#Airtel - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 18 Nov 2022 13:00:07 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Jio రూ.199 vs Airtel రూ.199: రెండింట్లో ఏ ప్రీపెయిడ్ ప్లాన్ బెస్ట్? https://www.91mobiles.com/telugu/airtel-jio-rs-199-prepaid-plan-comparison/ Fri, 18 Nov 2022 13:00:07 +0000 https://www.91mobiles.com/telugu/?p=3532 హైలైట్స్ పోటాపోటీగా రీచార్జ్ ప్లాన్స్ ని లాంచ్ చేస్తోన్న జియో, ఎయిర్టెల్ రెండు నెట్వర్క్స్ లోనూ అందుబాటులో ఉన్న రూ.199 ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్ బెనిఫిట్స్ జియో రూ.199 ప్లాన్ తో 23 రోజుల వ్యాలిడిటీ, ఎయిర్టెల్ రూ.199 ప్లాన్ తో 30 రోజుల వ్యాలిడిటీ భారతదేశంలో ఉన్న ప్రధాన టెలీకామ్ సంస్థల్లో తరచూ ఎయిర్టెల్ మరియు జియోల మధ్య పోటీ ఉంటుంది. ఇది సహజమే. ప్రస్తుతం యూజర్ల పరంగా జియో నెం.1 స్థానంలో ఉండగా, ఎయిర్టెల్ […]

The post Jio రూ.199 vs Airtel రూ.199: రెండింట్లో ఏ ప్రీపెయిడ్ ప్లాన్ బెస్ట్? first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • పోటాపోటీగా రీచార్జ్ ప్లాన్స్ ని లాంచ్ చేస్తోన్న జియో, ఎయిర్టెల్
  • రెండు నెట్వర్క్స్ లోనూ అందుబాటులో ఉన్న రూ.199 ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్ బెనిఫిట్స్
  • జియో రూ.199 ప్లాన్ తో 23 రోజుల వ్యాలిడిటీ, ఎయిర్టెల్ రూ.199 ప్లాన్ తో 30 రోజుల వ్యాలిడిటీ

భారతదేశంలో ఉన్న ప్రధాన టెలీకామ్ సంస్థల్లో తరచూ ఎయిర్టెల్ మరియు జియోల మధ్య పోటీ ఉంటుంది. ఇది సహజమే. ప్రస్తుతం యూజర్ల పరంగా జియో నెం.1 స్థానంలో ఉండగా, ఎయిర్టెల్ రెండో స్థానంలో కొనసాగుతోంది. రీసెంట్ గా ఎయిర్టెల్ రూ.199 ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. ఇదివరకు కూడా ఇదే ధరలో ప్లాన్ ఉండేది. కానీ, ఈసారి తెచ్చిన ప్లాన్ విభిన్నమైనది. ఈ ప్లాన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇది 24 లేదా 28 రోజుల వ్యాలిడిటీతో రాలేదు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు. దీంతో ఈ ప్లాన్ పై అందరి దృష్టి పడింది.

ఇక్కడ విషయమేంటంటే, రూ.199 ధరలో జియో లో కూడా ఓ ప్లాన్ ఉంది. అయితే దీని వ్యాలిడిటీ కేవలం 24 రోజులు మాత్రమే. అయితే బెనిఫిట్స్ కూడా తెలియాలి కదా. ఇప్పుడు మనం ఎయిర్టెల్ రూ.199 మరియు జియో రూ.199 ప్లాన్స్ మధ్య ఏది ఉత్తమమైనదో తేల్చేద్దాం. పదండి మరి.

Airtel రూ.199 ప్లాన్ ప్రయోజనాలు

డేటా: Airtel యొక్క కొత్త రూ. 199 ప్లాన్ గురించి మాట్లాడితే, ఇది ఇంటర్నెట్ వినియోగం కోసం మీకు మొత్తం 3GB డేటాను అందజేస్తుంది. అలాగే, డేటా పరిమితి ముగిసిన తర్వాత మీరు 1MB డేటా కోసం 50 పైసలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే గుర్తుపెట్టుకోదగిన విషయమేంటంటే, ఇది రోజువారీ డేటా ప్లాన్ కాదు.

