Amazon India - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 07 Aug 2024 08:21:17 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Motorola Razr 40, Razr 40 Ultra పై రూ.50,000 వరకు డిస్కౌంట్, అమెజాన్‌పై ఆఫర్, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/motorola-razr-40-razr-40-ultra-discount-upto-rs-50000-on-amazon-know-full-details/ https://www.91mobiles.com/telugu/motorola-razr-40-razr-40-ultra-discount-upto-rs-50000-on-amazon-know-full-details/#respond Wed, 07 Aug 2024 06:28:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=12858 అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ సేల్ లో భాగంగా స్మార్ట్‌ఫోన్లపై ఆకర్షణీయమైన డీల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ ఆర్టికల్ లో మనం Motorola Razr 40, Motorola Razr 40 Ultra లపై లభిస్తోన్న డీల్స్ వివరాలు తెలుసుకుందాం. ఈ మోడల్స్, ఇటీవలె లాంచైన రేజర్ 50 లైనప్ కంటే ముందు వచ్చాయి. సరే, ఓసారి డిస్కౌంట్ ఆఫర్ వివరాలు తెలుసుకుందాం. Motoroal Razr 40, Motoroal Razr 40 Ultra […]

The post Motorola Razr 40, Razr 40 Ultra పై రూ.50,000 వరకు డిస్కౌంట్, అమెజాన్‌పై ఆఫర్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Motorola Razr 40 Ultra డిస్కౌంట్ ధర రూ.46,749
  • Motorola Razr 40 టీజ్డ్ ప్రైస్ రూ.32,999 (బ్యాంక్ ఆఫర్స్‌తో)
  • ఎస్బీఐ కార్డ్‌పై 10 శాతం డిస్కౌంట్

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ సేల్ లో భాగంగా స్మార్ట్‌ఫోన్లపై ఆకర్షణీయమైన డీల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ ఆర్టికల్ లో మనం Motorola Razr 40, Motorola Razr 40 Ultra లపై లభిస్తోన్న డీల్స్ వివరాలు తెలుసుకుందాం. ఈ మోడల్స్, ఇటీవలె లాంచైన రేజర్ 50 లైనప్ కంటే ముందు వచ్చాయి. సరే, ఓసారి డిస్కౌంట్ ఆఫర్ వివరాలు తెలుసుకుందాం.

Motoroal Razr 40, Motoroal Razr 40 Ultra డీల్స్

Motoroal Razr 40 Ultra యొక్క సింగిల్ వేరియంట్ (8జిబి/256జిబి) ధర రూ.89,999 గా ఉంది. మరోవైపు, Motoroal Razr 40 మోడల్ రూ.59,999 తో లాంచ్ అయ్యింది.

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ లో భాగంగా Motoroal Razr 40 Ultra కేవలం రూ.46,749 ధరతో లిస్ట్ అయ్యింది. అంటే ఏకంగా రూ.43,250 డిస్కౌంట్ అన్నమాట.

ఎస్బీఐ కార్డ్ పై పూర్తి చెల్లింపు చేస్తే, రూ.750 డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అలాగే ఈఎంఐ ద్వారా రూ.1500 డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో ఫోన్ ధర రూ.45,999 కి చేరుతుంది.

మరోవైపు, Motoroal Razr 40 ప్రస్తుతానికి అందుబాటులో లేదు. కానీ, ధర మాత్రం అమెజాన్ పై రూ.32,999 అని టీజ్ చేశారు. ఇది బ్యాంక్ ఆఫర్ తో కలుపుకుని అనే విషయం గమనించాలి.

Motorola Razr 40 మరియు Motorola Razr 40 Ultra మీరు కొనవచ్చా?

మోటోరోలా రేజర్ 40, రేజర్ 40 అల్ట్రా ఫోల్డబుల్ ఫోన్లు మార్కెట్ లోకి వచ్చి ఏడాది అవుతోంది. అయితే, మీరు గనుక డిఫరెంట్ గా ఉండే ఫోన్లను ఇష్టపడే వారైతే, ఈ ఫోన్లు సరైన ఎంపిక అవ్వవచ్చు. ఈ ఫోల్డబుల్ ఫోన్లు ప్రముఖ బ్రాండ్ నుంచి వచ్చినవి. పైగా, ఈ ఫోన్లలో బ్లోట్‌వేర్ లేదా యాడ్స్ అనేవి కనిపించవు. నాజూకైన, దృఢమైన బిల్డ్ క్వాలిటీని ఈ ఫోన్లు కలిగి ఉన్నాయి.

