First Sale - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 09 Oct 2024 06:14:38 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Lava Agni 3 5G ఫస్ట్ సేల్ ప్రారంభం, ధర, ఆఫర్లు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/lava-agni-3-5g-first-sale-begins-know-price-and-offers/ https://www.91mobiles.com/telugu/lava-agni-3-5g-first-sale-begins-know-price-and-offers/#respond Wed, 09 Oct 2024 06:13:39 +0000 https://www.91mobiles.com/telugu/?p=14023 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava ఇటీవలె అగ్ని సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Lava Agni 3 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. డ్యూయల్ డిస్ప్లేతో రావడం ఈ ఫోన్ ప్రత్యేకత. నేటి నుంచి ఈ ఫోన్ యొక్క అఫీషియల్ సేల్ మొదలైంది. మరి, లావా అగ్ని 3 5జీ ఫోన్ ధర, ఆఫర్లు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందామా? Lava Agni 3 5G […]

The post Lava Agni 3 5G ఫస్ట్ సేల్ ప్రారంభం, ధర, ఆఫర్లు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఇటీవలె లాంచైన Lava Agni 3 5G
  • నేటి నుంచి అమెజాన్ లో సేల్
  • ప్రారంభ ధర రూ.20,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava ఇటీవలె అగ్ని సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Lava Agni 3 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. డ్యూయల్ డిస్ప్లేతో రావడం ఈ ఫోన్ ప్రత్యేకత. నేటి నుంచి ఈ ఫోన్ యొక్క అఫీషియల్ సేల్ మొదలైంది. మరి, లావా అగ్ని 3 5జీ ఫోన్ ధర, ఆఫర్లు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందామా?

Lava Agni 3 5G ఆఫర్లు మరియు ధర

Lava Agni 3 5G స్మార్ట్‌ఫోన్ భారత్ లో రూ.20,999 ధరతో లాంచ్ అయ్యింది. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ రూ.20,999 చార్జర్ లేకుండా విక్రయించబడనుంది. చార్జర్ తో కావాలంటే రూ.22,999 చెల్లించాలి. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర చార్జర్ తో రూ.24,999 గా ఉంది.

ఆఫర్ల విషయానికి వస్తే, బ్యాంక్ ఆఫర్ తో బేస్ వేరియంట్ పై చార్జర్ లేకుండా రూ.1,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఇతర వేరియంట్స్ పై చార్జర్‌తో వరుసగా రూ.2,000 మరియు రూ.2,500 డిస్కౌంట్ పొందవచ్చు. ఎస్బీఐ క్రెడిట్, డెబిట్ కార్డ్స్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ పై ఈ డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుంది.

Lava Agni 3 5G స్మార్ట్‌ఫోన్ హీదర్ గ్లాస్ మరియు ప్రిస్టిన్ గ్లాస్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

ఆఫర్ ధర

  • 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ: రూ.19,999 (చార్జర్ లేకుండా)
  • 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ: రూ.20,999 (చార్జర్‌తో)
  • 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ: రూ.22,499

ఈఎంఐ మరియు ఇతర ఆఫర్లు

  • మీరు గనుక, లావా అగ్ని 3 5జీ ఫోన్‌ని ఈఎంఐ ద్వారా కొనుగోలు చేయాలనుకుంటే నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ అందుబాటులో ఉంది. 3 నుంచి 6 నెలల కాలపరిమితితో ఈ ఆప్షన్ ఎంచుకోవచ్చు.
  • ఎక్స్‌చేంజ్ ఆఫర్‌లో భాగంగా, మీరు రూ.23,000 వరకు పూర్తి డిస్కౌంట్ పొందవచ్చు. అయితే, మీ పాత ఫోన్ స్థితిని బట్టి ఈ విలువ ఆధారపడి ఉంటుంది.
  • మీరు అమెజాన్ ప్రైమ్ కస్టమర్ అయి ఉండి, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వాడుతున్నట్లయితే, మీకు 5 శాతం అదనపు క్యాష్‌బ్యాక్ వస్తుంది.

లావా అగ్ని 3 5జీ ఫోన్‌ని ఎక్కడ కొనాలి?

Lava Agni 3 5G స్మార్ట్‌ఫోన్‌ని అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. క్రింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోండి. ఇంకా ఈ ఫోన్ ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్ లో కూడా అమ్మకానికి అందుబాటులో ఉంది.

అమెజాన్ లింక్

Lava Agni 3 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Lava Agni 3 5G లో 6.78-ఇంచ్ 1.5కే 3డీ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1.74-ఇంచ్ అమోలెడ్ రియర్ స్క్రీన్ ఉన్నాయి.