వ్యాలిడిటీ మరియు ఎస్ఎంఎస్ లు: వినియోగదారులు ఈ రీఛార్జ్ ప్లాన్‌ ద్వారా మొత్తం 30 రోజుల వ్యాలిడిటీ పొందుతారు, ఇది ఈ ప్లాన్ యొక్క హైలైట్ అని చెప్పవచ్చు. అలాగే ప్లాన్‌లో మీరు మొత్తం 300 ఉచిత SMSలను పొందుతారు.

ఉచిత కాలింగ్: అంతే కాదండోయ్.. ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్‌తో మీరు అపరిమిత కాలింగ్ ప్రయోజనం కూడా పొందుతారు. ఇక అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే, ఈ ప్లాన్ ద్వారా ఉచిత హలో ట్యూన్స్ మరియు ఉచితంగా వింక్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తాయి.

Jio రూ.199 ప్లాన్ ప్రయోజనాలు

డేటా: Jio రూ. 199 ప్లాన్‌ ద్వారా కంపెనీ ప్రతిరోజూ 1.5 GB డేటాను అందిస్తోంది. అంటే కాలపరిమితి పూర్తయ్యే నాటికి మీరు ఈ ప్లాన్ ద్వారా మొత్తం 34.5 GB 4G డేటాను పొందుతారు.

వ్యాలిడిటీ మరియు SMS: ఈ ప్లాన్ ద్వారా 23 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అలాగే, కంపెనీ మీకు రోజుకు 100 SMSలను కూడా ఇస్తుంది.

ఉచిత కాలింగ్: ఈ రీఛార్జ్ ప్లాన్‌ ద్వారా కస్టమర్‌లు అన్ని నెట్‌వర్క్‌ లకు అపరిమిత ఉచిత కాల్స్ చేసుకోవచ్చు. అంతేకాదు, ఈ ప్లాన్ ద్వారా జియో యాప్‌లకు ఉచిత సభ్యత్వం కూడా లభిస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Jio రూ.199 vs Airtel రూ.199: రెండింట్లో ఏ ప్రీపెయిడ్ ప్లాన్ బెస్ట్? first appeared on 91Mobiles Telugu.

]]>
30 రోజుల వ్యాలిడిటీతో కొత్త రూ.199 ప్లాన్ ని తీసుకొచ్చిన Airtel https://www.91mobiles.com/telugu/airtel-launches-rs-199-plan-with-30-days-validity/ Thu, 10 Nov 2022 09:14:58 +0000 https://www.91mobiles.com/telugu/?p=3363 హైలైట్స్ కొత్త ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్ ని లాంచ్ చేసిన Airtel గతంలో కూడా రూ.199 ధరతో ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకొచ్చిన ఎయిర్టెల్ తాజాగా 30 రోజుల వ్యాలిడిటీతో రూ.199 ప్లాన్ ని పరిచయం చేస్తోన్న దిగ్గజ టెలీకామ్ కంపెనీ భారత దేశంలో దిగ్గజ టెలీకామ్ కంపెనీ అయిన Airtel తాజాగా రూ.199 విలువజేసే ప్రీపెయిడ్ ప్లాన్ ని 30 రోజుల వ్యాలిడిటీతో లాంచ్ చేసింది. ఎటువంటి హడావుడి లేకుండా మెల్లగా ఈ ప్లాన్ ని ప్రవేశపెట్టింది […]

The post 30 రోజుల వ్యాలిడిటీతో కొత్త రూ.199 ప్లాన్ ని తీసుకొచ్చిన Airtel first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • కొత్త ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్ ని లాంచ్ చేసిన Airtel
  • గతంలో కూడా రూ.199 ధరతో ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకొచ్చిన ఎయిర్టెల్
  • తాజాగా 30 రోజుల వ్యాలిడిటీతో రూ.199 ప్లాన్ ని పరిచయం చేస్తోన్న దిగ్గజ టెలీకామ్ కంపెనీ

