China launch date - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 08 Oct 2024 11:38:42 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Honor X60 సిరీస్ లాంచ్ తేదీ ఖరారు, టీజర్ విడుదల https://www.91mobiles.com/telugu/honor-x60-series-china-launch-date-confirmed-teaser-released/ https://www.91mobiles.com/telugu/honor-x60-series-china-launch-date-confirmed-teaser-released/#respond Tue, 08 Oct 2024 11:38:42 +0000 https://www.91mobiles.com/telugu/?p=13986 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Honor త్వరలో తన X60 సిరీస్‌ను లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో మూడు మోడల్స్ లాంచ్ అవుతాయని సమాచారం. గతేడాది వచ్చిన Honor X50 సిరీస్‌కు సక్సెసర్ గా ఎక్స్60 సిరీస్ లాంచ్ కానుంది. తాజాగా, Honor X60 సిరీస్ యొక్క చైనా లాంచ్ తేదీని కంపెనీ టీజర్ ద్వారా ఖరారు చేసింది. ఓసారి టీజర్ విశేషాలు, లాంచ్ తేదీ వివరాలను తెలుసుకుందాం. Honor X60 సిరీస్ లాంచ్ తేదీ […]

The post Honor X60 సిరీస్ లాంచ్ తేదీ ఖరారు, టీజర్ విడుదల first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో చైనాలో Honor X60 సిరీస్ విడుదల
  • అక్టోబర్ 16న లాంచ్ అవుతోన్న లైనప్
  • మూడు మోడల్స్ లాంచ్ అయ్యే అవకాశం

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Honor త్వరలో తన X60 సిరీస్‌ను లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో మూడు మోడల్స్ లాంచ్ అవుతాయని సమాచారం. గతేడాది వచ్చిన Honor X50 సిరీస్‌కు సక్సెసర్ గా ఎక్స్60 సిరీస్ లాంచ్ కానుంది. తాజాగా, Honor X60 సిరీస్ యొక్క చైనా లాంచ్ తేదీని కంపెనీ టీజర్ ద్వారా ఖరారు చేసింది. ఓసారి టీజర్ విశేషాలు, లాంచ్ తేదీ వివరాలను తెలుసుకుందాం.

Honor X60 సిరీస్ లాంచ్ తేదీ (చైనా)

  • Honor X60 సిరీస్ చైనాలో అక్టోబర్ 16వ తేదీన లాంచ్ అవుతుందని కంపెనీ టీజర్ ద్వారా వెల్లడించింది. అయితే ఈ లైనప్ లో ఎన్ని మోడల్స్ లాంచ్ అవుతాయో ఇంకా కన్ఫర్మ్ కాలేదు.
  • హానర్ సంస్థ ఈ టీజర్‌ను చైనాకు చెందిన మైక్రో బ్లాగింగ్ సైట్ Weibo ద్వారా షేర్ చేసింది. చైనా స్థానిక కాలమానం ప్రకారం, అక్టోబర్ 16న రాత్రి 7.30 గంటలకు హానర్ ఎక్స్60 సిరీస్ లాంచ్ అవుతుంది.
  • Honor X60 లైనప్ లో మొత్తం 3 మోడల్స్ లాంచ్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
  • గతేడాది Honor X50 సిరీస్ లో భాగంగా.. X50i, X50i+, X50, X50 Pro మరియు X50 GT అనే మోడల్స్ విడుదలయ్యాయి.
  • రానున్న రోజుల్లో ఈ సిరీస్ కు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడవ్వనున్నాయి.

Honor X60 స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: రిపోర్ట్ ప్రకారం, హానర్ 60 సిరీస్ లోని బేస్ మోడల్ Honor X60 6.8-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అమోలెడ్ ప్యానెల్ తో వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ప్రాసెసర్: Honor X60 డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 7025 చిప్సెట్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

ర్యామ్, స్టోరేజీ: Honor X60 స్మార్ట్‌ఫోన్ 12జిబి ర్యామ్, 12జిబి వర్చువల్ ర్యామ్, 256జిబి స్టోరేజీతో లాంచ్ అవుతుందని సమాచారం.

