Galaxy Z Flip 4 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 21 Jul 2022 13:40:09 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 లీకైన Samsung Galaxy Z Flip 4 ధర https://www.91mobiles.com/telugu/samsung-galaxy-z-flip-4-europe-price-leaked/ Thu, 21 Jul 2022 13:40:09 +0000 https://www.91mobiles.com/telugu/?p=1151 హైలైట్స్: లాంచ్ కి ముందు లీకైన శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 యూరప్ మార్కెట్ ధర 128జిబి మోడల్ ధర 1080 యూరోలు (దాదాపు రూ.87,900). 512జిబి మోడల్ ధర 1280 యూరోలు (దాదాపు రూ.1,04,200) ఆగస్టు 10 న లాంచ్ అవుతోన్న శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 ఆగస్టు 10 న అన్ ప్యాక్డ్ ఈవెంట్ లో లాంచ్ కానున్నాయి. […]

The post లీకైన Samsung Galaxy Z Flip 4 ధర first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • లాంచ్ కి ముందు లీకైన శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 యూరప్ మార్కెట్ ధర
  • 128జిబి మోడల్ ధర 1080 యూరోలు (దాదాపు రూ.87,900). 512జిబి మోడల్ ధర 1280 యూరోలు (దాదాపు రూ.1,04,200)
  • ఆగస్టు 10 న లాంచ్ అవుతోన్న శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4

శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 ఆగస్టు 10 న అన్ ప్యాక్డ్ ఈవెంట్ లో లాంచ్ కానున్నాయి. గతేడాది వచ్చిన గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3, జెడ్ ఫోల్డ్ 3 ఫోన్లకు సక్సెసర్స్ గా ఈ ఫోన్స్ వస్తున్నాయి. రాబోవు ఈ మడత ఫోన్లకు సంబంధించి ఎన్నో వార్తలు, రూమర్లు వస్తూనే ఉన్నాయి. తాజాగా ప్రైస్ బాబా వెబ్ సైట్ శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 యురోపియన్ మార్కెట్ ధరను లీక్ స్టర్ సుదాన్శు సౌజన్యంతో ప్రకటించింది. మరి ఆ వివరాలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.

శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 ధర, జెడ్ ఫ్లిప్ 3 ధర మాదిరిగానే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 చిప్సెట్, అమోలెడ్ డిస్ప్లే ఉండనున్నట్లు సమాచారం. ఈ ఫోన్ కి సంబంధించిన ధర, స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy Z Flip 4 ధర (అంచనా)

శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 128జిబి వేరియంట్ ధరను 1080 యూరోలుగా నిర్ణయించారు. అంటే భారత కరెన్సీలో దీని ధర రూ.87,900. ఇక 256జిబి వేరియంట్ ధర 1160 యూరోలు (రూ.94,400) గా ఉండనుంది. 512జిబి వేరియంట్ ధర 1280 యూరోలు (రూ.1,04,200) గా ఉంటుందని సమాచారం. భారత మార్కెట్ లో ఈ ఫోన్ ధర వేరుగా ఉండే అవకాశముంది. మరి ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూద్దాం రండి.

Samsung Galaxy Z Flip 4 స్పెసిఫికేషన్స్ (అంచనా)

శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 లో 6.7 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే ఉంది. ఇది మధ్యలోకి ఫోల్డ్ అవుతుంది. ఇక ఫోల్డ్ అయ్యాక మనకు 1.9 అంగుళాల సెకండరీ అమోలెడ్ డిస్ప్లే కనిపిస్తుంది. మెయిన్ స్క్రీన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉండి, సెంటర్ పంచ్ హోల్ కటౌట్ ని కలిగి ఉండనుంది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 512జిబి వరకు స్టోరేజీ, 12జిబి వరకు ర్యామ్ ఈ ఫోన్లో ఉంటాయి. ఇక ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 లో 4,400 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, ట్రిపుల్ రియర్ కెమెరాలు ఉంటాయి. వీటిలో ఒకటి 50ఎంపి ప్రైమరీ సెన్సర్ కాగా, రెండోది 12ఎంపి అల్ట్రావైడ్ సెన్సర్, ఇక మూడోది 10ఎంపి టెలీఫోటో లెన్స్ (3X జూమ్). 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 6, బ్లూటూత్, జీపీఎస్, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 స్మార్ట్ ఫోన్లో ఉన్నాయి.

The post లీకైన Samsung Galaxy Z Flip 4 ధర first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung Galaxy Z Flip 4 ఫస్ట్ లుక్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-z-flip-4-renders-leaked-by-evan-blass-via-91mobiles/ Fri, 15 Jul 2022 14:53:55 +0000 https://www.91mobiles.com/telugu/?p=1017 హైలైట్స్: వచ్చే నెలలో లాంచ్ కానున్న శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4, జెడ్ ఫ్లిప్ 4 డిజైన్ లో పెద్దగా మార్పులు ఉండబోవని సమాచారం తాజాగా లీకైన ఫ్లిప్ 4 ఇమేజెస్ వచ్చే నెలలో ఎంట్రీ ఇవ్వనున్న జెడ్ ఫ్లిప్ 4, జెడ్ ఫోల్డ్ 4 ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు శాంసంగ్ త్వరలో రెండు ఫోల్డబుల్ ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. వచ్చే నెలలో శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4, శాంసంగ్ గెలాక్సీ […]