భారత దేశంలో దిగ్గజ టెలీకామ్ కంపెనీ అయిన Airtel తాజాగా రూ.199 విలువజేసే ప్రీపెయిడ్ ప్లాన్ ని 30 రోజుల వ్యాలిడిటీతో లాంచ్ చేసింది. ఎటువంటి హడావుడి లేకుండా మెల్లగా ఈ ప్లాన్ ని ప్రవేశపెట్టింది ఎయిర్టెల్. 2021 లో టారిఫ్ పెరగక ముందు ఎయిర్టెల్ రూ.199 ప్లాన్ పై 24 రోజుల వ్యాలిడిటీ మరియు 1జిబి డెయిలీ డేటాను అందించింది. తర్వాత జియో 1.5జిబి ఆఫర్ చేస్తుండటంతో, ఎయిర్టెల్ కూడా 1.5జిబి డెయిలీ డేటా ఇవ్వడం మొదలుపెట్టింది. అయితే ఇప్పుడు ఈ ప్లాన్ కి మార్పులు చేసింది. రూ.199 ప్లాన్ ని 30 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చింది.

Airtel రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు

వెబ్‌సైట్ మరియు మొబైల్ యాప్ ద్వారా Airtel రూ.199 ప్లాన్ ని వినియోగదారులకు ఆఫర్ చేస్తోంది. ప్రస్తుతం ఈ రీచార్జ్ ప్లాన్ అందుబాటులో ఉంది. యూజర్లు రీచార్జ్ చేసుకోవచ్చు. ఈ రీచార్జ్ ప్లాన్ ద్వారా 30 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇక డేటా విషయానికి వస్తే, ఏకమొత్తంగా 3జిబి డేటా లభిస్తుంది. ఇంకా అపరిమిత కాలింగ్ సౌకర్యం ఈ ప్లాన్ ద్వారా లభించనుంది. అంతేకాదండోయ్ ఈ ప్లాన్ తో 300 ఎస్ఎంఎస్ లు కూడా లభిస్తాయి. ఇంకా ఎయిర్టెల్ థాంక్స్, ఫ్రీ హలో ట్యూన్స్, వింక్ మ్యూజిక్ వంటి అదనపు ప్రయోజనాలు యూజర్లు పొందవచ్చు.

ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ ఉపయోగించుకున్న తర్వాత ఒక లోకల్ ఎస్ఎంఎస్ కి రూ.1, ఒక ఎస్టీడీ ఎస్ఎంఎస్ కి రూ.1.50 ఖర్చవుతుంది. ఇక డేటా విషయానికి వస్తే, 1 ఎంబి కి 50 పైసలు ఖర్చవుతుంది. వాడుకోని డేటా, ఎస్ఎంఎస్ లు ప్లాన్ ముగియు రోజున ఎక్స్‌పైర్ అవుతాయి. అదే ప్లాన్ ని మళ్ళీ రీచార్జ్ చేసినప్పటికీ వాడబడని డేటా, ఎస్ఎంఎస్ లు క్యారీ ఫార్వార్డ్ చేయబడవు. కాబట్టి ప్లాన్ ని రీచార్జ్ చేసుకునే ముందు అన్ని విషయాలు తెలుసుకోవడం మంచిది.

ఇటీవలి కాలంలో Airtel నుంచి కొత్త ప్లాన్స్ ఏమీ రాలేదు. తాజాగా వచ్చిన రూ.199 ప్లాన్ ఓ వర్గం యూజర్లకు ఎంతో ఉపయుక్తంగా ఉండనుంది. మరీ ముఖ్యంగా ఈ రీచార్జ్ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీని ఆఫర్ చేస్తుండటం విశేషం. వ్యాలిడిటీతో పాటు నామమాత్రపు డేటా, ఎస్ఎంఎస్ లు కావాలని కోరుకునే వారికి ఈ ఆఫర్ సరైందని చెప్పవచ్చు. మీరు గనుక రూ.200 లోపు ఒక చక్కటి రీచార్జ్ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్ ని ప్రయత్నించండి.

