
ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO నుంచి త్వరలో జెడ్9 సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. iQOO Z9 Turbo+ పేరుతో ఈ డివైజ్ విడుదల కానుంది. తాజాగా చైనా లాంచ్ తేదీని కంపెనీ కన్ఫర్మ్ చేసింది. కాగా, ఇప్పటికే జెడ్9 లైనప్ లో ఐకూ జెడ్9, జెడ్9ఎక్స్, జెడ్9ఎస్ ప్రో అనే ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఇక, iQOO Z9 Turbo+ స్మార్ట్‌ఫోన్ 6400 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుండటం విశేషం. సరే, ఓసారి ఈ ఫోన్ యొక్క చైనా లాంచ్ తేదీ మరియు ఫీచర్ల గురించి తెలుసుకుందాం.
iQOO Z9 Turbo+ చైనా లాంచ్ తేదీ
iQOO Z9 Turbo+ స్మార్ట్‌ఫోన్ యొక్క చైనా లాంచ్ తేదీని కంపెనీ టీజర్ ద్వారా తెలియజేసింది.
సెప్టెంబర్ 24వ తేదీన iQOO Z9 Turbo+ చైనాలో లాంచ్ అవుతోంది. అదే రోజున డివైజ్ యొక్క ధర, సేల్ వివరాలు తెలుస్తాయి.
iQOO Z9 Turbo+ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ ప్రాసెసర్ తో లాంచ్ కానుందని ఐకూ సంస్థ వెల్లడించింది.
డైమెన్సిటీ 9300+ మీడియాటెక్ కంపెనీ యొక్క ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. ఈ చిప్ గేమింగ్ మరియు ఇతర టాస్కులను వేగంగా హ్యాండిల్ చేయగలదు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3.4 గిగాహెర్ట్జ్.
అంతేకాదు, iQOO Z9 Turbo+ డివైజ్ 6,400 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో వస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.

iQOO Z9 Turbo+ స్పెసిఫికేషన్స్ (అంచనా)
డిస్ప్లే: iQOO Z9 Turbo+ లో 6.78-ఇంచ్ 1.5కే అమోలెడ్ స్క్రీన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్, 480 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+, డాల్బీ విజన్, 3840హెర్ట్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్, డీసీ డిమ్మింగ్ సపోర్ట్ ఉంటాయి.
స్టోరేజీ, ర్యామ్: iQOO Z9 Turbo+ డివైజ్ 12జిబి మరియు 16జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256జిబి మరియు 512జిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీతో లాంచ్ కానుంది.
కెమెరా: iQOO Z9 Turbo+ లో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా ఉంటుందని లీక్స్ ద్వారా తెలుస్తోంది. ఇందులో సోని ఎల్‌వైటీ-600 సెన్సర్ మరియు జీసీ08ఏ3 సెన్సర్ ను వాడే అవకాశం ఉంది. దీనికి తోడు ఒక 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
బ్యాటరీ, చార్జింగ్: iQOO Z9 Turbo+ లో పవర్ బ్యాకప్ కోసం 6,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.
సాఫ్ట్‌వేర్: iQOO Z9 Turbo+ డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 4 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
కనెక్టివిటీ: iQOO Z9 Turbo+ లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ వొల్టీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.4 ఉంటాయి.
ఇతర ఫీచర్లు: iQOO Z9 Turbo+ లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సర్, స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. భద్రత కోసం ఈ ఫోన్ ఐపీ64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ ప్రొటెక్షన్ రేటింగ్ తో వస్తోంది.











