Google Pixel 7a - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 11 May 2023 04:17:59 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 6.1-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 64ఎంపి కెమెరాతో భారత్‌లో లాంచైన Google Pixel 7a https://www.91mobiles.com/telugu/google-pixel-7a-launched-india-price-specs-availability/ Thu, 11 May 2023 04:17:59 +0000 https://www.91mobiles.com/telugu/?p=6243 గూగుల్ ఐ/ఓ 2023 ఈవెంట్ లో Google Pixel 7a డివైజ్ భారత్ తో పాటు గ్లోబల్ గా లాంచైంది. ఈ హ్యాండ్సెట్ గతేడాది వచ్చిన Google Pixel 6a కి సక్సెసర్ గా మార్కెట్ లోకి వచ్చింది. ఈసారి Google Pixel 7a లో టెన్సర్ జీ2 చిప్ ని అందించారు. ఇదే మేజర్ అప్‌గ్రేడ్ అని చెప్పవచ్చు. ఇదే చిప్సెట్ ని పిక్సెట్ 7 ప్రో లో కూడా వాడారు. అంతేకాదు, భారత్ లో […]

The post 6.1-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 64ఎంపి కెమెరాతో భారత్‌లో లాంచైన Google Pixel 7a first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో Google Pixel 7a ధర రూ.43,999
  • పిక్సెల్ 7 లో ఉన్న చిప్సెట్ నే కలిగి ఉన్న Google Pixel 7a
  • ఫ్లిప్ కార్ట్ ద్వారా అందుబాటులో ఉన్న Google Pixel 7a

గూగుల్ ఐ/ఓ 2023 ఈవెంట్ లో Google Pixel 7a డివైజ్ భారత్ తో పాటు గ్లోబల్ గా లాంచైంది. ఈ హ్యాండ్సెట్ గతేడాది వచ్చిన Google Pixel 6a కి సక్సెసర్ గా మార్కెట్ లోకి వచ్చింది. ఈసారి Google Pixel 7a లో టెన్సర్ జీ2 చిప్ ని అందించారు. ఇదే మేజర్ అప్‌గ్రేడ్ అని చెప్పవచ్చు. ఇదే చిప్సెట్ ని పిక్సెట్ 7 ప్రో లో కూడా వాడారు. అంతేకాదు, భారత్ లో గూగుల్ సంస్థ 28 మల్టీబ్రాండ్ స్టోర్లను 27 నగరాల్లో ప్రారంభించింది. పిక్సెల్ ఫోన్ వినియోగదారులు ఈ స్టోర్లకు వెళ్ళి సేవలను పొందవచ్చు. 64ఎంపి కెమెరా, 6.1-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లేతో Pixel 7a లాంచైంది.

సరే, ఓసారి Google Pixel 7a డివైజ్ ధర, లభ్యత, స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకుందాం పదండి.

భారత్ లో Google Pixel 7a ధర, లభ్యత

  • భారత్ లో Google Pixel 7a 8జిబి + 128జిబి మోడల్ ధర రూ.43,999 గా ఉంది. ఈ ఫోన్ చార్కోల్, సీ, స్నో కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • ఫ్లిప్ కార్ట్ ద్వారా మే 11 నుంచి అనగా గురువారం నుంచి ఈ హ్యాండ్సెట్ సేల్స్ మొదలవుతాయి.
  • హెచ్డీఎఫ్‌సీ కార్డ్స్ లేదా పిక్సెల్ మరియు ఏదైనా ఎంపిక చేయబడిన స్మార్ట్ ఫోన్లను ఎక్స్‌చేంజ్ చేయడం ద్వారా రూ.4,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో Google Pixel 7a డివైజ్ ని రూ.39,999 కే సొంతం చేసుకునే అవకాశం లభిస్తుంది.
  • ఫోన్ కొనుగోలు చేసే కస్టమర్లు, పిక్సెల్ బడ్స్ ఏ-సిరీస్ లేదా ఫిట్‌బిట్ ఇన్‌స్పైర్ 2 ని రూ.3,999 కే సొంతం చేసుకోవచ్చు.
  • ఇంకా ఫోన్ కొనుగోలుపై గూగుల్ సంస్థ 3 నెలల పాటు యూట్యూబ్ ప్రీమియమ్ మరియు కొత్త యూజర్లకు గూగుల్ వన్ సబ్‌స్క్రిప్షన్‌ని అందిస్తోంది.