Airtel రూ.199 ప్లాన్ బెనిఫిట్స్

  • 30 రోజుల వ్యాలిడిటీ
  • 3జిబి ఏకమొత్తం డేటా
  • 300 ఏకమొత్తం ఎస్ఎంఎస్
  • అపరిమిత కాలింగ్
  • థాంక్స్ యాప్, వింక్ మ్యూజిక్, ఉచిత హలో ట్యూన్స్ ప్రయోజనాలు

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 30 రోజుల వ్యాలిడిటీతో కొత్త రూ.199 ప్లాన్ ని తీసుకొచ్చిన Airtel first appeared on 91Mobiles Telugu.

]]>
Airtel, Jio, Vi లతో చేతులు కలిపిన Realme https://www.91mobiles.com/telugu/realme-partners-with-jio-airtel-vi-qualcomm-mediatek-5g-india/ Mon, 03 Oct 2022 08:31:26 +0000 https://www.91mobiles.com/telugu/?p=2704 హైలైట్స్: భారతీయ టెలీకామ్ కంపెనీలు ఎయిర్టెల్, జియో, వీఐ లతో చేతులు కలిపిన Realme కస్టమర్ల కోసం వివిధ రకాల బండిల్ ఆఫర్లు తెస్తున్నట్లు తెలిపిన రియల్మీ సీఈవో 2020 లో తొలి 5జీ ఫోన్ ని లాంచ్ చేసిన రియల్మీ, అప్పటి నుంచి మొత్తం 23 5జీ ఫోన్లను లాంచ్ చేసిన రియల్మీ అక్టోబర్ 1 న జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ సదస్సులో 5జీ సేవలను పీఎం నరేంద్ర మోదీ లాంచ్ చేశారు. ఇప్పటికే […]

The post Airtel, Jio, Vi లతో చేతులు కలిపిన Realme first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • భారతీయ టెలీకామ్ కంపెనీలు ఎయిర్టెల్, జియో, వీఐ లతో చేతులు కలిపిన Realme
  • కస్టమర్ల కోసం వివిధ రకాల బండిల్ ఆఫర్లు తెస్తున్నట్లు తెలిపిన రియల్మీ సీఈవో
  • 2020 లో తొలి 5జీ ఫోన్ ని లాంచ్ చేసిన రియల్మీ, అప్పటి నుంచి మొత్తం 23 5జీ ఫోన్లను లాంచ్ చేసిన రియల్మీ

అక్టోబర్ 1 న జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ సదస్సులో 5జీ సేవలను పీఎం నరేంద్ర మోదీ లాంచ్ చేశారు. ఇప్పటికే ఎయిర్టెల్, జియో సంస్థలు తమ రోలౌట్ ప్లాన్స్ ని రివీల్ చేశాయి. లాంచ్ సమయంలో రియల్మీ సంస్థ తాను ఎయిర్టెల్, జియో, వీఐ లతో పాటు మీడియాటెక్, క్వాల్కమ్ సంస్థలతో చేతులు కలిపి 5జీ ప్లాన్స్ ని భారత్ లో అందిస్తామని తెలిపింది. 5జీ ఫోన్ల డిమాండ్ రోజురోజుకీ పెరిగిపోతోంది. గత 5 రోజుల్లో రియల్మీ కంపెనీ పది లక్షలకు పైగా 5జీ ఫోన్లను అమ్మినట్లు సమాచారం. రియల్మీ 5జీ ఫోన్ల అమ్మకాలు 45 శాతం గా నమోదైనట్లు సదరు కంపెనీ తెలిపింది.