కెమెరా: Honor X60 డివైజ్ లో 108ఎంపి ప్రైమరీ కెమెరా ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ, చార్జింగ్: Honor X60 స్మార్ట్‌ఫోన్‌లో పవర్ బ్యాకప్ కోసం 5,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 35 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తుందని అంచనా.

ఆపరేటింగ్ సిస్టమ్: Honor X60 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ఓఎస్ 8 కస్టమ్ స్కిన్ తో లాంచ్ అవుతుంది.

కనెక్టివిటీ: Honor X60 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉంటాయి.

The post Honor X60 సిరీస్ లాంచ్ తేదీ ఖరారు, టీజర్ విడుదల first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/honor-x60-series-china-launch-date-confirmed-teaser-released/feed/ 0
OPPO K12 Plus 5G: స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్‌తో వస్తోన్న ఒప్పో కొత్త ఫోన్, చైనా లాంచ్ తేదీ ఖరారు https://www.91mobiles.com/telugu/oppo-k12-plus-5g-to-launch-with-snapdragon-7-gen-3-chipset-china-launch-date-confirmed/ https://www.91mobiles.com/telugu/oppo-k12-plus-5g-to-launch-with-snapdragon-7-gen-3-chipset-china-launch-date-confirmed/#respond Tue, 08 Oct 2024 07:17:20 +0000 https://www.91mobiles.com/telugu/?p=13975 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో కే-సిరీస్ లో కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. OPPO K12 Plus పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లో విడుదలవ్వనుంది. తాజాగా ఒప్పో సంస్థ ఈ ఫోన్ యొక్క చైనా లాంచ్ తేదీని ఖరారు చేసింది. లాంచ్త తేదీతో పాటు డివైజ్ ప్రధాన స్పెసిఫికేషన్స్ కూడా కన్ఫర్మ్ చేసింది. ఓసారి లాంచ్ తేదీ మరియు స్పెసిఫికేషన్స్ వివరాలను తెలుసుకుందాం. OPPO K12 Plus 5G చైనా లాంచ్ తేదీ OPPO […]

The post OPPO K12 Plus 5G: స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్‌తో వస్తోన్న ఒప్పో కొత్త ఫోన్, చైనా లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో OPPO K12 Plus 5G విడుదల
  • చైనాలో అక్టోబర్ 12న లాంచ్
  • 80 వాట్ సూపర్‌వూక్ చార్జింగ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో కే-సిరీస్ లో కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. OPPO K12 Plus పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లో విడుదలవ్వనుంది. తాజాగా ఒప్పో సంస్థ ఈ ఫోన్ యొక్క చైనా లాంచ్ తేదీని ఖరారు చేసింది. లాంచ్త తేదీతో పాటు డివైజ్ ప్రధాన స్పెసిఫికేషన్స్ కూడా కన్ఫర్మ్ చేసింది. ఓసారి లాంచ్ తేదీ మరియు స్పెసిఫికేషన్స్ వివరాలను తెలుసుకుందాం.

OPPO K12 Plus 5G చైనా లాంచ్ తేదీ

  • OPPO K12 Plus 5G స్మార్ట్‌ఫోన్ యొక్క అఫీషియల్ టీజర్‌ను కంపెనీ విడుదల చేసింది. ఈ టీజర్ ద్వారా డివైజ్ లాంచ్ తేదీని కంపెనీ వెల్లడించింది.
  • OPPO K12 Plus 5G స్మార్ట్‌ఫోన్ అక్టోబర్ 12వ తేదీన మధ్యాహ్నం 2.30 గంటలకు చైనాలో లాంచ్ అవుతుంది.
  • OPPO K12 Plus 5G స్మార్ట్‌ఫోన్ స్నో పీక్ వైట్ కలర్ ఆప్షన్ లో లాంచ్ అవుతుంది. బ్యాక్ ప్యానెల్ పై టెక్షర్డ్ డిజైన్ ఉంటుంది. దీనిలో క్రిస్టల్ డైమండ్ ప్యాటర్న్ ఫ్లాష్ శాండ్ ఫినిష్ కనిపిస్తోంది.
  • OPPO K12 Plus 5G ఫోన్ బసాల్ట్ బ్లాక్ కలర్ ఆప్షన్ లో కూడా లభించనుంది. క్రింద డివైజ్ యొక్క గ్లిమ్స్‌ను మీరు చూడవచ్చు.

