Google Pixel 7 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 02 May 2023 10:20:55 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Google Pixel 7 Pro, Pixel 7 స్మార్ట్‌ఫోన్లపై రూ.15,000 డిస్కౌంట్! https://www.91mobiles.com/telugu/google-pixel-7-pro-pixel-7-price-cut-bank-offers-flipkart-big-saving-days-sale/ Tue, 02 May 2023 10:17:16 +0000 https://www.91mobiles.com/telugu/?p=6126 మే 4 వ తేదీ నుంచి ఫ్లిప్ కార్ట్ లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ మొదలవుతోంది. ఈ సేల్ సందర్భంగా స్మార్ట్ ఫోన్లతో పాటు ఇతర ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. రానున్న సేల్ లో లభించనున్న ఆఫర్లు, డీల్స్ ని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్ కార్ట్ టీజ్ చేస్తోంది. తాజాగా ఫ్లిప్ కార్ట్ Pixel 7, Pixel 7 Pro ఫోన్ల డీల్స్ ని రివీల్ చేసింది. ఓసారి ఆఫర్ వివరాలను తెలుసుకుందాం పదండి. […]

The post Google Pixel 7 Pro, Pixel 7 స్మార్ట్‌ఫోన్లపై రూ.15,000 డిస్కౌంట్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Google Pixel 7 Pro లాంచ్ ధర రూ.84,999
  • ఫ్లిప్ కార్ట్ ఆఫర్ ధర రూ.69,999
  • డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్ పై 10 శాతం క్యాష్‌బ్యాక్

మే 4 వ తేదీ నుంచి ఫ్లిప్ కార్ట్ లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ మొదలవుతోంది. ఈ సేల్ సందర్భంగా స్మార్ట్ ఫోన్లతో పాటు ఇతర ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. రానున్న సేల్ లో లభించనున్న ఆఫర్లు, డీల్స్ ని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్ కార్ట్ టీజ్ చేస్తోంది. తాజాగా ఫ్లిప్ కార్ట్ Pixel 7, Pixel 7 Pro ఫోన్ల డీల్స్ ని రివీల్ చేసింది. ఓసారి ఆఫర్ వివరాలను తెలుసుకుందాం పదండి.

Google Pixel 7 Pro, Pixel 7 ఫ్లిప్‌కార్ట్ ఆఫర్

Google Pixel 7 Pro డివైజ్ భారత్ లో రూ.84,999 ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ని ఫ్లిప్ కార్ట్ లో రూ.69,999 కి కొనుగోలు చేయవచ్చు. అలాగే కొన్ని ఎంపిక చేయబడిన బ్యాంక్స్ యొక్క డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాదు, పాత ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ అదనంగా రూ.28,250 ఎక్స్‌చేంజ్ డిస్కౌంట్ అందిస్తోంది.

మే 4 నుంచి ఫ్లిప్ కార్ట్ లో మొదలయ్యే సేల్ సందర్భంగా Google Pixel 7 Pro స్మార్ట్ ఫోన్ ని రూ.65,999 కి కొనుగోలు చేయవచ్చు. ఇది ఎక్స్‌చేంజ్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ కలపుకుని అని గమనించాలి. Google Pixel 7 Pro స్మార్ట్ ఫోన్ బ్లాక్, వైట్ మరియు గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ 12జిబి ర్యామ్ మరియు 128జిబి స్టోరేజీని కలిగి ఉంది.

Google Pixel 7 స్మార్ట్ ఫోన్ ని ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ సందర్భంగా రూ.15000 ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ గూగుల్ ఫోన్ ధర రూ.69,999 గా ఉంది. సేల్ సందర్భంగా ఫోన్ ని రూ.44,999 కే కొనుగోలు చేయవచ్చు. ఈ ధర బ్యాంక్ డిస్కౌంట్, ఎక్స్‌చేంజ్ ఆఫర్, ప్రైస్ కట్ కలుపుకుని అని గమనించాలి. Google Pixel 7 ఫోన్ లైమ్, వైట్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో లభిస్తుంది.

Google Pixel 7 మరియు Google Pixel 7 Pro స్పెసిఫికేషన్స్

డిస్ప్లే

Google Pixel 7 Pro లో 6.7-ఇంచ్ క్యూహెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. Google Pixel 7 లో 6.1-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్

Google Pixel 7 Pro, Google Pixel 7 ఫోన్లలో టెన్సర్ జీ2 ప్రాసెసర్ వాడారు. ఈ చిప్సెట్ ని గూగుల్ సొంతంగా అభివృద్ధి చేసింది.