2020 లో Realme కంపెనీ భారత్ లో తొలి 5జీ ఫోన్ ని లాంచ్ చేసింది. ఇప్పటి వరకు 23 5జీ ఫోన్లను రియల్మీ లాంచ్ చేసింది. దేశ వ్యాప్తంగా 5 మిలియన్ల 5జీ యూజర్లు తమకు ఉన్నారని రియల్మీ తెలిపింది. రియల్మీ ప్యాడ్ ఎక్స్ వంటి డివైజెస్ కి కూడా రియల్మీ తన 5జీ టెక్నాలజీని విస్తరించింది.

భారతీయ టెలీకామ్ సంస్థలతో జట్టుకట్టిన Realme

భారత్ లో 5జీ సేవలు లాంచ్ అవ్వడంతో, రియల్మీ కంపెనీ ఎయిర్టెల్, జియో, వీఐ కంపెనీలతో పాటు, మీడియాటెక్, క్వాల్కమ్ సంస్థలతో కలిసి దేశంలో 5జీ సేవలను విస్తరించేందుకు జట్టు కట్టింది. కస్టమర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన బండిల్ ఆఫర్లు ఉన్నాయని రియల్మీ కంపెనీ సీఈవో మాధవ్ సేత్ అన్నారు. 85 శాతం రియల్మీ ఫోన్లు స్టాండలోన్ (SA) 5జీ కి సపోర్ట్ చేస్తాయని ఆయన అన్నారు. జియో రోలౌట్ చేసే 5జీ సేవలు స్టాండలోన్ ఆధారితంగానే రూపొందినవి. ఈ నెల నుంచి తమ డివైజెస్ 100 శాతం సపోర్ట్ ని పొందబోతున్నాయని మాధవ్ చెప్పారు.

తమ యూజర్లు 5జీ సేవలు వినియోగించుకునే విధంగా డివైజెస్ కు ఓటీఏ అప్డేట్ ని పంపిస్తున్నామని మాధవ్ సేత్ వెల్లడించారు. 2024 కల్లా 100 మిలియన్ 5జీ యూజర్ల మార్కుని చేరుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు మాధవ్ తెలిపారు. ఇకపోతే 2023 లో రియల్మీ సంస్థ 100 శాతం 5జీ ఫోన్లను లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం.

జరుగుతోన్న పరిణామాలను చూస్తుంటే, రియల్మీ కంపెనీ భారత్ లో మరింతగా పాతుకుపోయేందుకు భారీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని తెలుస్తోంది. దేశంలోని ప్రధాన టెలీకామ్ సంస్థలైన జియో, ఎయిర్టెల్, వీఐ లతో జట్టు కట్టడం, చిప్సెట్ తయారీ సంస్థలు మీడియాటెక్, క్వాల్కమ్ లతో చేతులు కలపడం వంటివి రియల్మీ సంస్థకు మంచి ఫలితాలను తీసుకొచ్చే అవకాశాలను అమాంతం పెంచనున్నాయి. జనాల్లో రియల్మీ ఫోన్లకు మాంచి గిరాకీ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు 5జీ బండిల్ ఆఫర్లతో ఆ సేల్స్ మరింత పెరగనున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post Airtel, Jio, Vi లతో చేతులు కలిపిన Realme first appeared on 91Mobiles Telugu.

]]>
రెండు కొత్త రీచార్జ్ ప్లాన్లను ప్రకటించిన Airtel https://www.91mobiles.com/telugu/airtel-launched-two-new-prepaid-plans-price-benefits/ Wed, 17 Aug 2022 07:07:17 +0000 https://www.91mobiles.com/telugu/?p=1722 హైలైట్స్: రూ.519, రూ.799 విలువ గల రెండు కొత్త 4జీ డేటా ప్లాన్లను ప్రకటించిన ఎయిర్టెల్ 60 రోజుల వ్యాలిడిటీ, 90జిబి డేటా ప్రయోజనాల్ని అందించనున్న రూ.519 ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీ, 135జిబి డేటా ప్రయోజనాల్ని అందించనున్న రూ.799 ప్లాన్ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని, దేశంలోని అన్ని టెలీకామ్ కంపెనీలు ప్రత్యేక రీచార్జ్ ప్లాన్లను విడుదల చేస్తున్నాయి. జియోో తర్వాత తాజాగా ఎయిర్టెల్ రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను తన కస్టమర్ల కోసం తీసుకొచ్చింది. రూ.519, […]