OPPO K12 Plus 5G స్పెసిఫికేషన్స్ (ఖరారైనవి మరియు అంచనా)

డిస్ప్లే: OPPO K12 Plus 5G స్మార్ట్‌ఫోన్ లో 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

బ్యాటరీ, చార్జింగ్: OPPO K12 Plus 5G స్మార్ట్‌ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 6400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.

చిప్సెట్: OPPO K12 Plus 5G స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. దీనికి అడ్రెనో 720 జీపీయూ ని జతచేయనున్నారు.

ర్యామ్, స్టోరేజీ: OPPO K12 Plus 5G స్మార్ట్‌ఫోన్ 8జిబి, 12జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి/512జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉంటాయి.

కెమెరా: OPPO K12 Plus 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి. మెయిన్ కెమెరా ఓఐఎస్ కి సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

సాఫ్ట్‌వేర్: OPPO K12 Plus 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: OPPO K12 Plus 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ వొల్టీ, బ్లూటూత్ 5.3, వై-ఫై 6 ఉంటటాయి.

ఇతర ఫీచర్లు: OPPO K12 Plus 5G డివైజ్ లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటుంది. ఈ ఫోన్ ఐపీ54 రేటింగ్ తో వస్తోంది. అంటే తేలికపాటి నీటి జల్లులు మరియు దుమ్ము నుంచి ఫోన్‌కి రక్షణ లభిస్తుంది.

The post OPPO K12 Plus 5G: స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్‌తో వస్తోన్న ఒప్పో కొత్త ఫోన్, చైనా లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/oppo-k12-plus-5g-to-launch-with-snapdragon-7-gen-3-chipset-china-launch-date-confirmed/feed/ 0
iQOO Z9 Turbo+: చైనాలో సెప్టెంబర్ 24న లాంచ్ అవుతోన్న ఐకూ కొత్త ఫోన్ https://www.91mobiles.com/telugu/iqoo-z9-turbo-plus-china-launch-date-september-24/ https://www.91mobiles.com/telugu/iqoo-z9-turbo-plus-china-launch-date-september-24/#respond Thu, 19 Sep 2024 07:29:13 +0000 https://www.91mobiles.com/telugu/?p=13597 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO నుంచి త్వరలో జెడ్9 సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. iQOO Z9 Turbo+ పేరుతో ఈ డివైజ్ విడుదల కానుంది. తాజాగా చైనా లాంచ్ తేదీని కంపెనీ కన్ఫర్మ్ చేసింది. కాగా, ఇప్పటికే జెడ్9 లైనప్ లో ఐకూ జెడ్9, జెడ్9ఎక్స్, జెడ్9ఎస్ ప్రో అనే ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఇక, iQOO Z9 Turbo+ స్మార్ట్‌ఫోన్ 6400 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుండటం విశేషం. సరే, ఓసారి […]

The post iQOO Z9 Turbo+: చైనాలో సెప్టెంబర్ 24న లాంచ్ అవుతోన్న ఐకూ కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • iQOO Z9 Turbo+ చైనా లాంచ్ తేదీ ఖరారు
  • సెప్టెంబర్ 24న విడుదల
  • డైమెన్సిటీ 9300+ చిప్సెట్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO నుంచి త్వరలో జెడ్9 సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. iQOO Z9 Turbo+ పేరుతో ఈ డివైజ్ విడుదల కానుంది. తాజాగా చైనా లాంచ్ తేదీని కంపెనీ కన్ఫర్మ్ చేసింది. కాగా, ఇప్పటికే జెడ్9 లైనప్ లో ఐకూ జెడ్9, జెడ్9ఎక్స్, జెడ్9ఎస్ ప్రో అనే ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఇక, iQOO Z9 Turbo+ స్మార్ట్‌ఫోన్ 6400 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుండటం విశేషం. సరే, ఓసారి ఈ ఫోన్ యొక్క చైనా లాంచ్ తేదీ మరియు ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

iQOO Z9 Turbo+ చైనా లాంచ్ తేదీ

iQOO Z9 Turbo+ స్మార్ట్‌ఫోన్ యొక్క చైనా లాంచ్ తేదీని కంపెనీ టీజర్ ద్వారా తెలియజేసింది.