ప్రాసెసర్: Lava Agni 3 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300ఎక్స్ చిప్సెట్ వాడారు. ఇది అద్భుతమైన అనుభూతిని అందించేందుకు బాగా సరిపోతుంది.

ర్యామ్, స్టోరేజీ: Lava Agni 3 5G డివైజ్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. 8జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ కూడా ఉంది.

కెమెరా: Lava Agni 3 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్+ఈఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి 3ఎక్స్ ఓఐఎస్+ఈఐఎస్ టెలీఫోటో కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఈఐఎస్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ, చార్జింగ్: Lava Agni 3 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Lava Agni 3 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తుంది. రెండు మేజర్ ఓఎస్ అప్డేట్స్, 4 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి.

ఇతర ఫీచర్లు: Lava Agni 3 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.4, వై-ఫై 6ఈ, 14 5జీ బ్యాండ్స్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, డాల్బీ అట్మాస్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్, నావిక్ జీపీఎస్ సిస్టమ్, ఐపీ64 రేటింగ్ ఉన్నాయి.

The post Lava Agni 3 5G ఫస్ట్ సేల్ ప్రారంభం, ధర, ఆఫర్లు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/lava-agni-3-5g-first-sale-begins-know-price-and-offers/feed/ 0
Motorola Razr 50 సేల్ ప్రారంభం, రూ.15,000 డిస్కౌంట్, ఆఫర్ వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/motorola-razr-50-first-sale-begins-with-rs-15000-discount-know-offer-details/ https://www.91mobiles.com/telugu/motorola-razr-50-first-sale-begins-with-rs-15000-discount-know-offer-details/#respond Fri, 20 Sep 2024 07:08:00 +0000 https://www.91mobiles.com/telugu/?p=13645 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola ఇటీవలె రేజర్ సిరీస్ లో కొత్త్ ఫ్లిప్ ఫోన్ లాంచ్ చేసింది. Motorola Razr 50 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. నేడు Motorola Razr 50 సేల్ కి వచ్చింది. ఫస్ట్ సేల్ లో ఈ ఫోన్ పై రూ.15,000 వరకు డిస్కౌంట్ ఆఫర్ లభిస్తోంది. దీంతో సరికొత్త మోటోరోలా ఫ్లిప్ ఫోన్ ని తక్కువ ధరకే సొంతం చేసుకునే అవకాశం యూజర్లకు వచ్చింది. […]

The post Motorola Razr 50 సేల్ ప్రారంభం, రూ.15,000 డిస్కౌంట్, ఆఫర్ వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు Motorola Razr 50 ఫస్ట్ సేల్
  • చవకగా లభిస్తోన్న Motorola Razr 50
  • రూ.15,000 వరకు డిస్కౌంట్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola ఇటీవలె రేజర్ సిరీస్ లో కొత్త్ ఫ్లిప్ ఫోన్ లాంచ్ చేసింది. Motorola Razr 50 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. నేడు Motorola Razr 50 సేల్ కి వచ్చింది. ఫస్ట్ సేల్ లో ఈ ఫోన్ పై రూ.15,000 వరకు డిస్కౌంట్ ఆఫర్ లభిస్తోంది. దీంతో సరికొత్త మోటోరోలా ఫ్లిప్ ఫోన్ ని తక్కువ ధరకే సొంతం చేసుకునే అవకాశం యూజర్లకు వచ్చింది. ఓసారి ఆఫర్ వివరాలను తెలుసుకుందాం పదండి.

Motorola Razr 50 సేల్, ఆఫర్లు మరియు ధర

Motorola Razr 50 పై రూ.10,000 స్పెషల్ బ్యాంక్ డిస్కౌంట్‌ను మోటోరోలా కంపెనీ ఫస్ట్ సేల్ సందర్భంగా అనౌన్స్‌ చేసింది.

బ్యాంక్ ఆఫర్ తో పాటు, రూ.5,000 కూపన్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. అంటే Motorola Razr 50 పై మొత్తంగా రూ.15,000 డిస్కౌంట్ లభిస్తుందన్నమాట.

పైన పేర్కొన్న ఆఫర్లతో కలుపుకుంటే Motorola Razr 50 ని రూ.49,999 కే కొనుగోలు చేయవచ్చు.

బ్యాంక్ డిస్కౌంట్ వివరాలను చూస్తే, ఎస్బీఐ కార్డ్ పై రూ.10,000 డిస్కౌంట్ లభిస్తుంది.

నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. దీని సాయంతో 3 నుంచి 18 నెలల కాలపరిమితితో ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు.

ఆఫర్లు లేకుండా, Motorola Razr 50 ఫ్లిప్ ఫోన్ యొక్క 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.64,999 గా ఉంది.

Motorola Razr 50 ని ఎక్కడ కొనాలి?