The post Samsung Galaxy Z Flip 4 ఫస్ట్ లుక్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • వచ్చే నెలలో లాంచ్ కానున్న శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4, జెడ్ ఫ్లిప్ 4
  • డిజైన్ లో పెద్దగా మార్పులు ఉండబోవని సమాచారం
  • తాజాగా లీకైన ఫ్లిప్ 4 ఇమేజెస్

వచ్చే నెలలో ఎంట్రీ ఇవ్వనున్న జెడ్ ఫ్లిప్ 4, జెడ్ ఫోల్డ్ 4

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు శాంసంగ్ త్వరలో రెండు ఫోల్డబుల్ ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. వచ్చే నెలలో శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4, శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 స్మార్ట్ ఫోన్స్ లాంచ్ అవ్వనున్నట్లు సమాచారం. ఈ రెండు ఫోన్ల యొక్క మునుపటి వర్షన్స్ తో పోలిస్తే, వీటిలో పెద్దగా డిజైన్ కు సంబంధించిన మార్పులు ఉండబోవని వార్తలు వినిపిస్తున్నాయి. బోరా పర్పుల్ కలర్ లో ఉన్నటువంటి ఫ్లిప్ 4 ఫోన్ యొక్క ఇమేజెస్ ని ప్రముఖ టిప్ స్టర్ ఎవాన్ బ్లాస్ 91మొబైల్స్ ద్వారా ఎక్స్ క్లూజివ్ గా ప్రజెంట్ చేశాడు.

ఒక్కసారిగా చూస్తే, ఫ్లిప్ 4 మోడల్, జెడ్ ఫ్లిప్ 3 ని పోలినట్లు కనిపిస్తోంది. కానీ, తరచి చూస్తే, కొన్ని మార్పులు ఉన్నట్లు స్పష్టమవుతోంది. బటన్స్ కాస్త పెద్దగా కనిపిస్తున్నాయి. ఇందువల్లన క్లిక్ చేసేందుకు కాస్త వీలుగా ఉంటుందనుకోవాలి. ఇక కెమెరా విభాగం గురించి మాట్లాడుకుందాం. గత మోడల్స్ తో పోల్చితే, కొత్త మోడల్ లో మరింత ప్రీమియమ్ ఇమేజింగ్ అనుభూతి ఉండటం ఖాయమని తెలుస్తోంది. అందుకు తగిన లెన్సెస్ ఈ మోడల్స్ లో ఉండనున్నాయి. ఫోన్ బాడీ, భారీ బ్యాటరీని అకామోడేట్ చేసేందుకు వీలుగా తీర్చిదిద్దబడినట్లు అర్థమవుతోంది. ఈసారి మోడల్ లో భారీ బ్యాటరీ ఉండనున్నట్లు రూమర్లు కూడా వచ్చాయి.

ఇక మడతబెట్టే ఫోన్లలో కీలకమైన భాగం హింజ్, దీని ఆధారంగానే ఫోన్ ని మడతబెట్టడం, తెరవడం సాధ్యమవుతుంది. మరి ఇంతటి ప్రాధాన్యత ఉన్న హింజ్ లేటెస్ట్ మోడల్ లో ఎలా ఉందో చూద్దాం. సరిగ్గా పిక్స్ ని గమనిస్తే, హింజ్, ఫోన్ స్క్రీన్ కి దగ్గరగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా జెడ్ ఫ్లిప్ యొక్క హింజ్ ని చూస్తే, గత మోడల్ మాదిరే ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక రానున్న రోజుల్లో శాంసంగ్ నుంచి ఈ ఫోన్స్ కి సంబంధించిన మరింత సమాచారం వచ్చే అవకాశం ఉంది.

Samsung Galaxy Z Flip 4 స్పెసిఫికేషన్స్

గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీని కలిగి ఉండనుంది. మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్ ఉండబోదని సమాచారం. ఇంటర్నల్ గా 6.7 అంగుళాల ఫోల్డబుల్ డిస్ప్లే ఉండనుంది. ఎక్కువ కాలం మన్నేందుకు, శాంసంగ్ యొక్క సరికొత్త సూపర్ యూటీజీ మెటీరియల్ కోటింగ్ ను డిస్ప్లే పై వాడనున్నారు. గతంలో వచ్చిన జెడ్ ఫ్లిప్ 3 కెమెరాల విషయంలో అందరూ డిజపాయింట్ అయ్యారు. కాబట్టి, ఈసారి ఫ్లిప్ 4 విషయంలో శాంసంగ్ శ్రద్ధ పెట్టే అవకాశముంది. లేదంటే, ఫ్లిప్ 4 మెప్పించకపోవచ్చు. గతేడాది అండర్-డిస్ప్లే కెమెరా టెక్నాలజీని శాంసంగ్ పరిచయం చేసింది. అయితే ఫ్లిప్ 4 లో ఆ టెక్నాలజీని వాడతారా లేదా అన్నది చూడాలి.

ఇక సాఫ్ట్ వేర్ విషయానికి వస్తే, జెడ్ ఫ్లిప్ 4 ఆండ్రాయిడ్ 12 ఓఎస్ తో వస్తోంది. దీనికి సరికొత్త వన్ యూఐ వర్షన్ జతచేరే అవకాశముంది. ఈ వర్షన్ వన్ యూఐ లో పలు చిన్నా చితకా సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్స్ ఉంటాయని అంచనా. అలాగే ఈ ఫోన్ కూడా 4 మేజర్ ఆండ్రాయిడ్ ఓఎస్ అప్ గ్రేడ్స్ ని పొందనుంది.

The post Samsung Galaxy Z Flip 4 ఫస్ట్ లుక్ first appeared on 91Mobiles Telugu.

]]>