కెమెరా

Google Pixel 7 Pro లో 50ఎంపి వైడ్ యాంగిల్ లెన్స్, 48ఎంపి టెలీఫోటో కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. Google Pixel 7 లో 50ఎంపి వైడ్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. రెండు ఫోన్లలో కూడా 10.8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ

Google Pixel 7 Pro లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. Google Pixel 7 లో 4355 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. రెండు ఫోన్లు 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తాయి. ఈ పిక్సెల్ స్మార్ట్ ఫోన్లు Qi-cert వైర్లెస్ చార్జింగ్ ఫీచర్ కలిగి ఉన్నాయి.

ర్యామ్, స్టోరేజీ

Google Pixel 7 Pro లో 12జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. Google Pixel 7 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.

Flipkart Big Saving Days Sale

ఫ్లిప్ కార్ట్ లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ మే 4 నుంచి మొదలవుతుంది. సేల్ సందర్భంగా ఫ్లిప్ కార్ట్ ఓ ఉన్న ప్రొడక్ట్స్ పై 80 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. సేల్ గురించి టీజ్ చేస్తూ ఫ్లిప్ కార్ట్.. ఎలక్ట్రానిక్ వస్తువులపై 80 శాతం, టీవీ మరియు ఇతర ఉపకరణాలపై 70 శాతం, దుస్తులు మరియు షూస్ పై 80 శాతం డిస్కౌంట్ లభిస్తుందని తెలిపింది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Google Pixel 7 Pro, Pixel 7 స్మార్ట్‌ఫోన్లపై రూ.15,000 డిస్కౌంట్! first appeared on 91Mobiles Telugu.

]]>
భారత్ లో లాంచ్ అయిన Google Pixel 7, Google Pixel 7 Pro https://www.91mobiles.com/telugu/google-pixel-7-pixel-7-pro-launched-india-price-specs-availability/ Fri, 07 Oct 2022 05:43:24 +0000 https://www.91mobiles.com/telugu/?p=2787 హైలైట్స్: భారత మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన Google Pixel 7, Google Pixel 7 Pro టెన్సర్ జీ2 చిప్, 50ఎంపి మెయిన్ కెమెరా, 11ఎంపి సెల్ఫీ షూటర్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో లాంచ్ అయిన Pixel 7 సిరీస్ ఫోన్లు అక్టోబర్ 6 రాత్రి 8.15 గంటల నుంచి మొదలైన పిక్సెల్ 7 సిరీస్ ఫోన్ ప్రీ-ఆర్డర్స్ Google Pixel 7, Google Pixel 7 Pro స్మార్ట్ ఫోన్లు భారత్ తో […]

The post భారత్ లో లాంచ్ అయిన Google Pixel 7, Google Pixel 7 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • భారత మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన Google Pixel 7, Google Pixel 7 Pro
  • టెన్సర్ జీ2 చిప్, 50ఎంపి మెయిన్ కెమెరా, 11ఎంపి సెల్ఫీ షూటర్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో లాంచ్ అయిన Pixel 7 సిరీస్ ఫోన్లు
  • అక్టోబర్ 6 రాత్రి 8.15 గంటల నుంచి మొదలైన పిక్సెల్ 7 సిరీస్ ఫోన్ ప్రీ-ఆర్డర్స్

Google Pixel 7, Google Pixel 7 Pro స్మార్ట్ ఫోన్లు భారత్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా లాంచ్ అయ్యాయి. 2018 లో పిక్సెల్ 3 లాంచ్ తర్వాత మళ్ళీ ఇప్పుడే గూగుల్ సంస్థ తన ఫ్లాగ్షిప్ ఫోన్లను భారత్ లో లాంచ్ చేసింది. గతేడాది వచ్చిన పిక్సెల్ 6 కి పిక్సెల్ 7 సిరీస్ సక్సెసర్. సెంటర్ పంచ్ హోల్ కటౌట్, అల్యూమినియమ్ ఫినిషింగ్ తో అడ్డంగా అమరిన కెమెరా మాడ్యూల్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, సెకండ్ జనరేషన్ టెన్సర్ చిప్సెట్ తో ఈ ఫోన్లు వచ్చాయి.

భారత్ లో Google Pixel 7, Google Pixel 7 Pro ధర, ప్రీ-ఆర్డర్ వివరాలు

భారత్ లో Google Pixel 7 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.59,999 గా ఉంది. ఈ ఫోన్ స్నో, అబ్సీడియన్, లెమన్ గ్రాస్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Google Pixel 7 Pro 12జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.84,999 గా నిర్ణయించారు. అబ్సీడియన్, స్నో, హేజల్ కలర్ ఆప్షన్స్ లో ఫోన్ లభిస్తుంది.

