భారత్ లో లాంచ్ అయిన Google Pixel 7, Google Pixel 7 Pro

హైలైట్స్:

  • భారత మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన Google Pixel 7, Google Pixel 7 Pro
  • టెన్సర్ జీ2 చిప్, 50ఎంపి మెయిన్ కెమెరా, 11ఎంపి సెల్ఫీ షూటర్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో లాంచ్ అయిన Pixel 7 సిరీస్ ఫోన్లు
  • అక్టోబర్ 6 రాత్రి 8.15 గంటల నుంచి మొదలైన పిక్సెల్ 7 సిరీస్ ఫోన్ ప్రీ-ఆర్డర్స్

Google Pixel 7, Google Pixel 7 Pro స్మార్ట్ ఫోన్లు భారత్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా లాంచ్ అయ్యాయి. 2018 లో పిక్సెల్ 3 లాంచ్ తర్వాత మళ్ళీ ఇప్పుడే గూగుల్ సంస్థ తన ఫ్లాగ్షిప్ ఫోన్లను భారత్ లో లాంచ్ చేసింది. గతేడాది వచ్చిన పిక్సెల్ 6 కి పిక్సెల్ 7 సిరీస్ సక్సెసర్. సెంటర్ పంచ్ హోల్ కటౌట్, అల్యూమినియమ్ ఫినిషింగ్ తో అడ్డంగా అమరిన కెమెరా మాడ్యూల్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, సెకండ్ జనరేషన్ టెన్సర్ చిప్సెట్ తో ఈ ఫోన్లు వచ్చాయి.

భారత్ లో Google Pixel 7, Google Pixel 7 Pro ధర, ప్రీ-ఆర్డర్ వివరాలు

భారత్ లో Google Pixel 7 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.59,999 గా ఉంది. ఈ ఫోన్ స్నో, అబ్సీడియన్, లెమన్ గ్రాస్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Google Pixel 7 Pro 12జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.84,999 గా నిర్ణయించారు. అబ్సీడియన్, స్నో, హేజల్ కలర్ ఆప్షన్స్ లో ఫోన్ లభిస్తుంది.

ఫ్లిప్ కార్ట్ ద్వారా భారత్ లో పిక్సెల్ 7 సిరీస్ ఫోన్లు విక్రయానికి వస్తాయి. అక్టోబర్ 6 రాత్రి 8.15 గంటల నుంచి ప్రీ-ఆర్డర్ బుకింగ్స్ మొదలయ్యాయి. ప్రీ-ఆర్డర్ చేసిన వారికి Fitbit Inspire 2 ని రూ.4,999 కే సొంతం చేసుకోవచ్చు. అలాగే ఫ్రీ స్క్రీన్ ప్రొటెక్షన్ కూడా లభిస్తుంది.

Google Pixel 7 స్పెసిఫికేషన్స్

Google Pixel 7 లో 6.3-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్ హోల్ కటౌట్, సిమెట్రికల్ బెజెల్స్, షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయి. పిక్సెల్ 7 లో గూగుల్ టెన్సర్ జీ2 చిప్ వాడారు. 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. పిక్సెల్ 7 ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. 5 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ ని గూగుల్ అందిస్తుంది.

5జీ, 4జీ ఎల్టీఈ, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 4700 ఎంఏహెచ్ బ్యాటరీ, 30 వాట్ ఫాస్ట్ చార్జింగ్, టైటన్ సెక్యూరిటీ చిప్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, వైర్లెస్ చార్జింగ్ Google Pixel 7 లో ఉన్నాయి.

Google Pixel 7 లో 50ఎంపి ప్రైమరీ, 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో ముందు వైపున 11ఎంపి కెమెరా ఉంది. ఈ ఫోన్లో హై-రెజుల్యూషన్ 8x జూమ్, రియల్-టోన్, మూవీ మోషన్ బ్లర్ అనే ఫీచర్లు ఉన్నాయి.

Google Pixel 7 Pro స్పెసిఫికేషన్స్

Google Pixel 7 Pro లో 6.7-ఇంచ్ ఎల్టీపీవో క్యూహెచ్డీ+ డిస్ప్లే, పంచ్-హోల్ కటౌట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, టెన్సర్ జీ2 చిప్సెట్ ఉన్నాయి. 12జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై Google Pixel 7 Pro పని చేస్తుంది.

Google Pixel 7 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంది. ఇది 5x ఆప్టికల్ జూమ్ మరియు ఎల్టీఏఎఫ్ ని కలిగి ఉంది. అలాగే 50ఎంపి ప్రైమరీ వైడ్-యాంగిల్ లెన్స్ ఉంది. మరొక 12ఎంపి అల్ట్రా-వైడ్ యాంగిల్ షూటర్ ఇందులో ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపున 11 ఎంపి కెమెరా అమర్చారు. ఈ ఫోన్ 4కే వీడియో రికార్డింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Google Pixel 7 Pro లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 30 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. భద్రత కోసం ఇందులో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది. వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్లో ఉంది. ఇంకా ఈ ఫోన్ ఐపీ68 రేటింగ్ తో వస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

Previous articleభారత్ లో లాంచ్ అయిన OPPO A77s స్మార్ట్ ఫోన్
Next articleSnapdragon 8 Gen 2 చిప్ తో వస్తున్న iQOO 11 సిరీస్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.