అల్ట్రా మోడల్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 చిప్ వాడారు. రోజువారీ వినియోగానికి ఇది ఎంతో బాగా పని చేస్తుంది. మల్టీ-టాస్కింగ్, గేమింగ్ ను కూడా బాగా హ్యాండిల్ చేయగలదు. అంతేకాదు, బ్యాక్ ప్యానెల్ పై 3.6-ఇంచ్ సెకండ్ స్క్రీన్ కూడా కలదు. మ్యూజిక్ కంట్రోలింగ్, నోటిఫికేషన్స్ మరియు ఇతర పనులను ఈ బ్యాక్ స్క్రీన్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు.

ఇన్ని లాభాలున్నా, బ్యాటరీ విషయంలో రాజీపడక తప్పదు. ఎందుకంటే ఇందులో కేవలం 3,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 30 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

మరోవైపు, రేజర్ 40 లో వాడిన స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్ కాస్త పాతదని చెప్పవచ్చు. ప్రత్యేకించి రూ.35,000 సెగ్మెంట్ లో స్నాప్‌డ్రాగన్ 8-సిరీస్ ప్రాసెసర్స్ గల ఫోన్లు లభిస్తున్నాయి. ఇంకా ఏఐ ఫీచర్స్ తో కూడా వస్తున్నాయి. ఈ ఫోన్ లో 64ఎంపి ప్రైమరీ కెమెరా, 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. బ్యాక్ ప్యానెల్ పై 1.47-ఇంచ్ సెకండరీ లెన్స్ ఉంది. ఇక ఇదే ధర శ్రేణిలో ఇంకా మంచి ఫోన్లు కూడా ఉన్నాయి.

మీకు కచ్చితంగా, ఫోల్డబుల్ ఫోన్ బడ్జెట్ లో కావాలంటే, అదీనూ శాంసంగ్ లాంటి ఫోల్డబుల్ ఫోన్లను కొనే పరిస్థితి లేకుంటే, మీరు మోటోరోలా రేజర్ 40 అల్ట్రాను కొనుగోలు చేయవచ్చు. ఇక ఆల్టర్నేటివ్స్ విషయానికి వస్తే, OnePlus 12R, iQOO 12, OnePlus Nord 4, iQOO Neo 9 Pro ఉన్నాయి.

The post Motorola Razr 40, Razr 40 Ultra పై రూ.50,000 వరకు డిస్కౌంట్, అమెజాన్‌పై ఆఫర్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/motorola-razr-40-razr-40-ultra-discount-upto-rs-50000-on-amazon-know-full-details/feed/ 0
iPhone 13: తక్కువ ధరకే ఐఫోన్ 13, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/iphone-13-available-for-lowest-price-know-full-details/ https://www.91mobiles.com/telugu/iphone-13-available-for-lowest-price-know-full-details/#respond Tue, 06 Aug 2024 06:56:23 +0000 https://www.91mobiles.com/telugu/?p=12843 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Apple నుంచి వచ్చిన iPhone 13 ఇప్పుడు తక్కువ ధరకే లభించనుంది. ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్, ఐఫోన్ 13 ను ఇప్పటి వరకు లేనంత చవకగా అందిస్తోంది. ప్రస్తుతం కొనసాగుతోన్న అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ (Amazon Great Freedom Festival Sale) లో iPhone 13 128జిబి వేరియంట్‌ను రూ.48,799 కే సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు, ఈ ఫోన్ పై బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. పూర్తి వివరాలు తెలుసుకుందాం […]

The post iPhone 13: తక్కువ ధరకే ఐఫోన్ 13, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • iPhone 13 పై డిస్కౌంట్ ఆఫర్
  • అమెజాన్ సేల్ లో ఆఫర్
  • 128జిబి వేరియంట్ ధర రూ.48,799

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Apple నుంచి వచ్చిన iPhone 13 ఇప్పుడు తక్కువ ధరకే లభించనుంది. ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్, ఐఫోన్ 13 ను ఇప్పటి వరకు లేనంత చవకగా అందిస్తోంది. ప్రస్తుతం కొనసాగుతోన్న అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ (Amazon Great Freedom Festival Sale) లో iPhone 13 128జిబి వేరియంట్‌ను రూ.48,799 కే సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు, ఈ ఫోన్ పై బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

iPhone 13 సేల్ డిస్కౌంట్, ఆఫర్ వివరాలు

iPhone 13 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.59,600 కాగా, Amazon సేల్ లో భాగంగా 18 శాతం డిస్కౌంట్ తో ప్రస్తుతం రూ.48,799 కే లభిస్తోంది.

మీరు గనుక ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ కలిగి ఉంటే, మరింత ఎక్కువ బెనిఫిట్ ఈ ఫోన్ పై పొందవచ్చు. ఒక్కసారిగా పేమెంట్ చేసి ఐఫోన్ 13 కొంటే, వారికి రూ.750 డిస్కౌంట్ లభిస్తుంది. అంటే ఈ ఫోన్ మీకు రూ.48,049 కే లభించనుందన్నమాట.