Motorola Razr 50 ఫ్లిప్ ఫోన్ కొనేందుకు మీరు ఈ-కామర్స్ వేదిక అమెజాన్ ను విజిట్ చేయాలి. ఇంకా ఈ ఫోన్ మోటోరోలా వెబ్‌సైట్ మరియు ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో కూడా కొనుగోలు చేయవచ్చు.

అమెజాన్ లింక్

Motorola Razr 50 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Motorola Razr 50 లో 6.9-ఇంచ్ పీఓఎల్ఈడీ స్క్రీన్, ఫుల్‌హెచ్డీ+ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+, 3000 నిట్స్ పీబక్ బ్రైట్నెస్, 3.63-ఇంచ్ ఓఎల్ఈడీ ఫుల్‌హెచ్డీ+ ఓఎల్ఈడీ కవర్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10, 1700 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ ఉన్నాయి.

ప్రాసెసర్: Motorola Razr 50 లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300ఎక్స్ చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ615 ఎంసీ2 జీపీయూ వినియోగించారు.

మెమొరీ: Motorola Razr 50 డివైజ్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, ర్యామ్ బూస్ట్ 3.0 ఫీచర్ తో వచ్చింది. మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ లేదు.

కెమెరా: Motorola Razr 50 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఇచ్చారు. ఇందులో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్/మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్పీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Motorola Razr 50 లో పవర్ బ్యాకప్ కోసం 4200 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Motorola Razr 50 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యింది. 3 ఏళ్ళు ఓఎస్ అప్డేట్స్, 4 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్‌కి లభిస్తాయి.

ఇతర ఫీచర్లు: Motorola Razr 50 డివైజ్ ఐపీఎక్స్8 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, డ్యూయల్ స్టీరియో స్పీకర్ సెటప్, డాల్బీ అట్మాస్, బ్లూటూత్ 5.4, సైడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post Motorola Razr 50 సేల్ ప్రారంభం, రూ.15,000 డిస్కౌంట్, ఆఫర్ వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/motorola-razr-50-first-sale-begins-with-rs-15000-discount-know-offer-details/feed/ 0
Vivo T3 Ultra 5G సేల్ ప్రారంభం, రూ.3,000 వరకు డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/vivo-t3-ultra-5g-sale-begins-discount-offers-up-to-rs-3000-know-full-details/ https://www.91mobiles.com/telugu/vivo-t3-ultra-5g-sale-begins-discount-offers-up-to-rs-3000-know-full-details/#respond Thu, 19 Sep 2024 11:33:09 +0000 https://www.91mobiles.com/telugu/?p=13610 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo గత వారం భారతీయ మార్కెట్ లో T3 Ultra 5G అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ యొక్క సేల్ నేటి (సెప్టెంబర్ 19) నుంచి మొదలైంది. ఫస్ట్ సేల్ లో భాగంగా ఈ ఫోన్ పై కంపెనీ స్పెషల్ ఆఫర్లను అందిస్తోంది. దీంతో కస్టమర్లు రూ.3,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఓసారి డిస్కౌంట్ ఆఫర్ వివరాలు, ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. Vivo […]

The post Vivo T3 Ultra 5G సేల్ ప్రారంభం, రూ.3,000 వరకు డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేటి నుంచి వివో టీ3 అల్ట్రా సేల్
  • రూ.3,000 వరకు డిస్కౌంట్
  • ప్రారంభ ధర రూ.28,999

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo గత వారం భారతీయ మార్కెట్ లో T3 Ultra 5G అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ యొక్క సేల్ నేటి (సెప్టెంబర్ 19) నుంచి మొదలైంది. ఫస్ట్ సేల్ లో భాగంగా ఈ ఫోన్ పై కంపెనీ స్పెషల్ ఆఫర్లను అందిస్తోంది. దీంతో కస్టమర్లు రూ.3,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఓసారి డిస్కౌంట్ ఆఫర్ వివరాలు, ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Vivo T3 Ultra 5G ధర, ఆఫర్ వివరాలు

Vivo T3 Ultra 5G స్మార్ట్‌ఫోన్ నేడు రాత్రి 7 గంటల నుంచి కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది. కస్టమర్లకు ఫ్లాట్ డిస్కౌంట్ లేదా ఎక్స్‌చేంజ్ బోనస్ రూ.3,000 వరకు లభించనుంది. ఈ డిస్కౌంట్ అన్ని వేరియంట్స్ కు వర్తిస్తుంది. ఫ్లాట్ డిస్కౌంట్ కేవలం హెచ్డీఎఫ్‌సీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులపై మాత్రమే అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పై 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అయితే రెండింట్లో ఏదైనా ఒక కార్డ్ ఆఫర్ ను మాత్రమే మీరు పొందవచ్చు.