Google Pixel 7a స్పెసిఫికేషన్స్

డిస్ప్లే

  • 6.1-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+
  • 90హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్

Google Pixel 7a లో 6.1-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఒక పంచ్-హోల్ కటౌట్, 429 పీపీఐ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్, ఆల్వేస్-ఆన్-డిస్ప్లే, ఎట్ ఏ గ్లాన్స్ అండ్ నౌ ప్లేయింగ్, హెచ్డీఆర్, హై-బ్రైట్నెస్ మోడ్ వంటివి ఉన్నాయి.

ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజీ

  • టెన్సర్ జీ2
  • ఎల్పీడీడీఆర్5
  • యూఎఫ్ఎస్ 3.1

Google Pixel 7a లో 8జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 128జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉన్నాయి.

ఓఎస్, బ్యాటరీ

  • ఆండ్రాయిడ్ 13 ఓఎస్
  • 4300 ఎంఏహెచ్

Google Pixel 7a డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. కంపెనీ 5 ఏళ్ళ పాటు అప్డేట్స్ ఇస్తామని హామీ ఇస్తోంది. పవర్ బ్యాకప్ కోసం ఈ డివైజ్ లో 4300 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో పాటు క్యూఐ వైర్లెస్ చార్జింగ్ ఫెసిలీటీ కూడా ఉంది.

కెమెరా విభాగం

  • 64ఎంపి ప్రైమరీ
  • 13ఎంపి సెల్ఫీ

Google Pixel 7a స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి మెయిన్ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

కెమెరా ఫీచర్లు

  • ఫోటో అన్‌బ్లర్
  • మ్యాజిక్ ఎరేజర్
  • నైట్ సైట్

Google Pixel 7a స్మార్ట్ ఫోన్ లో ఫోటో అన్‌బ్లర్, మ్యాజిక్ ఎరేజర్, నైట్ సైట్, లాంగ్ ఎక్స్‌పోజర్, రియల్ టోన్, ఫేస్ అన్‌బ్లర్, పనొరమ, మాన్యువల్ వైట్ బ్యాలెన్సింగ్, టాప్ షాట్, పొట్రెయిట్ మోడ్, సూపర్ రెజ్ జూమ్ తదితర ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.

కనెక్టివిటీ

  • 5జీ
  • ఎన్‌ఎఫ్‌సీ

Google Pixel 7a లో 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.3, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ చార్జింగ్ పోర్ట్ ఉన్నాయి.

Google Pixel 7a స్మార్ట్ ఫోన్ 9 మిల్లీ మీటర్ల మందం, 152 మిల్లీ మీటర్ల పొడవు, 72.9 మిల్లీ మీటర్ల వెడల్పు, 193.5 గ్రాముల బరువు ఉంటుంది.

భద్రత కోసం Google Pixel 7a లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. స్టీరియో స్పీకర్లు, 2మైక్రోఫోన్లు, ఐపీ67 రేటింగ్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

The post 6.1-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 64ఎంపి కెమెరాతో భారత్‌లో లాంచైన Google Pixel 7a first appeared on 91Mobiles Telugu.

]]>
మే 11 న భారత్‌లో లాంచ్ కానున్న Google Pixel 7a, ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్! https://www.91mobiles.com/telugu/google-pixel-7a-india-launch-date-may-11th-sale-via-flipkart/ Tue, 02 May 2023 11:50:09 +0000 https://www.91mobiles.com/telugu/?p=6130 గూగుల్ కొత్త ఫోన్ Google Pixel 7a భారత మార్కెట్ లాంచ్ తేదీ రివీల్ అయ్యింది. మే 11 న ఈ ఫోన్ లాంచ్ కానుందని గూగుల్ సంస్థ ఒక ట్వీట్ ద్వారా వెల్లడించింది. తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా గూగుల్ ఇండియా Google Pixel 7a డివైజ్ యొక్క ఇండియా లాంచ్ వివరాలను పోస్ట్ చేసింది. ఈ ఫోన్ గూగుల్ అభివృద్ధి చేసిన టెన్సర్ జీ2 చిప్సెట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ డివైజ్ […]