వడ్డీతో కూడిన ఈఎంఐ ఆప్షన్‌తో మరో రూ.1500 డిస్కౌంట్ పొందవచ్చు. అయితే ఈఎంఐ కాలపరిమితి ఎక్కువైతే ఈ ఆఫర్ ప్రయోజనం పెద్దగా ఉండదు. అందుకే మీరు 3 నుంచి 6 నెలల కాలపరిమితి ఎంపిక చేసుకుంటే అప్పుడు రూ.1500 డిస్కౌంట్ కలపుకుని iPhone 13 మీకు రూ.48.499 కే లభిస్తుంది.

అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా మీకు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ అందుబాటులో ఉంది. మీరు గనుక ఈ కార్డ్ కలిగి ఉంటే, రూ.2,197.34 వరకు వడ్డీని తగ్గించుకోవచ్చు.

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్‌లో మీరు iPhone 13 కొనవచ్చా?

iPhone 13 స్మార్ట్‌ఫోన్ 2022 లో లాంచ్ అయ్యింది. 2028 వరకు ఈ ఫోన్‌కి సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ లభిస్తాయి. అంటే మీకు కొన్నేళ్ళ దాకా ఓఎస్ మరియు సెక్యూరిటీ అప్డేట్స్ల లభిస్తాయన్న మాట.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న iPhone 15 మరియు త్వరలో రాబోవు iPhone 16 తో పోల్చితే, ప్రాసెసర్, కెమెరా, డిజైన్, బ్యాటరీ సైజ్ వంటి విషయాల్లో iPhone 13 బలహీనంగా కనిపిస్తుంది. అయినప్పటికీ ఈ ఫోన్ మీకు క్వాలిటీ ఐఫోన్ అనుభూతిని అందిస్తుంది. అదీనూ, రూ.50,000 లోపు బడ్జెట్ లో కావాలంటే, iPhone 13 మంచి ఆప్షనే.

మీరు గనుక కాస్త బడ్జెట్ పెంచుకుంటే, రూ.56,999 ధరలో ఫ్లిప్‌కార్ట్ పై iPhone 14 Plus లభిస్తుంది. దీనికి 2029 వరకు సాఫ్ట్‌వేర్, సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి. ఇంకా పెద్ద డిస్ప్లే, మంచి బ్యాటరీ లైఫ్ ఇతర అప్‌గ్రేడ్స్ అనేవి ప్లస్ పాయింట్లు.

ఇక ఆండ్రాయిడ్ విషయానికి వస్తే, రూ.50,000 లోపు బడ్జెట్ లో మీరు Samsung Galaxy S23 5G ని కన్సిడర్ చేయవచ్చు. ఈ ఫోన్ మెరుగైన స్పెసిఫికేషన్స్‌ను తక్కువ ధరకే ఆఫర్ చేస్తోంది.

The post iPhone 13: తక్కువ ధరకే ఐఫోన్ 13, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/iphone-13-available-for-lowest-price-know-full-details/feed/ 0
Samsung Galaxy A15 5G పై డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a15-5g-discount-offer-know-full-details/ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a15-5g-discount-offer-know-full-details/#respond Wed, 31 Jul 2024 17:13:22 +0000 https://www.91mobiles.com/telugu/?p=12767 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung కొన్ని రోజుల క్రితం Samsung Galaxy A15 5G అనే ఫోన్‌ని లాంచ్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోన్ పై అమెజాన్ లో డిస్కౌంట్ లభిస్తోంది. మీరు గనుక ఈ ఫోన్ కొనాలని భావిస్తుంటే అందుకు ఇదే మంచి సమయం అని చెప్పవచ్చు. రూ.2,000 వరకు గెలాక్సీ ఏ15 పై డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 50ఎంపి కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ […]

The post Samsung Galaxy A15 5G పై డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Samsung Galaxy A15 5G పై డిస్కౌంట్
  • అందుబాటులో కూపన్, బ్యాంక్ ఆఫర్స్
  • రూ.2,000 వరకు డిస్కౌంట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung కొన్ని రోజుల క్రితం Samsung Galaxy A15 5G అనే ఫోన్‌ని లాంచ్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోన్ పై అమెజాన్ లో డిస్కౌంట్ లభిస్తోంది. మీరు గనుక ఈ ఫోన్ కొనాలని భావిస్తుంటే అందుకు ఇదే మంచి సమయం అని చెప్పవచ్చు. రూ.2,000 వరకు గెలాక్సీ ఏ15 పై డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 50ఎంపి కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. ఓసారి డిస్కౌంట్ వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Samsung Galaxy A15 5G డిస్కౌంట్ ఆఫర్లు

Samsung Galaxy A15 5G స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం అమెజాన్ లో విక్రయించబడుతోంది. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ పై 2,000 డిస్కౌంట్ లభిస్తోంది. ఈ డిస్కౌంట్‌ను కూపన్ డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్ల ద్వారా పొందవచ్చు. ఈ వేరియంట్ రూ.19,499 ధరతో లాంచ్ అవ్వగా, ప్రస్తుతం డిస్కౌంట్ తర్వాత ఇది రూ.17,499 కి లభిస్తుంది.

