51:27 +0000 https://www.91mobiles.com/telugu/?p=2494 హైలైట్స్: బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహరించిన Unstoppable చాట్ షో ఆహా ఓటీటీ లో ప్రసారమైన సీజన్-1, సీజన్-2 కోసం ప్రేక్షకుల ఎదురు చూపు ఊహించని సర్‌ప్రైజెస్ తో వస్తున్న Unstoppable సీజన్-2 Unstoppable Season-2: నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించిన సెలబ్రిటీ చాట్ షో Unstoppable సీజన్-1 భారీ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. AHA ఓటీటీ లో ఈ ప్రోగ్రామ్ ప్రసారమైంది. ఎంతోమంది సినీ దిగ్గజాలు ఈ షోకి అతిథులుగా విచ్చేశారు. బాలయ్య వ్యాఖ్యానం షో […]

The post బాలయ్య Unstoppable-2 అప్డేట్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహరించిన Unstoppable చాట్ షో
  • ఆహా ఓటీటీ లో ప్రసారమైన సీజన్-1, సీజన్-2 కోసం ప్రేక్షకుల ఎదురు చూపు
  • ఊహించని సర్‌ప్రైజెస్ తో వస్తున్న Unstoppable సీజన్-2

Unstoppable Season-2: నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించిన సెలబ్రిటీ చాట్ షో Unstoppable సీజన్-1 భారీ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. AHA ఓటీటీ లో ఈ ప్రోగ్రామ్ ప్రసారమైంది. ఎంతోమంది సినీ దిగ్గజాలు ఈ షోకి అతిథులుగా విచ్చేశారు. బాలయ్య వ్యాఖ్యానం షో కి ప్రధాన బలంగా నిలిచింది. వచ్చిన గెస్ట్ లకు తనదైన శైలిలో ప్రశ్నలను సంధించారు బాలయ్య. అలాగే అవకాశం వచ్చినప్పుడల్లా ఫన్ క్రియేట్ చేస్తూ నవ్వులు పూయించారు. దీంతో Unstoppable షో ఇటు యూత్ ని అటు ఫ్యామిలీ ఆడియన్స్ ని అమితంగా ఆకట్టుకుంది.

ఇప్పుడు అందరూ Unstoppable సీజన్-2 కోసం వేచి చూస్తున్నారు. ‘దెబ్బకు థింకింగ్ మారిపోవాలా’ అనే క్యాప్షన్ తో సీజన్-2 వస్తోంది. తాజాగా సీజన్ 2 కి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. అవేంటో తెలుసుకుందాం పదండి.

Unstoppable-2: ఊహించని సర్‌ప్రైజెస్ గ్యారంటీ

ఈసారి Unstoppable-2 లో ప్రేక్షకులను సంతోషంలో ముంచెత్తే సర్‌ప్రైజెస్ ఉంటాయని టాక్ వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి సీజన్ 2 లో గెస్ట్ గా ఎంట్రీ ఇస్తారని సమాచారం. అసలైతే, మెగాస్టార్ మొదటి సీజన్ లోనే ఈ చాట్ షోకి రావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్లన ఆయన రాలేకపోయారు. ఈసారి తప్పకుండా వస్తారని అంచనా వేస్తున్నారు. రామ్ చరణ్, చిరంజీవి కలిసి వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా గెస్ట్ గా వస్తారని చెబుతున్నారు. యంగ్ టైగర్ తో పాటు బాలయ్యని ఒకే వేదికపై చూడాలని నందమూరి అభిమానులతో పాటు, యావత్ తెలుగు ప్రేక్షకులు కోరుకుంటున్నారు. మరి ఈ సీజన్ లో ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుందని ఆశిద్దాం. నాగార్జున, వెంకటేశ్ కూడా ఈ చాట్ షో కి వస్తారని సమాచారం.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ, సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాస్ మహారాజా రవితేజ గత సీజన్ లో అన్‌స్టాపబుల్ షో కి వచ్చి సందడి చేశారు. ఈసారి కూడా బిగ్ సెలబ్రిటీలతో షో కి కళ వస్తుందని అందరు అంచనా వేస్తున్నారు.

Unstoppable-2 స్ట్రీమింగ్ తేదీ

ఈ దసరా పండుగ కానుకగా సీజన్-2 మొదటి ఎపిసోడ్ ని ప్రసారం చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. లేదంటే అక్టోబర్ మొదటి రెండు వారాల్లో ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమ్ అవుతుందని సమాచారం. త్వరలోనే Unstoppable సీజన్-2 కి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ ఆహా నుంచి వచ్చే అవకాశం ఉంది. మరోసారి బాలయ్యను హోస్ట్ అవతారంలో చూడాలి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

లేటెస్ట్ ఎంటర్టెయిన్మెంట్, స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post బాలయ్య Unstoppable-2 అప్డేట్ first appeared on 91Mobiles Telugu.