Vivo T3 Ultra 5G ఫోన్‌ని హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పై నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ తో కూడా కొనుగోలు చేయవచ్చు. 3 నుంచి 6 నెలల కాలపరిమితిని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ ఆప్షన్ ద్వారా రూ.1,500 వరకు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

ఈ బ్యాంక్ ఆఫర్ తో, Vivo T3 Ultra 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ మీకు రూ.28,999 కే లభిస్తుంది.

8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మిడ్ వేరియంట్‌ను రూ.30,999 కి, 12జిబి+256జిబి టాప్ మోడల్‌ను రూ.32,999 కి కొనుగోలు చేయవచ్చు.

Vivo T3 Ultra 5G స్మార్ట్‌ఫోన్‌ని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్ పై పైన పేర్కొనబడిన అన్ని ఆఫర్లతో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్ లో కూడా అందుబాటులో ఉంటుంది.

ఫ్లిప్‌కార్ట్ లింక్

Vivo T3 Ultra 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo T3 Ultra లో 6.78-ఇంచ్ 3డీ కర్వ్డ్ 1.5కే అమోలెడ్ స్క్రీన్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పీ3 సినిమా గ్రేడ్ కలర్ గ్యామట్, 8000000:1 కాంట్రాస్ట్ రేషియో, హెచ్డీఆర్ 10+ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo T3 Ultra లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. 91మొబైల్స్ చేసిన టెస్ట్ లో అంటుటు స్కోర్ 14,45,926 గా ఉంది. అయితే వివో మాత్రం, అంటుటు ప్లాట్ఫామ్ పై స్కోర్ 16,09,257 గా నమోదైందని తెలిపింది.

ర్యామ్, స్టోరేజీ: Vivo T3 Ultra స్మార్ట్‌ఫోన్ 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. ఈ ఫోన్ లో 12జిబి వర్చువల్ ర్యామ్ కూడా ఉంటుంది. దీంతో యూజర్‌కి గరిష్టంగా 24జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Vivo T3 Ultra లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్921 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి గ్రూప్ సెల్ఫీ కెమెరా ఉంది. ఇది ఆటోఫోకస్, ఏఐ ఫేసియల్ కలరింగ్ టెక్నాలజీతో వచ్చింది.

బ్యాటరీ, చార్జింగ్: Vivo T3 Ultra లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Vivo T3 Ultra లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై 6 వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Vivo T3 Ultra డివైజ్ ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post Vivo T3 Ultra 5G సేల్ ప్రారంభం, రూ.3,000 వరకు డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-t3-ultra-5g-sale-begins-discount-offers-up-to-rs-3000-know-full-details/feed/ 0
Realme Narzo 70 Turbo 5G సేల్ ప్రారంభం, డిస్కౌంట్ ఆఫర్ వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/realme-narzo-70-turbo-5g-india-sale-and-discount-offer/ https://www.91mobiles.com/telugu/realme-narzo-70-turbo-5g-india-sale-and-discount-offer/#respond Mon, 16 Sep 2024 08:23:45 +0000 https://www.91mobiles.com/telugu/?p=13499 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నార్జో సిరీస్ లో Narzo 70 Turbo 5G అనే స్మార్ట్‌ఫోన్‌ని కొన్ని రోజుల క్రితం లాంచ్ చేసింది. సెప్టెంబర్ 16వ తేదీ నుంచి ఈ ఫోన్ సేల్ ప్రారంభమైంది. ఆఫర్ లో భాగంగా, ఈ ఫోన్ కేవలం రూ.14,999 కే లభించనుంది. ఇకపోతే, ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్సెట్, 26జిబి వరకు ర్యామ్ పవర్, 50ఎంపి కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లతో వచ్చింది. […]

The post Realme Narzo 70 Turbo 5G సేల్ ప్రారంభం, డిస్కౌంట్ ఆఫర్ వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేటి ప్రారంభమైన Narzo 70 Turbo 5G సేల్
  • రూ.2,000 కూపన్ డిస్కౌంట్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నార్జో సిరీస్ లో Narzo 70 Turbo 5G అనే స్మార్ట్‌ఫోన్‌ని కొన్ని రోజుల క్రితం లాంచ్ చేసింది. సెప్టెంబర్ 16వ తేదీ నుంచి ఈ ఫోన్ సేల్ ప్రారంభమైంది. ఆఫర్ లో భాగంగా, ఈ ఫోన్ కేవలం రూ.14,999 కే లభించనుంది. ఇకపోతే, ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్సెట్, 26జిబి వరకు ర్యామ్ పవర్, 50ఎంపి కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లతో వచ్చింది. ఓసారి ఈ ఫోన్ ధర, ఆఫర్లు మరియు స్పెసిఫికేషన్లు తెలుసుకుందాం.