Samsung Galaxy A15 5G 8జిబి + 128జిబి మోడల్ పై రూ.500 కూపన్ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ ఇండియాపై ఈ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. కూపన్ డిస్కౌంట్ తర్వాత డివైజ్ ధర రూ.18,999 కి చేరుతుంది. తర్వాత బ్యాంక్ ఆఫర్ రూ.1,500 తో డివైజ్ ధర రూ.17,499 కి చేరనుంది.

Samsung Galaxy A15 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Samsung Galaxy A15 5G స్మార్ట్‌ఫోన్ లో 6.5-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ ఇన్ఫినిటీ యు నాచ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1080*2340 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి.

ప్రాసెసర్: Samsung Galaxy A15 5G డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A15 5G స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.

కెమెరా: Samsung Galaxy A15 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

ఓఎస్: Samsung Galaxy A15 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

బ్యాటరీ: Samsung Galaxy A15 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Samsung Galaxy A15 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, జీపీఎస్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

The post Samsung Galaxy A15 5G పై డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a15-5g-discount-offer-know-full-details/feed/ 0
OnePlus 11R పై బ్యాంక్ డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/oneplus-11r-5g-bank-discount-offer-know-full-details/ Mon, 20 May 2024 11:58:59 +0000 https://www.91mobiles.com/telugu/?p=11623 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus గతేడాది OnePlus 11R డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ మార్కెట్ లో బాగా క్లిక్ అయ్యింది. ప్రస్తుతం ఈ ఫోన్ ఎంతో తక్కువ ధరకే యూజర్లకు అందుబాటులో ఉంది. అయితే ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ పై మరింత చవకగా OnePlus 11R లభిస్తోంది. బ్యాంక్ డిస్కౌంట్ తో ఈ ఫోన్‌ని తక్కువ బడ్జెట్ లో సొంతం చేసుకోవచ్చు. ఓసారి ఆఫర్ వివరాలను తెలుసుకుందాం పదండి. OnePlus 11R డిస్కౌంట్ […]

The post OnePlus 11R పై బ్యాంక్ డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • OnePlus 11R పై డిస్కౌంట్
  • రూ.2,000 వరకు తగ్గింపు
  • అమెజాన్ పై అందుబాటులో ఆఫర్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus గతేడాది OnePlus 11R డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ మార్కెట్ లో బాగా క్లిక్ అయ్యింది. ప్రస్తుతం ఈ ఫోన్ ఎంతో తక్కువ ధరకే యూజర్లకు అందుబాటులో ఉంది. అయితే ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ పై మరింత చవకగా OnePlus 11R లభిస్తోంది. బ్యాంక్ డిస్కౌంట్ తో ఈ ఫోన్‌ని తక్కువ బడ్జెట్ లో సొంతం చేసుకోవచ్చు. ఓసారి ఆఫర్ వివరాలను తెలుసుకుందాం పదండి.

OnePlus 11R డిస్కౌంట్ వివరాలు

OnePlus 11R స్మార్ట్‌ఫోన్ యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర అమెజాన్ ఇండియాపై రూ.29,999 గా ఉంది. ఏదైనా బ్యాంక్ కార్డుతో పూర్తి పేమెంట్ చేసి డివైజ్‌ని కొనుగోలు చేస్తే, రూ.2,000 డిస్కౌంట్ లభిస్తుంది. అంటే యూజర్ కి ఈ ఫోన్ రూ.27,000 కే లభించనుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఏప్రిల్ నెలలో లాంచైన సోలార్ రెడ్ ఎడిషన్ కూడా ఇదే ధరకి లభిస్తుంది. ఇకపోతే, OnePlus 11R ఫోన్ సోనిక్ బ్లాక్ మరియు గెలాక్టిక్ సిల్వర్ కలర్స్ లో లభిస్తుంది.

ఇక్కడ గమనించ దగిన విషయం ఏంటంటే, వన్‌ప్లస్ వెబ్‌సైట్ పై OnePlus 11R ధర ఇంకా రూ.35,999 గానే ఉంది. అమెజాన్ ఇండియా వెబ్‌సైట్ పై OnePlus 11R ఆఫర్ ధర ఎన్ని రోజులు అందుబాటులో ఉంటుందో ఇంకా తెలియదు.