The post రెండు కొత్త రీచార్జ్ ప్లాన్లను ప్రకటించిన Airtel first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • రూ.519, రూ.799 విలువ గల రెండు కొత్త 4జీ డేటా ప్లాన్లను ప్రకటించిన ఎయిర్టెల్
  • 60 రోజుల వ్యాలిడిటీ, 90జిబి డేటా ప్రయోజనాల్ని అందించనున్న రూ.519 ప్లాన్
  • 90 రోజుల వ్యాలిడిటీ, 135జిబి డేటా ప్రయోజనాల్ని అందించనున్న రూ.799 ప్లాన్

స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని, దేశంలోని అన్ని టెలీకామ్ కంపెనీలు ప్రత్యేక రీచార్జ్ ప్లాన్లను విడుదల చేస్తున్నాయి. జియోో తర్వాత తాజాగా ఎయిర్టెల్ రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను తన కస్టమర్ల కోసం తీసుకొచ్చింది. రూ.519, రూ.779 విలువ గల ఈ ప్లాన్స్ ప్రస్తుతం భారతీయ యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు ప్లాన్స్ కూడా ప్రతిరోజు 1.5జిబి డేటా, 100 ఫ్రీ ఎస్ఎంఎస్ లు, తదితర ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. ఎయిర్టెల్ వెబ్ సైట్ లేదా ఎయిర్టెల్ థాంక్స్ యాప్ ద్వారా వినియోగదారులు ఈ రెండు ప్లాన్స్ లో తమకు నచ్చిన ప్లాన్ ని ఎంచుకుని, రీచార్జ్ చేసుకోవచ్చు.

Airtel రూ.519 ప్రీపెయిడ్ ప్లాన్

ఇటీవలె ప్రముఖ టెలీకామ్ సంస్థ ఎయిర్టెల్ రూ.519 ప్లాన్ ప్రీపెయిడ్ ప్లాన్ ని విడుదల చేసింది. ఈ ప్లాన్ ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 60 రోజుల వ్యాలిడిటీ, ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్ లు, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకి 1.5జిబి డేటా వంటి ప్రయోజనాలు ఈ ప్లాన్ తో లభిస్తాయి. మొత్తంగా ఈ ప్లాన్ ద్వారా 90జిబి డేటా లభిస్తుంది. కాగా, ఇంటర్నెట్ స్పీడ్ డెయిలీ డెటా లిమిట్ తర్వాత 64కేబీపీఎస్ కి పడిపోతుంది. ఇక ఇతర బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ఎయిర్టెల్ థాంక్స్ యాప్ ద్వారా వింక్ మ్యూజిక్, హలో ట్యూన్స్, అపోలో 24/7 సర్కిల్, ఫాస్టాగ్ పై రూ.100 క్యాష్ బ్యాక్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.

Airtel రూ.799 ప్రీపెయిడ్ ప్లాన్

ఎయిర్టెల్ నుంచి వచ్చిన మరొక ప్లాన్ రూ.799 రీచార్జ్ ప్లాన్. ఇది మొత్తంగా 135జిబి డేటాను అందిస్తుంది. అలాగే అపరిమిత కాలింగ్, ప్రతిరోజు 100ఎస్ఎంఎస్ లు మరియు 1.5జిబి హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంది. ఇక అదనపు ప్రయోజనాలను గురించి తెలుసుకుందాం. ఇక ఇతర బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ఎయిర్టెల్ థాంక్స్ యాప్ ద్వారా వింక్ మ్యూజిక్, హలో ట్యూన్స్, అపోలో 24/7 సర్కిల్, ఫాస్టాగ్ పై రూ.100 క్యాష్ బ్యాక్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.