Realme Narzo 70 Turbo 5G ధర మరియు ఆఫర్లు

Realme Narzo 70 Turbo 5G డివైజ్ మూడు స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.16,999 గా పెట్టారు. రూ.2,000 కూపన్ డిస్కౌంట్ తర్వాత ఇది రూ.14,999 కే లభించనుంది.

8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మిడ్ వేరియంట్ ధరను రూ.17,999 గా నిర్ణయించగా, ఇన్‌స్టంట్ కూపన్ డిస్కౌంట్ రూ.2,000 తో ఈ ఫోన్ రూ.15,999 కే లభించనుంది.

12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ రూ.20,999 తో లాంచ్ కాగా, ఇది ఆఫర్ లో రూ.18,999 కి లభించనుంది.

Realme Narzo 70 Turbo 5G స్మార్ట్‌ఫోన్‌ని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్, రియల్మీ.కామ్ మరియు ఇతర రిటైల్ ప్లాట్ఫామ్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Realme Narzo 70 Turbo 5G డివైజ్ టర్బో యెల్లో, టర్బో పర్పుల్, టర్బో గ్రీన్ కలర్స్ లో అందుబాటులో ఉంది.

Realme Narzo 70 Turbo 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Realme Narzo 70 Turbo 5G లో 6.67-ఇంచ్ శాంసంగ్ ఈ4 ఓఎల్ఈడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 106 పర్సెంట్ ఎన్టీఎస్‌సీ కలర్ గ్యామట్, 600 నిట్స్ నార్మల్, 1200 నిట్స్ హై బ్రైట్నెస్, ఏజీ డీటీ స్టార్ 2 గ్లాస్ ప్రొటెక్షన్ ఉన్నాయి.

ప్రాసెసర్: Realme Narzo 70 Turbo 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్సెట్ ఉంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. మాలి జీ615 జీపీయూ గ్రాఫిక్స్ ఈ ఫోన్ లో అందించారు. వీసీ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది. అంటుటు బెంచ్ మార్క్ స్కోర్ 7,50,000 కి పైగా ఉంది.

ర్యామ్, స్టోరేజీ: Realme Narzo 70 Turbo 5G డివైజ్ 6జిబి/8జిబి/12జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లో 14జిబి వరకు డైనమిక్ ర్యామ్ ఆప్షన్ ఉంది. దీంతో యూజర్లకు గరిష్టంగా 26జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది. ఒకేసారి 32 యాప్స్‌ని వాడుకోవచ్చని కంపెనీ చెబుతోంది.

కెమెరా: Realme Narzo 70 Turbo 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ, చార్జింగ్: Realme Narzo 70 Turbo 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్ అల్ట్రా ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. కేవలం 30 నిమిషాల్లో ఫోన్ 50 శాతం చార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది.

సాఫ్ట్‌వేర్: Realme Narzo 70 Turbo 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్, 2 ఏళ్ళు ఓఎస్ అప్డేట్స్ ఈ ఫోన్‌కి లభిస్తాయి.

కనెక్టివిటీ: Realme Narzo 70 Turbo 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.4, వై-ఫై 6 ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Realme Narzo 70 Turbo 5G లో ఐపీ65 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, రెయిన్‌వాటర్ టచ్ ఫీచర్, డ్యూయల్ స్టీరియో స్పీకర్, ఎయిర్ జెశ్చర్, ఫ్లాష్ క్యాప్సూల్, రీడింగ్ మోడ్, ఏఐ ఫీచర్లు ఉన్నాయి.

The post Realme Narzo 70 Turbo 5G సేల్ ప్రారంభం, డిస్కౌంట్ ఆఫర్ వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-narzo-70-turbo-5g-india-sale-and-discount-offer/feed/ 0
Vivo T3 Pro 5G: నేడే ఫస్ట్ సేల్.. ధర, ఆఫర్ వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/vivo-t3-pro-5g-first-sale-from-today-know-the-price-offers/ https://www.91mobiles.com/telugu/vivo-t3-pro-5g-first-sale-from-today-know-the-price-offers/#respond Tue, 03 Sep 2024 09:31:13 +0000 https://www.91mobiles.com/telugu/?p=13318 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo గత నెలలో టీ3 సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Vivo T3 Pro 5G పేరుతో వచ్చిన ఈ ఫోన్ యొక్క సేల్ నేడు (సెప్టెంబర్ 3) న మొదలైంది. వివో టీ3 ప్రో 5జీ ఫోన్‌ని ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఫస్ట్ సేల్‌లో భాగంగా, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్‌చేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఓసారి Vivo T3 Pro 5G యొక్క […]