OnePlus 11R స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: OnePlus 11R 5G స్మార్ట్ ఫోన్ 6.74-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే తో వచ్చింది. 120 హెర్ట్జ్ సూపర్ ఫ్లూయిడ్ డిస్ప్లే, 1450 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1000 హెర్ట్జ్ టచ్ రెస్పాన్స్ రేట్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

చిప్సెట్: OnePlus 11R 5G లో స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 చిప్ వాడారు.

బ్యాటరీ: OnePlus 11R 5G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. OnePlus 11R 5G డివైజ్ సోనిక్ బ్లాక్, గెలాక్టిక్ సిల్వర్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.

మెమొరీ: OnePlus 11R 5G లో 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్4.0 స్టోరేజీ టెక్నాలజీని ఈ ఫోన్ లో అందించారు.

ఓఎస్: ఈ హ్యాండ్సెట్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా: OnePlus 11R 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 మెయిన్ సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఈ ఫోన్ లో ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

కనెక్టివిటీ: OnePlus 11R 5G లో 5జీ, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.2, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.

చుట్టుకొలత, బరువు: OnePlus 11R 5G డివైజ్ 163.1 మిల్లీ మీటర్ల పొడవు, 74.1 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.53 మిల్లీ మీటర్ల మందం, 205 గ్రాముల బరువు ఉంటుంది.

ఇతర ఫీచర్లు: భద్రత కోసం ఈ ఫోన్ లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. డాల్బి అట్మాస్, అలర్ట్ స్లైడర్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

The post OnePlus 11R పై బ్యాంక్ డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
iQOO Neo 9 Pro: అమెజాన్ లభ్యత, చిప్సెట్ ఖరారు https://www.91mobiles.com/telugu/iqoo-neo-9-pro-amazon-availability-chipset-confirmed/ Fri, 05 Jan 2024 17:28:31 +0000 https://www.91mobiles.com/telugu/?p=9589 Vivo సబ్-బ్రాండ్ iQOO ఫిబ్రవరి నెలలో iQOO Neo 9 Pro స్మార్ట్‌ఫోన్‌ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఐకూ సంస్థ తన X ఖాతా ద్వారా ఈ డివైజ్ కి సంబంధించిన టీజర్స్ షేర్ చేస్తూ వస్తోంది. టీజర్స్ ద్వారా iQOO Neo 9 Pro డివైజ్ డ్యూయల్-టోన్ వేరియంట్ లో వస్తుందని తెలిసింది. మరోవైపు Amazon మైక్రోసైట్ ద్వారా ఈ ఫోన్ యొక్క డిజైన్ ఎలిమెంట్స్ రివీల్ అయ్యాయి. తాజాగా iQOO […]

The post iQOO Neo 9 Pro: అమెజాన్ లభ్యత, చిప్సెట్ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న iQOO Neo 9 Pro
  • క్యూ1 సూపర్‌కంప్యూటింగ్ చిప్‌తో వస్తోన్న డివైజ్
  • అమెజాన్ పై లిస్టైన iQOO Neo 9 Pro

Vivo సబ్-బ్రాండ్ iQOO ఫిబ్రవరి నెలలో iQOO Neo 9 Pro స్మార్ట్‌ఫోన్‌ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఐకూ సంస్థ తన X ఖాతా ద్వారా ఈ డివైజ్ కి సంబంధించిన టీజర్స్ షేర్ చేస్తూ వస్తోంది. టీజర్స్ ద్వారా iQOO Neo 9 Pro డివైజ్ డ్యూయల్-టోన్ వేరియంట్ లో వస్తుందని తెలిసింది. మరోవైపు Amazon మైక్రోసైట్ ద్వారా ఈ ఫోన్ యొక్క డిజైన్ ఎలిమెంట్స్ రివీల్ అయ్యాయి. తాజాగా iQOO Neo 9 Pro చిప్సెట్ వివరాలు ఖరారు అయ్యాయి. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

iQOO Neo 9 Pro చిప్సెట్ వివరాలు (ఇండియా)

  • iQOO Neo 9 Pro డివైజ్ భారతీయ మార్కెట్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో వస్తుందని సమాచారం.
  • ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా ద్వారా iQOO Neo 9 Pro సేల్ కి రానుంది. ప్రస్తుతం ఈ సైట్ లో మైక్రోసైట్ దర్శనమిస్తోంది.
  • iQOO Neo 9 సిరీస్ లో iQOO Neo 9 మరియు iQOO Neo 9 Pro డివైజెస్ మార్కెట్ లోకి రానున్నాయి.
  • ఇప్పటికే ఈ రెండు ఫోన్లు చైనాలో లాంచ్ అయ్యాయి. ఓసారి ఈ డివైజెస్ యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

iQOO Neo 9, iQOO Neo 9 Pro స్పెసిఫికేషన్స్ (చైనా వేరియంట్స్)

