స్మార్ట్ రీఛార్జ్, రేట్ కట్టర్ ప్లాన్స్ ని లాంచ్ చేసిన ఎయిర్టెల్

హైలైట్స్:

* రెండు రేట్ కట్టింగ్ ప్లాన్స్ తో పాటు రెండు స్మార్ట్ రీఛార్జ్ లను లాంచ్ చేసిన ఎయిర్టెల్
* అత్యంత చౌకైన ప్లాన్ రూ.109 వద్ద, ఖరీదైన ప్లాన్ రూ.131 వద్ద లభిస్తోంది
* రూ.109, రూ.128 ప్లాన్స్ 30 రోజుల వ్యాలిడిటీని అందిస్తున్నాయి. రూ.111, రూ.131 ప్లాన్స్ ఒక నెల వ్యాలిడిటీని అందిస్తున్నాయి.

తాజాగా ఎయిర్టెల్ నాలుగు కొత్త ప్లాన్స్ ని లాంచ్ చేసింది. వీటిలో రెండు రేట్ కట్టర్ ప్లాన్స్, మరో రెండు స్మార్ట్ రీఛార్జ్ ఉన్నాయి. వీటి వ్యాలిడిటీ 28 రోజులు, 30 రోజులుగా ఉన్నాయి. అన్ని ప్యాక్స్ కూడా రూ.140 లోపే ధరను కలిగి ఉన్నాయి. అత్యల్పంగా రూ.109 రీఛార్జ్ ఉంది. రూ.131 ఖరీదైన రీఛార్జ్. తమ మొబైల్ నంబర్ ను యాక్టివ్ ఉంచుకోవడానికి ఈ నాలుగు ప్లాన్స్ బాగా ఉపయోగపడనున్నాయి. ప్రస్తుతమున్న రూ.99 ప్లాన్ తో పోల్చితే, రూ.109 మరియు రూ.111 ప్లాన్స్ మరింత ఎక్కువ వ్యాలిడిటీ, మొబైల్ డేటాను అందిస్తున్నాయి. మరి ఎయిర్టెల్ నుంచి వచ్చిన ఈ నాలుగు ప్యాక్స్ యొక్క ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఎయిర్టెల్ రేట్ కట్టర్ ప్లాన్స్

రూ.109 ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్టెల్ రూ.109 రేట్ కట్టర్ ప్లాన్ తో 30 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అలాగే 200ఎంబి మొబైల్ డేటా, రూ.99 టాక్ టైమ్ వస్తుంది. లోకల్, ఎస్టీడీ, ల్యాండ్ లైన్ వాయిస్ కాల్స్ సెకనుకు రూ.2.5 పైసలు ఖర్చవుతుంది. ఎస్ఎంఎస్ లకు లోకల్ అయితే రూ.1, ఎస్టీడీ అయితే రూ.1.44 ఖర్చవుతుంది.

రూ.111 ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్టెల్ రూ.111 స్మార్ట్ రీఛార్జ్ తో రూ.99 టాక్ టైమ్, 200ఎంబి మొబైల్ డేటా లభిస్తుంది. ఈ రీఛార్జ్ తో ఒక నెల వ్యాలిడిటీ లభిస్తుంది. లోకల్, ఎస్టీడీ, ల్యాండ్ లైన్ కాల్స్ సెకనుకి రూ.2.5 ఖర్చవుతుంది. లోకల్ ఎస్ఎంఎస్ కి రూ.1, ఎస్టీడీ ఎస్ఎంఎస్ కి రూ.1.5 ఖర్చవుతుంది.

రూ.128 ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్టెల్ రూ.128 ప్లాన్ తో 30 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. లోకల్, ఎస్టీడి కాల్స్ సెకనుకి రూ.2.5 ఖర్చవుతుంది. నేషనల్ వీడియో కాల్స్ సెకనుకి రూ.5 ఖర్చవుతుంది. మొబైల్ డేటా ఒక ఎంబీకి 50 పైసలు ఖర్చవుతుంది.

రూ.131 ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్టెల్ రూ.131 ప్లాన్ తో ఒక నెల వ్యాలిడిటీ లభిస్తుంది. లోకల్, ఎస్టీడీ కాల్స్ కి సెకనుకి రూ.2.5 ఖర్చవుతుంది. నేషనల్ వీడియో కాల్స్ కి సెకనుకి రూ.5 ఖర్చవుతుంది. లోకల్ ఎస్ఎంఎస్ కి రూ.1, ఎస్టీడీ ఎస్ఎంఎస్ కి రూ.1.5 ఖర్చవుతుంది. ఇక ఒక ఎంబీ డేటాకి 50 పైసలు ఖర్చవుతుంది.