సెప్టెంబర్ 24వ తేదీన iQOO Z9 Turbo+ చైనాలో లాంచ్ అవుతోంది. అదే రోజున డివైజ్ యొక్క ధర, సేల్ వివరాలు తెలుస్తాయి.

iQOO Z9 Turbo+ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ ప్రాసెసర్ తో లాంచ్ కానుందని ఐకూ సంస్థ వెల్లడించింది.

డైమెన్సిటీ 9300+ మీడియాటెక్ కంపెనీ యొక్క ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. ఈ చిప్ గేమింగ్ మరియు ఇతర టాస్కులను వేగంగా హ్యాండిల్ చేయగలదు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3.4 గిగాహెర్ట్జ్.

అంతేకాదు, iQOO Z9 Turbo+ డివైజ్ 6,400 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో వస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.

iQOO Z9 Turbo+ స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: iQOO Z9 Turbo+ లో 6.78-ఇంచ్ 1.5కే అమోలెడ్ స్క్రీన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్, 480 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+, డాల్బీ విజన్, 3840హెర్ట్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్, డీసీ డిమ్మింగ్ సపోర్ట్ ఉంటాయి.

స్టోరేజీ, ర్యామ్: iQOO Z9 Turbo+ డివైజ్ 12జిబి మరియు 16జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256జిబి మరియు 512జిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీతో లాంచ్ కానుంది.

కెమెరా: iQOO Z9 Turbo+ లో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా ఉంటుందని లీక్స్ ద్వారా తెలుస్తోంది. ఇందులో సోని ఎల్‌వైటీ-600 సెన్సర్ మరియు జీసీ08ఏ3 సెన్సర్ ను వాడే అవకాశం ఉంది. దీనికి తోడు ఒక 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ, చార్జింగ్: iQOO Z9 Turbo+ లో పవర్ బ్యాకప్ కోసం 6,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

సాఫ్ట్‌వేర్: iQOO Z9 Turbo+ డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 4 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: iQOO Z9 Turbo+ లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ వొల్టీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.4 ఉంటాయి.

ఇతర ఫీచర్లు: iQOO Z9 Turbo+ లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సర్, స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. భద్రత కోసం ఈ ఫోన్ ఐపీ64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ ప్రొటెక్షన్ రేటింగ్ తో వస్తోంది.

The post iQOO Z9 Turbo+: చైనాలో సెప్టెంబర్ 24న లాంచ్ అవుతోన్న ఐకూ కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/iqoo-z9-turbo-plus-china-launch-date-september-24/feed/ 0
Vivo X200 Series చైనా మార్కెట్ లాంచ్ తేదీ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/vivo-x200-series-china-launch-date-confirmed-know-full-details/ https://www.91mobiles.com/telugu/vivo-x200-series-china-launch-date-confirmed-know-full-details/#respond Sat, 14 Sep 2024 17:14:23 +0000 https://www.91mobiles.com/telugu/?p=13488 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో తన ఫ్లాగ్షిప్ సిరీస్ X200 ను లాంచ్ చేయనుంది. తొలుత చైనాలో ఈ సిరీస్ లాంచ్ కానుంది. తాజాగా చైనా లాంచ్ తేదీని వివో కంపెనీ ఖరారు చేసింది. అక్టోబర్ 14వ తేదీన Vivo X200 సిరీస్ చైనాలో విడుదల అవ్వనుందని అధికారికంగా కన్ఫర్మ్ అయ్యింది. ఇండియా లాంచ్ వివరాలు చైనా లాంచ్ తర్వాత తెలుస్తాయి. చైనా లాంచ్ తేదీ వివరాలతో పాటు, వివో ఎక్స్200 సిరీస్ యొక్క అంచనా […]

The post Vivo X200 Series చైనా మార్కెట్ లాంచ్ తేదీ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo X200 సిరీస్ విడుదల
  • లైనప్‌లో వస్తోన్న X200, X200 Pro
  • చైనా లాంచ్ తేదీ అక్టోబర్ 14

