Samsung Galaxy Z Flip 4 ఫస్ట్ లుక్

హైలైట్స్:

  • వచ్చే నెలలో లాంచ్ కానున్న శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4, జెడ్ ఫ్లిప్ 4
  • డిజైన్ లో పెద్దగా మార్పులు ఉండబోవని సమాచారం
  • తాజాగా లీకైన ఫ్లిప్ 4 ఇమేజెస్

వచ్చే నెలలో ఎంట్రీ ఇవ్వనున్న జెడ్ ఫ్లిప్ 4, జెడ్ ఫోల్డ్ 4

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు శాంసంగ్ త్వరలో రెండు ఫోల్డబుల్ ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. వచ్చే నెలలో శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4, శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 స్మార్ట్ ఫోన్స్ లాంచ్ అవ్వనున్నట్లు సమాచారం. ఈ రెండు ఫోన్ల యొక్క మునుపటి వర్షన్స్ తో పోలిస్తే, వీటిలో పెద్దగా డిజైన్ కు సంబంధించిన మార్పులు ఉండబోవని వార్తలు వినిపిస్తున్నాయి. బోరా పర్పుల్ కలర్ లో ఉన్నటువంటి ఫ్లిప్ 4 ఫోన్ యొక్క ఇమేజెస్ ని ప్రముఖ టిప్ స్టర్ ఎవాన్ బ్లాస్ 91మొబైల్స్ ద్వారా ఎక్స్ క్లూజివ్ గా ప్రజెంట్ చేశాడు.

ఒక్కసారిగా చూస్తే, ఫ్లిప్ 4 మోడల్, జెడ్ ఫ్లిప్ 3 ని పోలినట్లు కనిపిస్తోంది. కానీ, తరచి చూస్తే, కొన్ని మార్పులు ఉన్నట్లు స్పష్టమవుతోంది. బటన్స్ కాస్త పెద్దగా కనిపిస్తున్నాయి. ఇందువల్లన క్లిక్ చేసేందుకు కాస్త వీలుగా ఉంటుందనుకోవాలి. ఇక కెమెరా విభాగం గురించి మాట్లాడుకుందాం. గత మోడల్స్ తో పోల్చితే, కొత్త మోడల్ లో మరింత ప్రీమియమ్ ఇమేజింగ్ అనుభూతి ఉండటం ఖాయమని తెలుస్తోంది. అందుకు తగిన లెన్సెస్ ఈ మోడల్స్ లో ఉండనున్నాయి. ఫోన్ బాడీ, భారీ బ్యాటరీని అకామోడేట్ చేసేందుకు వీలుగా తీర్చిదిద్దబడినట్లు అర్థమవుతోంది. ఈసారి మోడల్ లో భారీ బ్యాటరీ ఉండనున్నట్లు రూమర్లు కూడా వచ్చాయి.

ఇక మడతబెట్టే ఫోన్లలో కీలకమైన భాగం హింజ్, దీని ఆధారంగానే ఫోన్ ని మడతబెట్టడం, తెరవడం సాధ్యమవుతుంది. మరి ఇంతటి ప్రాధాన్యత ఉన్న హింజ్ లేటెస్ట్ మోడల్ లో ఎలా ఉందో చూద్దాం. సరిగ్గా పిక్స్ ని గమనిస్తే, హింజ్, ఫోన్ స్క్రీన్ కి దగ్గరగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా జెడ్ ఫ్లిప్ యొక్క హింజ్ ని చూస్తే, గత మోడల్ మాదిరే ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక రానున్న రోజుల్లో శాంసంగ్ నుంచి ఈ ఫోన్స్ కి సంబంధించిన మరింత సమాచారం వచ్చే అవకాశం ఉంది.

Samsung Galaxy Z Flip 4 స్పెసిఫికేషన్స్

గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీని కలిగి ఉండనుంది. మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్ ఉండబోదని సమాచారం. ఇంటర్నల్ గా 6.7 అంగుళాల ఫోల్డబుల్ డిస్ప్లే ఉండనుంది. ఎక్కువ కాలం మన్నేందుకు, శాంసంగ్ యొక్క సరికొత్త సూపర్ యూటీజీ మెటీరియల్ కోటింగ్ ను డిస్ప్లే పై వాడనున్నారు. గతంలో వచ్చిన జెడ్ ఫ్లిప్ 3 కెమెరాల విషయంలో అందరూ డిజపాయింట్ అయ్యారు. కాబట్టి, ఈసారి ఫ్లిప్ 4 విషయంలో శాంసంగ్ శ్రద్ధ పెట్టే అవకాశముంది. లేదంటే, ఫ్లిప్ 4 మెప్పించకపోవచ్చు. గతేడాది అండర్-డిస్ప్లే కెమెరా టెక్నాలజీని శాంసంగ్ పరిచయం చేసింది. అయితే ఫ్లిప్ 4 లో ఆ టెక్నాలజీని వాడతారా లేదా అన్నది చూడాలి.

ఇక సాఫ్ట్ వేర్ విషయానికి వస్తే, జెడ్ ఫ్లిప్ 4 ఆండ్రాయిడ్ 12 ఓఎస్ తో వస్తోంది. దీనికి సరికొత్త వన్ యూఐ వర్షన్ జతచేరే అవకాశముంది. ఈ వర్షన్ వన్ యూఐ లో పలు చిన్నా చితకా సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్స్ ఉంటాయని అంచనా. అలాగే ఈ ఫోన్ కూడా 4 మేజర్ ఆండ్రాయిడ్ ఓఎస్ అప్ గ్రేడ్స్ ని పొందనుంది.

Previous articleభారత్ లో త్వరలో ఎంట్రీ ఇవ్వనున్న Xiaomi 12 Lite
Next articleReno 8 సిరీస్ తో పాటు భారత్ లో లాంచ్ కానున్న OPPO Pad Air
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.