  • డిస్ప్లే: iQOO Neo 9, iQOO Neo 9 Pro ఫోన్లలో 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 93.43 పర్సెంట్ స్క్రీన్ టు బాడీ రేషియో, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్, హెచ్డీఆర్ 10, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: iQOO Neo 9 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, అడ్రెనో 740 జీపీయూ ఉన్నాయి. iQOO Neo 9 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్, ఇమ్మోర్టాలిస్-జీ720 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: రెండు ఫోన్లు కూడా 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీని ఆఫర్ చేస్తాయి.
  • iQOO Neo 9 కెమెరా: iQOO Neo 9 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని వీసీఎస్ ఐఎంఎక్స్92 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • iQOO Neo 9 Pro కెమెరా: iQOO Neo 9 Pro లో 50ఎంపి సోని వీసీఎస్ ఐఎంఎక్స్92 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: రెండు ఫోన్లలో 5,160 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.
  • ఓఎస్: iQOO Neo 9 మరియు iQOO Neo 9 Pro డివైజెస్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 4 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.
  • కనెక్టివిటీ: iQOO Neo 9, iQOO Neo 9 Pro ఫోన్లలో 5జీ ఎస్ఏ/ఎన్ఎస్ఏ, 4జీ వొల్టీ, వై-ఫై 7, బ్లూటూత్ 5.3, ఓటీజీ సపోర్ట్, జీపీఎస్/బైడూ/గెలీలియో/క్యూజెడ్ఎస్ఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఎన్ఎఫ్‌సీ, ఐఆర్ బ్లాస్టర్ ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: iQOO Neo 9 సిరీస్ ఫోన్లలో క్యూ1 డెడికేటెడ్ చిప్, 6కే కెనోపి వీసీ కూలింగ్ సిస్టమ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ సపోర్ట్ ఉన్నాయి.

The post iQOO Neo 9 Pro: అమెజాన్ లభ్యత, చిప్సెట్ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
మొబైల్-ఓన్లీ ప్యాక్ తో వచ్చిన Amazon Prime Video; Disney+ Hotstar, Netflix లకు గట్టిపోటీ ఇవ్వనుందా? https://www.91mobiles.com/telugu/amazon-prime-video-mobile-only-plan-launched-price-benefits-details/ Mon, 07 Nov 2022 12:27:05 +0000 https://www.91mobiles.com/telugu/?p=3281 హైలైట్స్ భారత్ లో ప్రైమ్ వీడియో మెంబర్షిప్ కోసం కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ని తీసుకొచ్చిన అమెజాన్ మొబైల్ ప్యాక్ ద్వారా అమెజాన్ ఒరిజినల్స్, లైవ్ క్రికెట్, జాతీయ, అంతర్జాతీయ చిత్రాలు పొందనున్న యూజర్లు తన సరికొత్త మొబైల్ ప్లాన్ ద్వారా డిస్నీ+ హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్ లకు గట్టి పోటీ ఇవ్వనున్న అమెజాన్ అమెజాన్ కంపెనీ తన ప్రైమ్ వీడియో మెంబర్షిప్ కోసం భారత్ లో కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ని లాంచ్ చేసింది. అమెజాన్ ప్రైమ్ […]

The post మొబైల్-ఓన్లీ ప్యాక్ తో వచ్చిన Amazon Prime Video; Disney+ Hotstar, Netflix లకు గట్టిపోటీ ఇవ్వనుందా? first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • భారత్ లో ప్రైమ్ వీడియో మెంబర్షిప్ కోసం కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ని తీసుకొచ్చిన అమెజాన్
  • మొబైల్ ప్యాక్ ద్వారా అమెజాన్ ఒరిజినల్స్, లైవ్ క్రికెట్, జాతీయ, అంతర్జాతీయ చిత్రాలు పొందనున్న యూజర్లు
  • తన సరికొత్త మొబైల్ ప్లాన్ ద్వారా డిస్నీ+ హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్ లకు గట్టి పోటీ ఇవ్వనున్న అమెజాన్
Image: Amazon Prime Video

అమెజాన్ కంపెనీ తన ప్రైమ్ వీడియో మెంబర్షిప్ కోసం భారత్ లో కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ని లాంచ్ చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ని కంపెనీ లాంచ్ చేసింది. ఈ కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ఒక నెల, 3 నెలలు, 12 నెలల కాలపరిమితితో అందుబాటులో ఉంటుంది. అమెజాన్ తన కొత్త మొబైల్-ఓన్లీ ప్లాన్ ద్వారా డిస్నీ+ హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్ లకు గట్టి పోటీ ఇవ్వాలని ప్లాన్ చేస్తోంది.