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో తన ఫ్లాగ్షిప్ సిరీస్ X200 ను లాంచ్ చేయనుంది. తొలుత చైనాలో ఈ సిరీస్ లాంచ్ కానుంది. తాజాగా చైనా లాంచ్ తేదీని వివో కంపెనీ ఖరారు చేసింది. అక్టోబర్ 14వ తేదీన Vivo X200 సిరీస్ చైనాలో విడుదల అవ్వనుందని అధికారికంగా కన్ఫర్మ్ అయ్యింది. ఇండియా లాంచ్ వివరాలు చైనా లాంచ్ తర్వాత తెలుస్తాయి. చైనా లాంచ్ తేదీ వివరాలతో పాటు, వివో ఎక్స్200 సిరీస్ యొక్క అంచనా స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం.

Vivo X200 సిరీస్ లాంచ్ తేదీ (చైనా)

Vivo X200 సిరీస్ లాంచ్ తేదీని వివో అధికారికంగా ప్రకటించింది. చైనాలోని బీజింగ్ నగరంలో అక్టోబర్ 14వ తేదీన వివో ఎక్స్200 సిరీస్ లాంచ్ అవుతోంది. సిరీస్ కు సంబంధించిన మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో వెల్లడవ్వనున్నాయి.

అయితే వివో ఎక్స్200 సిరీస్ లో ఏయే ఫోన్లు లాంచ్ కానున్నాయో వివో ఇంకా వెల్లడించలేదు. అయితే కనీసం రెండు ఫోన్లు లాంచ్ అవుతాయని అంచనా వేయవచ్చు. ఇందులో Vivo X200, X200 Pro ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. భారత్ లో 2025 జనవరిలో వివో ఎక్స్200 సిరీస్ లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.

Vivo X200 సిరీస్ స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: Vivo X200 లో 6.3-ఇంచ్ 120 హెర్ట్జ్ ఓఎల్ఈడీ ఎల్టీపీవో 1.5కే డిస్ప్లే ఉంటుందని రిపోర్ట్స్ ద్వారా తెలుస్తోంది. ప్రో మోడల్ లో 6.7 లేదా 6.8-ఇంచ్ 1.5కే 8టీ ఎల్టీపీవో మైక్రో-కర్వ్డ్ స్క్రీన్ ఉండే అవకాశం ఉంది.

చిప్సెట్: Vivo X200 సిరీస్ ఫోన్లలో మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్సెట్ ఉంటుందని సమాచారం.

కెమెరా: Vivo X200 లో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, ఒక అల్ట్రావైడ్ కెమెరా, ఒక 70ఎంఎం 3ఎక్స్ ఓఐఎస్ టెలీఫోటో లెన్స్ ఉంటాయి. వివో ఎక్స్200 ప్రో డివైజ్‌లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 200ఎంపి పెరిస్కోప్ టెలీఫోటో సెన్సర్ ఉంటాయి.

బ్యాటరీ, చార్జింగ్: Vivo X200 లో పవర్ బ్యాకప్ కోసం 5600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 90 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రావొచ్చు. మరోవైపు, ప్రో వేరియంట్ లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని తెలుస్తోంది.

ఇతర ఫీచర్లు: Vivo X200 సిరీస్ ఫోన్లు ఐపీ68 లేదా ఐపీ69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ ప్రొటెక్షన్, ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, అల్ట్రా-సోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్ తో రానున్నాయి.

The post Vivo X200 Series చైనా మార్కెట్ లాంచ్ తేదీ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-x200-series-china-launch-date-confirmed-know-full-details/feed/ 0
Vivo Y300 Pro 5G చైనా మార్కెట్ లాంచ్ తేదీ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/vivo-y300-pro-5g-china-market-launch-date-confirmed-know-full-details/ https://www.91mobiles.com/telugu/vivo-y300-pro-5g-china-market-launch-date-confirmed-know-full-details/#respond Wed, 28 Aug 2024 07:57:00 +0000 https://www.91mobiles.com/telugu/?p=13209 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో వై-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Vivo Y300 Pro 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తొలుత ఈ ఫోన్ చైనాలో లాంచ్ అవుతుంది. తర్వాత భారత్ సహా ఇతర మార్కెట్స్ లో లాంచ్ అవుతుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క చైనా లాంచ్ తేదీని వివో ప్రొడక్ట్ స్ట్రేటజీ వైస్ ప్రెసిడెంట్ రివీల్ చేశారు. సెప్టెంబర్ 5వ తేదీన చైనాలో Vivo […]