ఫ్లిప్ కార్ట్ ద్వారా భారత్ లో పిక్సెల్ 7 సిరీస్ ఫోన్లు విక్రయానికి వస్తాయి. అక్టోబర్ 6 రాత్రి 8.15 గంటల నుంచి ప్రీ-ఆర్డర్ బుకింగ్స్ మొదలయ్యాయి. ప్రీ-ఆర్డర్ చేసిన వారికి Fitbit Inspire 2 ని రూ.4,999 కే సొంతం చేసుకోవచ్చు. అలాగే ఫ్రీ స్క్రీన్ ప్రొటెక్షన్ కూడా లభిస్తుంది.

Google Pixel 7 స్పెసిఫికేషన్స్

Google Pixel 7 లో 6.3-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్ హోల్ కటౌట్, సిమెట్రికల్ బెజెల్స్, షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయి. పిక్సెల్ 7 లో గూగుల్ టెన్సర్ జీ2 చిప్ వాడారు. 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. పిక్సెల్ 7 ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. 5 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ ని గూగుల్ అందిస్తుంది.

5జీ, 4జీ ఎల్టీఈ, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 4700 ఎంఏహెచ్ బ్యాటరీ, 30 వాట్ ఫాస్ట్ చార్జింగ్, టైటన్ సెక్యూరిటీ చిప్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, వైర్లెస్ చార్జింగ్ Google Pixel 7 లో ఉన్నాయి.

Google Pixel 7 లో 50ఎంపి ప్రైమరీ, 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో ముందు వైపున 11ఎంపి కెమెరా ఉంది. ఈ ఫోన్లో హై-రెజుల్యూషన్ 8x జూమ్, రియల్-టోన్, మూవీ మోషన్ బ్లర్ అనే ఫీచర్లు ఉన్నాయి.

Google Pixel 7 Pro స్పెసిఫికేషన్స్

Google Pixel 7 Pro లో 6.7-ఇంచ్ ఎల్టీపీవో క్యూహెచ్డీ+ డిస్ప్లే, పంచ్-హోల్ కటౌట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, టెన్సర్ జీ2 చిప్సెట్ ఉన్నాయి. 12జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై Google Pixel 7 Pro పని చేస్తుంది.

Google Pixel 7 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంది. ఇది 5x ఆప్టికల్ జూమ్ మరియు ఎల్టీఏఎఫ్ ని కలిగి ఉంది. అలాగే 50ఎంపి ప్రైమరీ వైడ్-యాంగిల్ లెన్స్ ఉంది. మరొక 12ఎంపి అల్ట్రా-వైడ్ యాంగిల్ షూటర్ ఇందులో ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపున 11 ఎంపి కెమెరా అమర్చారు. ఈ ఫోన్ 4కే వీడియో రికార్డింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Google Pixel 7 Pro లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 30 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. భద్రత కోసం ఇందులో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది. వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్లో ఉంది. ఇంకా ఈ ఫోన్ ఐపీ68 రేటింగ్ తో వస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post భారత్ లో లాంచ్ అయిన Google Pixel 7, Google Pixel 7 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్ కి ముందు లీకైన Google Pixel 7, Pixel 7 Pro ధరలు https://www.91mobiles.com/telugu/google-pixel-7-pixel-7-pro-prices-leaked-before-launch/ Sun, 25 Sep 2022 04:35:34 +0000 https://www.91mobiles.com/telugu/?p=2546 హైలైట్స్: లీకైన Google Pixel 7, Pixel 7 Pro ధరలు యూఎస్ఏ లో పిక్సెల్ 7 ధర 599 డాలర్లు, పిక్సెల్ 7 ప్రో ధర 899 డాలర్లుగా ఉండే అవకాశం అక్టోబర్ 6 న లాంచ్ అవుతోన్న Google Pixel 7 సిరీస్ ఫోన్లు అక్టోబర్ 6 న జరగనున్న గూగుల్ స్పెషల్ హార్డ్‌వేర్ ఈవెంట్ లో Google Pixel 7, Pixel 7 Pro ఫోన్లు లాంచ్ కానున్నాయి. తాము సెకండ్ జనరేషన్ […]

The post లాంచ్ కి ముందు లీకైన Google Pixel 7, Pixel 7 Pro ధరలు first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • లీకైన Google Pixel 7, Pixel 7 Pro ధరలు
  • యూఎస్ఏ లో పిక్సెల్ 7 ధర 599 డాలర్లు, పిక్సెల్ 7 ప్రో ధర 899 డాలర్లుగా ఉండే అవకాశం
  • అక్టోబర్ 6 న లాంచ్ అవుతోన్న Google Pixel 7 సిరీస్ ఫోన్లు