అసలు విషయం ఏంటంటే, డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ ప్లాన్ ఎన్నో టెలీకామ్ రీచార్జ్ ప్లాన్స్ తో బండిల్ చేయబడి వస్తోంది. ఇప్పుడు ఈ షేర్ ని కొంత మొత్తం కబ్జా చేసేందుకు అమెజాన్ మొబైల్-ఓన్లీ ప్లాన్ సబ్‌స్క్రిప్షన్ ధరను తక్కువ ధరకే తీసుకువచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ధర, ఫీచర్లు ఇతర వివరాల గురించి తెలుసుకుందాం. పదండి.

Amazon Prime Video మొబైల్ ఎడిషన్ విశేషాలు

Amazon ఏడాదికి రూ.599 ధరతో ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ని లాంచ్ చేసింది. స్టాండర్డ్ యాన్యువల్ ప్యాక్ ధర రూ.1,499 గా ఉంది. అయితే మొబైల్-ఓన్లీ ప్లాన్ చాలా తక్కువ ధరకు లభించనుంది. ఈ మొబైల్ ప్లాన్ ద్వారా 480p స్టాండర్డ్ రెజుల్యూషన్ తో వీడియోను చూసే అవకాశం ఉంటుంది. స్టాండర్డ్ ప్యాక్ అయితే 4కే స్ట్రీమింగ్ ఆప్షన్ ఉంటుంది.

మొబైల్ ప్యాక్ ద్వారా అమెజాన్ ఒరిజినల్స్, లైవ్ క్రికెట్, భారతీయ, అంతర్జాతీయ సినిమాలకు యాక్సెస్ లభిస్తుంది. వీటితో పాటు, ఆఫ్ లైన్ లో చూడటానికి డౌన్ లోడ్ ఆప్షన్, ఐఎండీబీ యొక్క ఎక్స్-రే వంటి ఫీచర్లు లభిస్తాయి.

అయితే మొబైల్ ఎడిషన్ ప్యాక్ కొన్ని ముఖ్యమైన ఫీచర్లతో రావడం లేదు. ఫ్రీ-ఫాస్ట్ అమెజాన్ డెలివరీ, యాడ్-ఫ్రీ మ్యూజిక్ (ప్రైమ్ మ్యూజిక్), ప్రైమ్ రీడింగ్ వంటి ఫీచర్లు రాబోవు. ఈ ఫీచర్లు కేవలం రూ.1499 ప్లాన్ కి మాత్రమే పరిమితం. టాప్-టైర్ ప్లాన్ ద్వారా మల్టీ-యూజర్ ప్రొఫైల్స్, వివిధ డివైజెస్ పై స్ట్రీమింగ్ వంటివి లభిస్తాయి. మొబైల్-ఓన్లీ ప్లాన్ యూజర్లు కేవలం ఒకే అకౌంట్ ద్వారా కంటెంట్ ని వినియోగించుకునే వీలుంది.

Amazon Prime India వైస్ ప్రెసిడెంట్ గౌరవ్ గాంధీ ఈ కొత్త మొబైల్-ఓన్లీ ప్లాన్ ని లాంచ్ చేశారు. 99 శాతం పిన్‌కోడ్స్ నుంచి ప్రైమ్ వీడియో కి వ్యూయర్షిప్ వస్తోందని గాంధీ తెలిపారు.

అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాట్ఫామ్ కి భారత మార్కెట్ ఎంతో కీలకమైనదని ప్రైమ్ వీడియో, ఇంటర్నేషనల్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ కెల్లీ డే అన్నారు. కొత్త మొబైల్-ఓన్లీ ప్లాన్ తో తమకు యూజర్లు గణనీయంగా పెరుగుతారని అమెజాన్ ఆశిస్తోంది. మరింకెందుకు ఆలస్యం ఓటీటీ కంటెంట్ ని ఎంజాయ్ చేయాలనుకుంటే వెంటనే ప్రైమ్ వీడియో మొబైల్-ఓన్లీ ప్లాన్ కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post మొబైల్-ఓన్లీ ప్యాక్ తో వచ్చిన Amazon Prime Video; Disney+ Hotstar, Netflix లకు గట్టిపోటీ ఇవ్వనుందా? first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Amazon Great Indian Festival సేల్ డేట్ https://www.91mobiles.com/telugu/amazon-great-indian-festival-sale-date-revealed/ Thu, 08 Sep 2022 14:14:36 +0000 https://www.91mobiles.com/telugu/?p=2203 హైలైట్స్: నెట్టింట్లో ప్రత్యక్షమైన అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ డేట్ సెప్టెంబర్ 18 న మొదలై సెప్టెంబర్ 29 న ముగియనున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా విద్యార్థులకు ప్రత్యేక డిస్కౌంట్స్ ఉండే అవకాశం ఈ నెలలో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభం కానుంది. ఈ సేల్ లో ఐఫోన్స్, ఇతర స్మార్ట్ ఫోన్స్, ల్యాప్ టాప్స్ మరెన్నో ఉపకరణాలపై భారీ డిస్కౌంట్స్ ఉంటాయి. […]