The post Vivo T3 Pro 5G: నేడే ఫస్ట్ సేల్.. ధర, ఆఫర్ వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు Vivo T3 Pro 5G ఫస్ట్ సేల్
  • 12 గంటలకు సేల్ ప్రారంభం
  • స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo గత నెలలో టీ3 సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Vivo T3 Pro 5G పేరుతో వచ్చిన ఈ ఫోన్ యొక్క సేల్ నేడు (సెప్టెంబర్ 3) న మొదలైంది. వివో టీ3 ప్రో 5జీ ఫోన్‌ని ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఫస్ట్ సేల్‌లో భాగంగా, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్‌చేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఓసారి Vivo T3 Pro 5G యొక్క ధర, స్పెసిఫికేషన్స్ మరియు ఆఫర్ వివరాలు తెలుసుకుందాం.

Vivo T3 Pro 5G ధర, ఆఫర్లు

Vivo T3 Pro 5G స్మార్ట్‌ఫోన్ యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.24,999 గా పెట్టారు. 8జిబి + 256జిబి మోడల్ ధరు రూ.26,999 గా నిర్ణయించారు.

Vivo T3 Pro 5G స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా వెబ్‌సైట్ మరియు ఇతర రిటైల్ స్టోర్స్ ద్వారా కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది.

సెప్టెంబర్ 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి Vivo T3 Pro 5G సేల్ ప్రారంభమైంది.

Vivo T3 Pro 5G పై లాంచ్ డిస్కౌంట్ కూడా ఉంది. హెచ్డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్స్ యూజర్లకు రూ.3,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.

ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ పై 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్ తో పాటు, రూ.3,000 వరకు ఎక్స్‌చేంజ్ బోనస్ లభిస్తుంది. 3 నుంచి 6 నెలల కాలపరిమితితో ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.

Vivo T3 Pro 5G స్మార్ట్‌ఫోన్ శాండ్‌స్టోన్ ఆరెంజ్ మరియు ఎమరాల్డ్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Vivo T3 Pro 5G బేస్ మోడల్ లాంచ్ ధర రూ.24,999 కాగా, బ్యాంక్ ఆఫర్ తో రూ.21,999 కే సొంతం చేసుకోవచ్చు. టాప్ మోడల్ లాంచ్ ధర రూ.26,999 కాగా, బ్యాంక్ ఆఫర్ తో రూ.23,999 కే లభిస్తుంది.

Vivo T3 Pro 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo T3 Pro 5G లో 6.77-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, 3డీ కర్వ్డ్ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 100% డీసీఐ-పీ3 కలర్ గ్యామట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 387 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo T3 Pro 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని అంటుటు స్కోర్ 812119 పాయింట్లుగా ఉంది. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 720 జీపీయూ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: Vivo T3 Pro 5G డివైజ్ 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఫీచర్ సాయంతో 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Vivo T3 Pro 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్882 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ, చార్జింగ్: Vivo T3 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

సాఫ్ట్‌వేర్: Vivo T3 Pro 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ తో లాంచ్ అయ్యింది. రెండేళ్ళు మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్‌కి లభిస్తాయి.

కనెక్టివిటీ: Vivo T3 Pro 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Vivo T3 Pro 5G లో లిక్విడ్ కూలింగ్ సిస్టమ్, అల్ట్రా గేమ్ మోడ్, 4డీ గేమ్ వైబ్రేషన్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, వెట్ టచ్ టెక్నాలజీ, ఐపీ64 ప్రొటెక్షన్ ఉన్నాయి.

The post Vivo T3 Pro 5G: నేడే ఫస్ట్ సేల్.. ధర, ఆఫర్ వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-t3-pro-5g-first-sale-from-today-know-the-price-offers/feed/ 0
First Sale: నేడే OnePlus 11, OnePlus Buds Pro 2 ఫస్ట్ సేల్ https://www.91mobiles.com/telugu/oneplus-11-5g-oneplus-buds-pro-2-india-first-sale-today-via-amazon/ Tue, 14 Feb 2023 05:09:32 +0000 https://www.91mobiles.com/telugu/?p=4906 గతవారం జరిగిన క్లౌడ్ 11 ఈవెంట్ లో ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ OnePlus తన ఫ్లాగ్షిప్ డివైజ్ OnePlus 11 తో పాటు బడ్స్ ప్రో 2, వన్‌ప్లస్ 11ఆర్ ని భారత్ లో లాంచ్ చేసింది. వీటి నుంచి నేడు OnePlus 11 మరియు OnePlus Buds Pro 2 సేల్ కి వచ్చాయి. OnePlus 11 డివైజ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ తో వచ్చింది. భారత్ లో OnePlus […]