5జీ స్పెక్ట్రమ్ వేలం సందర్భంగా టెలీకామ్ సంస్థలపై తీవ్రమైన ఒత్తిడి పడటంతో, 4జీ డేటా ప్లాన్స్ ధరలు పెరుగుతున్నాయన్న చర్చల నేపథ్యంలో తాజాగా ఈ ప్లాన్స్ మార్కెట్ లోకి వచ్చాయి. భారతదేశ వ్యాప్తంగా 5,000 పట్టణాలకు 5జీ సేవలను అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు ఎయిర్టెల్ తెలిపింది. 2024 మార్చి కల్లా ఈ లక్ష్యాన్ని చేరుకుంటామని సదరు సంస్థ వెల్లడించింది. ఇక ఈ ఏడాది కొన్ని ఎంపిక చేయబడ్డ పట్టణాల్లో ఎయిర్టెల్ 5జీ సేవలు మొదలు కానున్నాయి.

ఇక 4జీ ప్లాన్స్ తో పోలిస్తే, 5జీ ప్లాన్ ధరలు ఎక్కువుంటాయని టెలీకామ్ సంస్థలు చెబుతూ వస్తున్నాయి. 4జీ కంటే 30 శాతం మేర ఎక్కువగా 5జీ ప్లాన్ ధరలు ఉంటాయని సమాచారం.

The post రెండు కొత్త రీచార్జ్ ప్లాన్లను ప్రకటించిన Airtel first appeared on 91Mobiles Telugu.

]]>
స్మార్ట్ రీఛార్జ్, రేట్ కట్టర్ ప్లాన్స్ ని లాంచ్ చేసిన ఎయిర్టెల్ https://www.91mobiles.com/telugu/%e0%b0%b8%e0%b1%8d%e0%b0%ae%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d-%e0%b0%b0%e0%b1%80%e0%b0%9b%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9c%e0%b1%8d-%e0%b0%b0%e0%b1%87%e0%b0%9f%e0%b1%8d-%e0%b0%95/ Tue, 05 Jul 2022 15:11:07 +0000 https://www.91mobiles.com/telugu/?p=796 హైలైట్స్: * రెండు రేట్ కట్టింగ్ ప్లాన్స్ తో పాటు రెండు స్మార్ట్ రీఛార్జ్ లను లాంచ్ చేసిన ఎయిర్టెల్ * అత్యంత చౌకైన ప్లాన్ రూ.109 వద్ద, ఖరీదైన ప్లాన్ రూ.131 వద్ద లభిస్తోంది * రూ.109, రూ.128 ప్లాన్స్ 30 రోజుల వ్యాలిడిటీని అందిస్తున్నాయి. రూ.111, రూ.131 ప్లాన్స్ ఒక నెల వ్యాలిడిటీని అందిస్తున్నాయి. తాజాగా ఎయిర్టెల్ నాలుగు కొత్త ప్లాన్స్ ని లాంచ్ చేసింది. వీటిలో రెండు రేట్ కట్టర్ ప్లాన్స్, మరో […]

The post స్మార్ట్ రీఛార్జ్, రేట్ కట్టర్ ప్లాన్స్ ని లాంచ్ చేసిన ఎయిర్టెల్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

* రెండు రేట్ కట్టింగ్ ప్లాన్స్ తో పాటు రెండు స్మార్ట్ రీఛార్జ్ లను లాంచ్ చేసిన ఎయిర్టెల్
* అత్యంత చౌకైన ప్లాన్ రూ.109 వద్ద, ఖరీదైన ప్లాన్ రూ.131 వద్ద లభిస్తోంది
* రూ.109, రూ.128 ప్లాన్స్ 30 రోజుల వ్యాలిడిటీని అందిస్తున్నాయి. రూ.111, రూ.131 ప్లాన్స్ ఒక నెల వ్యాలిడిటీని అందిస్తున్నాయి.

