
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో తన ఫ్లాగ్షిప్ సిరీస్ X200 ను లాంచ్ చేయనుంది. తొలుత చైనాలో ఈ సిరీస్ లాంచ్ కానుంది. తాజాగా చైనా లాంచ్ తేదీని వివో కంపెనీ ఖరారు చేసింది. అక్టోబర్ 14వ తేదీన Vivo X200 సిరీస్ చైనాలో విడుదల అవ్వనుందని అధికారికంగా కన్ఫర్మ్ అయ్యింది. ఇండియా లాంచ్ వివరాలు చైనా లాంచ్ తర్వాత తెలుస్తాయి. చైనా లాంచ్ తేదీ వివరాలతో పాటు, వివో ఎక్స్200 సిరీస్ యొక్క అంచనా స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం.
Vivo X200 సిరీస్ లాంచ్ తేదీ (చైనా)
Vivo X200 సిరీస్ లాంచ్ తేదీని వివో అధికారికంగా ప్రకటించింది. చైనాలోని బీజింగ్ నగరంలో అక్టోబర్ 14వ తేదీన వివో ఎక్స్200 సిరీస్ లాంచ్ అవుతోంది. సిరీస్ కు సంబంధించిన మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో వెల్లడవ్వనున్నాయి.
అయితే వివో ఎక్స్200 సిరీస్ లో ఏయే ఫోన్లు లాంచ్ కానున్నాయో వివో ఇంకా వెల్లడించలేదు. అయితే కనీసం రెండు ఫోన్లు లాంచ్ అవుతాయని అంచనా వేయవచ్చు. ఇందులో Vivo X200, X200 Pro ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. భారత్ లో 2025 జనవరిలో వివో ఎక్స్200 సిరీస్ లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.

Vivo X200 సిరీస్ స్పెసిఫికేషన్స్ (అంచనా)
డిస్ప్లే: Vivo X200 లో 6.3-ఇంచ్ 120 హెర్ట్జ్ ఓఎల్ఈడీ ఎల్టీపీవో 1.5కే డిస్ప్లే ఉంటుందని రిపోర్ట్స్ ద్వారా తెలుస్తోంది. ప్రో మోడల్ లో 6.7 లేదా 6.8-ఇంచ్ 1.5కే 8టీ ఎల్టీపీవో మైక్రో-కర్వ్డ్ స్క్రీన్ ఉండే అవకాశం ఉంది.
చిప్సెట్: Vivo X200 సిరీస్ ఫోన్లలో మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్సెట్ ఉంటుందని సమాచారం.
కెమెరా: Vivo X200 లో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, ఒక అల్ట్రావైడ్ కెమెరా, ఒక 70ఎంఎం 3ఎక్స్ ఓఐఎస్ టెలీఫోటో లెన్స్ ఉంటాయి. వివో ఎక్స్200 ప్రో డివైజ్‌లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 200ఎంపి పెరిస్కోప్ టెలీఫోటో సెన్సర్ ఉంటాయి.
బ్యాటరీ, చార్జింగ్: Vivo X200 లో పవర్ బ్యాకప్ కోసం 5600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 90 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రావొచ్చు. మరోవైపు, ప్రో వేరియంట్ లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని తెలుస్తోంది.
ఇతర ఫీచర్లు: Vivo X200 సిరీస్ ఫోన్లు ఐపీ68 లేదా ఐపీ69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ ప్రొటెక్షన్, ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, అల్ట్రా-సోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్ తో రానున్నాయి.