The post First Sale: నేడే OnePlus 11, OnePlus Buds Pro 2 ఫస్ట్ సేల్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో నేడు ఫస్ట్ సేల్ కి వచ్చిన OnePlus 11, OnePlus Buds Pro 2
  • భారత్ లో OnePlus 11 ధర రూ.56,999, OnePlus Buds Pro 2 ధర రూ.11,999
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ తో వచ్చిన OnePlus 11 స్మార్ట్ ఫోన్

గతవారం జరిగిన క్లౌడ్ 11 ఈవెంట్ లో ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ OnePlus తన ఫ్లాగ్షిప్ డివైజ్ OnePlus 11 తో పాటు బడ్స్ ప్రో 2, వన్‌ప్లస్ 11ఆర్ ని భారత్ లో లాంచ్ చేసింది. వీటి నుంచి నేడు OnePlus 11 మరియు OnePlus Buds Pro 2 సేల్ కి వచ్చాయి. OnePlus 11 డివైజ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ తో వచ్చింది.

భారత్ లో OnePlus 11, OnePlus Buds Pro 2 ధర, లాంచ్ ఆఫర్స్, లభ్యత

OnePlus 11 హ్యాండ్సెట్ 8జిబి + 128జిబి వేరియంట్ ధర రూ.56,999 గా ఉంది. 16జిబి + 256జిబి యూనిట్ ధర రూ.61,999 గా ఉంది. లాంచ్ ఆఫర్ లో భాగంగా వన్‌ప్లస్ సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ (ఈఎంఐ, నాన్-ఈఎంఐ) మరియు డెబిట్ కార్డ్ (ఈఎంఐ) లావాదేవీలపై రూ.1,000 డిస్కౌంట్ అందిస్తోంది.

నేడు అనగా ఫిబ్రవరి 14 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్ మరియు వన్ ప్లస్ స్టోర్ ద్వారా OnePlus 11 సేల్ మొదలవుతుంది.

భారత్ లో OnePlus Buds Pro 2 ధరను రూ.11,999 గా నిర్ణయించారు. లాంచ్ ఆఫర్ లో భాగంగా వన్‌ప్లస్ సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ (ఈఎంఐ, నాన్-ఈఎంఐ) మరియు డెబిట్ కార్డ్ (ఈఎంఐ) లావాదేవీలపై రూ.500 డిస్కౌంట్ అందిస్తోంది. నేడు అనగా ఫిబ్రవరి 14 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్, ఫ్లిప్ కార్ట్ మరియు వన్‌ప్లస్ స్టోర్ ద్వారా OnePlus Buds Pro 2 ని కొనుగోలు చేయవచ్చు.

OnePlus 11 స్పెసిఫికేషన్స్

OnePlus 11 5G డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 మెయిన్ సెన్సర్, 32ఎంపి సోని ఐఎంఎక్స్709 టెలీఫోటో లెన్స్, 48ఎంపి సోని ఐఎంఎక్స్581 అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి సోని ఐఎంఎక్స్471 సెన్సర్ ఉన్నాయి. వన్‌ప్లస్ కెమెరా విభాగం కోసం హేజల్‌బ్లడ్ తో కలిసి పని చేసింది.

OnePlus 11 5G స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో లాంచైంది. ఈ డివైజ్ లో 6.7-ఇంచ్ క్యూహెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 16జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ ఉన్నాయి. యూఎఫ్ఎస్4.0 స్టోరేజీ, ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ టెక్నాలజీని ఈ ఫోన్ లో అందించారు.

OnePlus 11 5G స్మార్ట్ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 100 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ డివైజ్ లో వై-ఫై 7, డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ ఎల్టీఈ, జీపీఎస్, బ్లూటూత్ 5.3 వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post First Sale: నేడే OnePlus 11, OnePlus Buds Pro 2 ఫస్ట్ సేల్ first appeared on 91Mobiles Telugu.

]]>
First Sale: ఫ్లిప్‌కార్ట్ ద్వారా Redmi Note 12 Pro 5G, Note 12 Pro+ 5G ఫోన్ల విక్రయం https://www.91mobiles.com/telugu/redmi-note-12-pro-pro-plus-first-sale-today-bank-offers/ Wed, 11 Jan 2023 10:50:53 +0000 https://www.91mobiles.com/telugu/?p=4429 హైలైట్స్ మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్ తో వచ్చిన Redmi Note 12 Pro సిరీస్ స్మార్ట్ ఫోన్స్ Redmi Note 12 Pro సిరీస్ ఫోన్లకు రెండేళ్ళ పాటు ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్స్ హామీనిచ్చిన షావోమి భారత్ లో ఇప్పటివరకు లాంచ్ అయిన ఖరీదైన రెడ్మీ నోట్ మోడల్ Redmi Note 12 Pro+ 5G రెడ్మీ లవర్స్ కోసం షావోమి సంస్థ నోట్ సిరీస్ లో భాగంగా Redmi Note 12 సిరీస్ ని ఇటీవలె […]