The post Vivo Y300 Pro 5G చైనా మార్కెట్ లాంచ్ తేదీ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Vivo Y300 Pro 5G లాంచ్ తేదీ ఖరారు
  • సెప్టెంబర్ 5న చైనాలో విడుదల
  • 6500 ఎంఏహెచ్ బ్యాటరీ, 80W చార్జింగ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో వై-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Vivo Y300 Pro 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తొలుత ఈ ఫోన్ చైనాలో లాంచ్ అవుతుంది. తర్వాత భారత్ సహా ఇతర మార్కెట్స్ లో లాంచ్ అవుతుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క చైనా లాంచ్ తేదీని వివో ప్రొడక్ట్ స్ట్రేటజీ వైస్ ప్రెసిడెంట్ రివీల్ చేశారు. సెప్టెంబర్ 5వ తేదీన చైనాలో Vivo Y300 Pro 5G లాంచ్ కానుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Vivo Y300 Pro 5G చైనా లాంచ్ తేదీ మరియు డిజైన్

Vivo Y300 Pro 5G స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ 5వ తేదీన చైనాలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ 7.69 మి.మీ మందంతో లాంచ్ అవ్వనుంది.

బ్యాక్ ప్యానెల్ పై భారీ సర్క్యులర్ కెమెరా మాడ్యూల్, రౌండ్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. కెమెరా మాడ్యూల్‌కి బటయ స్పెషల్ గోల్డెన్ రింగ్ కూడా ఉంది.

ఫోన్‌కి ముందువైపు కర్వ్డ్ ఎడ్జ్ స్క్రీన్ ఉంది. వాల్యూమ్ మరియు పవర్ బటన్స్ కుడివైపున ఉన్నాయి.

Vivo Y300 Pro 5G స్మార్ట్‌ఫోన్ టైటానియమ్, గోల్డ్ ఇన్‌లెయిడ్ జేడ్, మటన్ ఫ్యాట్ వైట్ మరియు జేడ్ బ్లాక్ కలర్స్ లో లభిస్తుంది.

Vivo Y300 Pro 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo Y300 Pro 5G లో 6.77-ఇంచ్ మైక్రో-క్వాడ్-కర్వ్డ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 5000 నిట్స్ బ్రైట్నెస్, బ్లూ లైట్ ఫిల్టరింగ్ టెక్నాలజీ, ఎస్జీఎస్ డ్రాప్ రెసిస్టన్స్, డస్ట్ అండ్ వాటర్ ప్రూఫ్ రేటింగ్ ఉంటాయి.

బ్యాటరీ: Vivo Y300 Pro 5G 6500ఎంఏహెచ్ బ్లూ ఓషన్ బ్యాటరీతో వస్తోంది. సింగిల్ చార్జ్ పై ఇది 12.1 గంటల గేమింగ్ టైమ్‌ని అందిస్తుంది. దీంతో పాటు, 80 వాట్ వైర్డ్ చార్జింగ్, వైర్లెస్ చార్జింగ్ మరియు రివర్స్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటాయి.

కెమెరా: Vivo Y300 Pro 5G లో 50ఎంపి ప్రైమరీ కెమెరా ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

ఇతర స్పెసిఫికేషన్స్: ఈ ఫోన్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై ఇటీవలె లిస్ట్ అయ్యింది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్, 12జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో ఈ ఫోన్ వస్తున్నట్లు గీక్‌బెంచ్ లిస్టింగ్ ద్వారా రివీల్ అయ్యింది.

The post Vivo Y300 Pro 5G చైనా మార్కెట్ లాంచ్ తేదీ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-y300-pro-5g-china-market-launch-date-confirmed-know-full-details/feed/ 0