The post లీకైన Amazon Great Indian Festival సేల్ డేట్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • నెట్టింట్లో ప్రత్యక్షమైన అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ డేట్
  • సెప్టెంబర్ 18 న మొదలై సెప్టెంబర్ 29 న ముగియనున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్
  • అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా విద్యార్థులకు ప్రత్యేక డిస్కౌంట్స్ ఉండే అవకాశం

ఈ నెలలో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభం కానుంది. ఈ సేల్ లో ఐఫోన్స్, ఇతర స్మార్ట్ ఫోన్స్, ల్యాప్ టాప్స్ మరెన్నో ఉపకరణాలపై భారీ డిస్కౌంట్స్ ఉంటాయి. అయితే అమెజాన్ ఇంకా సేల్ యొక్క అధికార తేదీని వెల్లడించలేదు. అయితే ప్రముఖ లీక్‌స్టర్ అభిషేక్ యాదవ్ అమెజాన్ గ్రేట్ ఇండియా 2022 సేల్ యొక్క తేదీని లీక్ చేశాడు. సేల్ సెప్టెంబర్ 18 న మొదలై, సెప్టెంబర్ 29 న ముగుస్తుందని అతడు అంచనా వేశాడు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ కూడా దాదాపు అదే సమయంలో నడుస్తుంది.

ఈ అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సేల్స్ ఆపిల్, శాంసంగ్, షావోమీ, ఐకూ, రియల్మీ, వన్ ప్లస్ తదితర డివైజెస్ పై డిస్కౌంట్స్ ఆఫర్ చేయనున్నాయి. మీరు కనుక ఏదైనా స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటే, ఈ సేల్ సందర్భంగా కొంటే మంచి డిస్కౌంట్ లో ఫోన్ మీ సొంతం అవుతుంది.

Amazon Great Indian Festival సేల్ డేట్

లీకైన స్క్రీన్ షాట్స్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ కి యూజర్ కి మధ్య జరిగిన చాట్ అని అర్థమవుతోంది. చాట్ ద్వారా మనకు తెలుస్తున్నదేంటంటే, విద్యార్థులకు ఈ సేల్ సందర్భంగా ప్రత్యేక డిస్కౌంట్స్ ఉండనున్నాయట. ఎస్బీఐ బ్యాంక్ కార్డ్ ద్వారా యూజర్లు 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందుతారు. అలాగే అమెజాన్ గ్రేట్ ఇండియన్ 2022 సేల్ సందర్భంగా 10 శాతం క్యాష్‌బ్యాక్ లభించనుంది.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, ఫ్లిప్ కార్ట్ యొక్క బిగ్ బిలియన్ డే సేల్ సందర్భంగా హైలైట్ గా నిలుస్తోన్న విషయం ఏంటంటే, ఐఫోన్స్ పై డిస్కౌంట్స్. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ పేజీ ఐఫోన్ 12, ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ లకు సంబంధించిన డీల్స్ ని తెలియజేస్తోంది. మరోవైపు, ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డే పేజీ కూడా ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 13, ఐఫోన్ 11 కు సంబంధించిన డిస్కౌంట్స్ ని ప్రదర్శిస్తోంది.

ఈ అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సేల్స్ ఆపిల్, శాంసంగ్, షావోమీ, ఐకూ, రియల్మీ, వన్ ప్లస్ తదితర డివైజెస్ పై డిస్కౌంట్స్ ఆఫర్ చేయనున్నాయి. మీరు కనుక ఏదైనా స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటే, ఈ సేల్ సందర్భంగా కొంటే మంచి డిస్కౌంట్ లో ఫోన్ మీ సొంతం అవుతుంది. ఎస్బీఐ బ్యాంక్ కార్డ్ ద్వారా యూజర్లు 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందుతారు. అలాగే అమెజాన్ గ్రేట్ ఇండియన్ 2022 సేల్ సందర్భంగా 10 శాతం క్యాష్‌బ్యాక్ లభించనుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెలీకామ్, ఆటోమొబైల్, ఎంటర్టెయిన్మెంట్ వార్తల కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post లీకైన Amazon Great Indian Festival సేల్ డేట్ first appeared on 91Mobiles Telugu.

]]>