]]>
రేపటి నుంచి ప్రముఖ ఓటీటీ లో ప్రసారం కానున్న ‘డేగల బాబ్జీ’ https://www.91mobiles.com/telugu/bandla-ganesh-degala-babji-ott-release-on-aha-ott-pawan-kalyan-birthday/ Thu, 01 Sep 2022 15:06:57 +0000 https://www.91mobiles.com/telugu/?p=2054 హైలైట్స్: బండ్ల గణేశ్ ప్రధాన పాత్రలో రూపొందిన డేగల బాబ్జీ చిత్రం అవార్డ్ గెలుచుకున్న ఒత్త సెరుప్పు సైజ్ 7 అనే తమిళ చిత్రానికి తెలుగు రీమేక్ ఈ ‘డేగల బాబ్జీ’ రేపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ఆహా ఓటీటీ లో ప్రసారం కానున్న చిత్రం నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం డేగల బాబ్జీ. ఒత్త సెరుప్పు సైజ్ 7 అనే తమిళ చిత్రానికి డేగల బాబ్జీ […]

The post రేపటి నుంచి ప్రముఖ ఓటీటీ లో ప్రసారం కానున్న ‘డేగల బాబ్జీ’ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • బండ్ల గణేశ్ ప్రధాన పాత్రలో రూపొందిన డేగల బాబ్జీ చిత్రం
  • అవార్డ్ గెలుచుకున్న ఒత్త సెరుప్పు సైజ్ 7 అనే తమిళ చిత్రానికి తెలుగు రీమేక్ ఈ ‘డేగల బాబ్జీ’
  • రేపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ఆహా ఓటీటీ లో ప్రసారం కానున్న చిత్రం

నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం డేగల బాబ్జీ. ఒత్త సెరుప్పు సైజ్ 7 అనే తమిళ చిత్రానికి డేగల బాబ్జీ తెలుగు రీమేక్. ఇక ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనుకున్న ఫలితం రాబట్టలేదు. ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2 న ఈ చిత్రం ఓటీటీ ప్రసారానికి వస్తోంది. బండ్ల గణేశ్ కి పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో, మరెంత అభిమానమో మన అందరికీ తెలిసిందే. ఆ విషయాన్ని ఎన్నో సినిమా వేడుకల్లో బండ్ల గణేశ్ తన ప్రసంగాలతో నిరూపించుకున్నారు. పవన్ గురించి బండ్ల గణేశ్ ఇచ్చే స్పీచ్ లకు అభిమానుల్లో ఎనలేని క్రేజ్ ఉంది. యూట్యూబ్ లో బండ్ల స్పీచ్ లకు లక్షల్లో వ్యూస్ ఉండటమే అందుకు నిదర్శనం.

AHA ఓటీటీ లో రేపటి నుంచి స్ట్రీమ్ కానున్న డేగల బాబ్జీ

పురస్కారం గెలిచిన తమిళ చిత్రం ఒత్త సెరుప్పు సైజ్ 7 చిత్రానికి తెలుగు రీమేక్ గా వస్తోన్న డేగల బాబ్జీ చిత్రం రేపు ఆహా ఓటీటీ లో ప్రపంచ వ్యాప్తంగా ప్రీమియర్ అవ్వనుంది. ఒత్త సెరుప్పు లాగానే, డేగల బాబ్జీ లో కూడా ఒకే నటుడు ఉంటాడు. సినిమాలో బండ్ల గణేశ్ తన నట విశ్వరూపం చూపించారు. ఆ విషయం డేగల బాబ్జీ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. చిత్ర కథ: వరుస నేరాలకు పాల్పడిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. విచారణలో భాగంగా నేరస్తుడిని ప్రశ్నస్తారు. అప్పుడు అతడు ఇచ్చిన సమాధానాలతో పచ్చి నిజాలు బయట పడతాయి.

ఒత్త సెరుప్పు సైజ్ 7 చిత్రానికి కథను సమకూర్చిన నటుడు ఆర్ పార్థీబన్, తానే స్వయంగా నటించి, దర్శకత్వం వహించారు. ఒత్త సెరుప్పు చిత్రానికి జాతీయ పురస్కారం దక్కడంతో పాటు, ఆర్ పార్థీబన్ కు సర్వత్రా ప్రశంసలు దక్కాయి. తెలుగులో ఇటువంటి చిత్రాలు చాలా అరుదు. అయితే బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన ఈ చిత్రం ఓటీటీ లో సక్సెస్ కొడుతుందో లేదో చూడాలి.

సినిమాలో బండ్ల గణేశ్ ఒక్కడే నటుడు కాగా, ఇతర వాయిసెస్ కూడా వినిపిస్తుంటాయి. వెంకట్ చంద్ర ‘డేగల బాబ్జీ’ చిత్రానికి దర్శకత్వం వహించారు. స్వాతి ఎస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. లైనస్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు ఓటీటీ ప్రేక్షకులను పలకరించబోతున్న ఈ చిత్రం ఎటువంటి స్పందనను రాబడుతుందో చూడాలి.

లేటెస్ట్ ఎంటర్టెయిన్మెంట్, స్మార్ట్ ఫోన్, టెలీకామ్, ఆటోమొబైల్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post రేపటి నుంచి ప్రముఖ ఓటీటీ లో ప్రసారం కానున్న ‘డేగల బాబ్జీ’ first appeared on 91Mobiles Telugu.

]]>