The post First Sale: ఫ్లిప్‌కార్ట్ ద్వారా Redmi Note 12 Pro 5G, Note 12 Pro+ 5G ఫోన్ల విక్రయం first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్ తో వచ్చిన Redmi Note 12 Pro సిరీస్ స్మార్ట్ ఫోన్స్
  • Redmi Note 12 Pro సిరీస్ ఫోన్లకు రెండేళ్ళ పాటు ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్స్ హామీనిచ్చిన షావోమి
  • భారత్ లో ఇప్పటివరకు లాంచ్ అయిన ఖరీదైన రెడ్మీ నోట్ మోడల్ Redmi Note 12 Pro+ 5G

రెడ్మీ లవర్స్ కోసం షావోమి సంస్థ నోట్ సిరీస్ లో భాగంగా Redmi Note 12 సిరీస్ ని ఇటీవలె భారత్ లో లాంచ్ చేసింది. ఈ లైనప్ లో రెడ్మీ నోట్ 12, రెడ్మీ నోట్ 12 ప్రో, రెడ్మీ నోట్ 12 ప్రో+ ఫోన్లు లాంచ్ అయ్యాయి. నేటి నుంచి ఈ ఫోన్ల ఫస్ట్ సేల్ మొదలైంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్లు విక్రయానికి వచ్చాయి. Redmi Note 12 Pro 5G సిరీస్ డివైజెస్ మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్ తో వచ్చాయి.

Redmi Note 12 Pro 5G సిరీస్ స్మార్ట్ ఫోన్స్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, డాల్బి విజన్, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 200ఎంపి మెయిన్ కెమెరా, 256జిబి స్టోరేజీ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, డాల్బి అట్మాస్ ఆడియో తో వచ్చాయి. ఓసారి భారత్ లో Redmi Note 12 Pro 5G సిరీస్ యొక్క ధర, లాంచ్ ఆఫర్స్ మరియు స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

భారత్ లో రెడ్మీ నోట్ 12ప్రో 5జీ మరియు రెడ్మీ నోట్ 12ప్రో+ 5జీ ధర, ఆఫర్స్, లభ్యత

Redmi Note 12 Pro 5G:

  • 6GB + 128GB వేరియంట్ ధర రూ.24,999, బ్యాంక్ ఆఫర్ తర్వాత రూ.21,999
  • 8GB + 128GB వేరియంట్ ధర రూ.26,999, బ్యాంక్ ఆఫర్ తర్వాత రూ.23,999
  • 8GB + 256GB వేరియంట్ ధర రూ.27,999, బ్యాంక్ ఆఫర్ తర్వాత రూ.24,999

Redmi Note 12 Pro+:

  • 8GB + 256GB వేరియంట్ ధర రూ.29,999, బ్యాంక్ ఆఫర్ తర్వాత రూ.26,999
  • 12GB + 256GB వేరియంట్ ధర రూ.32,999, బ్యాంక్ ఆఫర్ తర్వాత రూ.29,999

Redmi Note 12 Pro మరియు Redmi Note 12 Pro+ కొనుగోలుదారులు ఐసీఐసీఐ క్రెడిట్ (ఈఎంఐ మరియు నాన్-ఈఎంఐ) మరియు డెబిట్ (ఈఎంఐ) ట్రాన్సాక్షన్స్ ద్వారా రూ.3,000 డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే షావోమి కంపెనీ రూ.3,000 ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. ఒకవేళ మీరు షావోమి లేదా రెడ్మీ స్మార్ట్ ఫోన్ లను ఎక్స్‌చేంజ్ చేస్తే మీకు రూ.4,000 డిస్కౌంట్ లభిస్తుంది.

ఇక్కడ కొనుగోలుదారులు ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. బ్యాంక్ డిస్కౌంట్ మరియు బంప్ అప్ ఎక్స్‌చేంజ్ ఆఫర్లను కలగలిపి కొనుగోలు జరపలేరు. ఇకపోతే Redmi Note 12 Pro 5G, Redmi Note 12 Pro+ 5G ఫోన్ల అమ్మకాలు నేడు మధ్యాహ్నం 12 గంటల నుంచి మొదలయ్యాయి. ఇవాళ అనగా జనవరి 11 తేదీ నుంచి ఎంఐ స్టోర్ మరియు ఫ్లిప్ కార్ట్ ద్వారా ఫోన్లను కొనుగోలు చేయవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post First Sale: ఫ్లిప్‌కార్ట్ ద్వారా Redmi Note 12 Pro 5G, Note 12 Pro+ 5G ఫోన్ల విక్రయం first appeared on 91Mobiles Telugu.

]]>