తాజాగా ఎయిర్టెల్ నాలుగు కొత్త ప్లాన్స్ ని లాంచ్ చేసింది. వీటిలో రెండు రేట్ కట్టర్ ప్లాన్స్, మరో రెండు స్మార్ట్ రీఛార్జ్ ఉన్నాయి. వీటి వ్యాలిడిటీ 28 రోజులు, 30 రోజులుగా ఉన్నాయి. అన్ని ప్యాక్స్ కూడా రూ.140 లోపే ధరను కలిగి ఉన్నాయి. అత్యల్పంగా రూ.109 రీఛార్జ్ ఉంది. రూ.131 ఖరీదైన రీఛార్జ్. తమ మొబైల్ నంబర్ ను యాక్టివ్ ఉంచుకోవడానికి ఈ నాలుగు ప్లాన్స్ బాగా ఉపయోగపడనున్నాయి. ప్రస్తుతమున్న రూ.99 ప్లాన్ తో పోల్చితే, రూ.109 మరియు రూ.111 ప్లాన్స్ మరింత ఎక్కువ వ్యాలిడిటీ, మొబైల్ డేటాను అందిస్తున్నాయి. మరి ఎయిర్టెల్ నుంచి వచ్చిన ఈ నాలుగు ప్యాక్స్ యొక్క ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఎయిర్టెల్ రేట్ కట్టర్ ప్లాన్స్

రూ.109 ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్టెల్ రూ.109 రేట్ కట్టర్ ప్లాన్ తో 30 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అలాగే 200ఎంబి మొబైల్ డేటా, రూ.99 టాక్ టైమ్ వస్తుంది. లోకల్, ఎస్టీడీ, ల్యాండ్ లైన్ వాయిస్ కాల్స్ సెకనుకు రూ.2.5 పైసలు ఖర్చవుతుంది. ఎస్ఎంఎస్ లకు లోకల్ అయితే రూ.1, ఎస్టీడీ అయితే రూ.1.44 ఖర్చవుతుంది.

రూ.111 ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్టెల్ రూ.111 స్మార్ట్ రీఛార్జ్ తో రూ.99 టాక్ టైమ్, 200ఎంబి మొబైల్ డేటా లభిస్తుంది. ఈ రీఛార్జ్ తో ఒక నెల వ్యాలిడిటీ లభిస్తుంది. లోకల్, ఎస్టీడీ, ల్యాండ్ లైన్ కాల్స్ సెకనుకి రూ.2.5 ఖర్చవుతుంది. లోకల్ ఎస్ఎంఎస్ కి రూ.1, ఎస్టీడీ ఎస్ఎంఎస్ కి రూ.1.5 ఖర్చవుతుంది.

రూ.128 ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్టెల్ రూ.128 ప్లాన్ తో 30 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. లోకల్, ఎస్టీడి కాల్స్ సెకనుకి రూ.2.5 ఖర్చవుతుంది. నేషనల్ వీడియో కాల్స్ సెకనుకి రూ.5 ఖర్చవుతుంది. మొబైల్ డేటా ఒక ఎంబీకి 50 పైసలు ఖర్చవుతుంది.

రూ.131 ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్టెల్ రూ.131 ప్లాన్ తో ఒక నెల వ్యాలిడిటీ లభిస్తుంది. లోకల్, ఎస్టీడీ కాల్స్ కి సెకనుకి రూ.2.5 ఖర్చవుతుంది. నేషనల్ వీడియో కాల్స్ కి సెకనుకి రూ.5 ఖర్చవుతుంది. లోకల్ ఎస్ఎంఎస్ కి రూ.1, ఎస్టీడీ ఎస్ఎంఎస్ కి రూ.1.5 ఖర్చవుతుంది. ఇక ఒక ఎంబీ డేటాకి 50 పైసలు ఖర్చవుతుంది.

The post స్మార్ట్ రీఛార్జ్, రేట్ కట్టర్ ప్లాన్స్ ని లాంచ్ చేసిన ఎయిర్టెల్ first appeared on 91Mobiles Telugu.

]]>