అక్టోబర్ 6 న జరగనున్న గూగుల్ స్పెషల్ హార్డ్‌వేర్ ఈవెంట్ లో Google Pixel 7, Pixel 7 Pro ఫోన్లు లాంచ్ కానున్నాయి. తాము సెకండ్ జనరేషన్ టెన్సర్ చిప్ తో రానున్నట్లు కంపెనీ ఇది వరకే వెల్లడించింది. అలాగే, ఫ్లిప్ కార్ట్ టీజర్ ద్వారా పిక్సెల్ 7 సిరీస్ ఇండియాలో కూడా లాంచ్ కానుందని స్పష్టమైంది. నేడు, పిక్సెల్ 7 సిరీస్ ధరలు లీక్ అయ్యాయి. గతేడాది వచ్చిన పిక్సెల్ ఫోన్ ధరల మాదిరే 7 సిరీస్ ధరలు ఉన్నాయి.

ఫేస్బుక్ లో గూగుల్-పోస్టెడ్ రెండర్ ఇమేజ్ ప్రత్యక్షమవ్వడంతో పిక్సెల్ 7 ప్రో డిజైన్ ని మేం చూడటం జరిగింది. పిక్సెల్ 6 ప్రో తో పోల్చితే 7 ప్రో లో కర్వ్డ్ ఎడ్జెస్ ని కాస్త క్రిందకు టోన్ చేసినట్లు తెలుస్తోంది.

Google Pixel 7 Pro ఫ్రంట్ డిజైన్

Google Pixel 7 Pro ఫ్రంట్ డిజైన్ గూగుల్-పోస్టెడ్ రెండర్ ఇమేజ్ ద్వారా బయటకు రివీల్ అయ్యింది. ఈ ఫోన్లో సెంటర్ పంచ్ హోల్ కటౌట్, సిమెట్రికల్ బెజెల్స్, కర్వ్డ్ ఎడ్జెస్ ఉన్నాయి. అలాగే బ్యాక్ ప్యానెల్ పై హారిజంటల్ స్ట్రైప్ లో ట్రిపుల్ కెమెరాలు, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. ఫోన్ చూడటానికి హెజెల్ కలర్ లో కనిపిస్తోంది. అయితే లాంచ్ రోజున ఇతర కలర్ ఆప్షన్స్ కూడా రివీల్ అయ్యే అవకాశం ఉంది.

ఇమేజ్ లో, రెండు పిక్సెల్ వాచెస్, పిక్సెల్ బడ్స్ ప్రో కూడా కనిపిస్తున్నాయి. పిక్సెల్ 7 ప్రో బ్యాక్ ప్యానెల్ హెజెల్ కలర్ లో ఉన్నట్లు తెలుస్తోంది. మూతబడిన ఫేస్బుక్ గ్రూప్ లో ఆ ఇమేజ్ పోస్ట్ కావడం వల్లన ఇప్పుడు ఆ ఇమేజ్ జనాలకు అందుబాటులో లేదు.

Google Pixel 7, Pixel 7 Pro ధరలు

ఆర్టెమ్ రుసాకోవ్స్కీ అనే టిప్ స్టర్ ద్వారా Google Pixel 7, Pixel 7 Pro ధరలు రివీల్ అయ్యాయి. పిక్సెల్ 7 సిరీస్ ధరలు, దాదాపుగా పిక్సెల్ 6 సిరీస్ ధరల మాదిరే ఉంటాయని అర్థమవుతోంది. పిక్సెల్ 7 ధర 599 డాలర్లు (దాదాపు రూ.48,500) కాగా, పిక్సెల్ 7 ప్రో ధర 899 డాలర్లు (దాదాపు రూ.72,000) గా ఉంది. పిక్సెల్ 7 ఫోన్ స్నో, అబ్సిడియన్, లెమన్ గ్రాస్ కలర్ ఆప్షన్స్ లో లభించనుండగా, పిక్సెల్ 7 ప్రో అబ్సిడియన్, హెజెల్, స్నో కలర్ ఆప్షన్స్ లో లభ్యమవుతుంది.

అక్టోబర్ 6 నుంచి Google Pixel 7, Pixel 7 Pro ఫోన్లను ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చని లీక్ ద్వారా తెలుస్తోంది. అంటే లాంచ్ అయిన కాసేపటికి ఈ ఫోన్లు ప్రీ-ఆర్డర్ కి అందుబాటులోకి వస్తాయన్నమాట. ప్రస్తుతానికి సేల్ డేట్ అక్టోబర్ 13 అని లిస్ట్ కాబడింది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెలీకామ్, టెక్నాలజీ, ఎంటర్టెయిన్మెంట్ వార్తల కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post లాంచ్ కి ముందు లీకైన Google Pixel 7, Pixel 7 Pro ధరలు first appeared on 91Mobiles Telugu.

]]>