The post మే 11 న భారత్‌లో లాంచ్ కానున్న Google Pixel 7a, ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ట్వీట్ ద్వారా Google Pixel 7a లాంచ్ తేదీని రివీల్ చేసిన గూగుల్
  • గూగుల్ టెన్సర్ జీ2 చిప్సెట్ తో వస్తోన్న Google Pixel 7a
  • ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి రానున్న Google Pixel 7a

గూగుల్ కొత్త ఫోన్ Google Pixel 7a భారత మార్కెట్ లాంచ్ తేదీ రివీల్ అయ్యింది. మే 11 న ఈ ఫోన్ లాంచ్ కానుందని గూగుల్ సంస్థ ఒక ట్వీట్ ద్వారా వెల్లడించింది. తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా గూగుల్ ఇండియా Google Pixel 7a డివైజ్ యొక్క ఇండియా లాంచ్ వివరాలను పోస్ట్ చేసింది. ఈ ఫోన్ గూగుల్ అభివృద్ధి చేసిన టెన్సర్ జీ2 చిప్సెట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ డివైజ్ యూఎఫ్ఎస్3.1 స్టోరేజీ, ఎల్పీడీడీఆర్5 ర్యామ్ తో రానుంది.

Google Pixel 7a ధర (అంచనా)

Google Pixel 7a ధర 499 డాలర్లు (సుమారు రూ.41,000) ఉండే అవకాశం ఉందని 9to5Google వెబ్ సైట్ తన కథనంలో పేర్కొంది. పిక్సెల్ 6ఏ తో పోల్చితే ఇది 50 డాలర్లు ఎక్కువ ధరను కలిగి ఉంది.

Google Pixel 7a స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే

Google Pixel 7a స్మార్ట్ ఫోన్ లో 6.1-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, సన్నని బెజెల్స్, సెంటర్ పొజిషన్డ్ పంచ్ హోల్ కటౌట్ ఉంటాయి.

చిప్సెట్

Google Pixel 7a లో 8జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 128జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఉంటాయి.

కెమెరా విభాగం

Google Pixel 7a లో 64ఎంపి సోని ఐఎంఎక్స్787 సెన్సర్, 13ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 10.8 ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post మే 11 న భారత్‌లో లాంచ్ కానున్న Google Pixel 7a, ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్! first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Pixel 7a, Pixel Fold ఫోన్ల లాంచ్ తేదీ, ధర; పూర్తి వివరాలు తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/google-pixel-7a-pixel-fold-launch-date-leak-expected-specs/ Wed, 19 Apr 2023 05:53:40 +0000 https://www.91mobiles.com/telugu/?p=5943 ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ మే 10 వ తేదీన I / O 2023 డెవలపర్ కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. ఈ ఈవెంట్ సందర్భంగా ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ని గూగుల్ పరిచయం చేయనుంది. దాంతో పాటు, గూగుల్ సంస్థ Pixel 7a, Pixel Fold ఫోన్లను లాంచ్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటివరకు కంపెనీ నుంచి దీనికి సంబంధించి ఎటువంటి ప్రకటన లేదు. కానీ, FrontPageTech వెబ్ సైట్ కి చెందిన John Prosser, […]

The post లీకైన Pixel 7a, Pixel Fold ఫోన్ల లాంచ్ తేదీ, ధర; పూర్తి వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • జూన్ 27 నుంచి అందుబాటులోకి రానున్న Google Pixel Fold
  • Pixel Fold తో పాటు Pixel 7a అనౌన్స్ అయ్యే అవకాశం
  • Pixel 7a ధర 499 డాలర్లు (సుమారు రూ.41,000) ఉండే చాన్స్

ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ మే 10 వ తేదీన I / O 2023 డెవలపర్ కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. ఈ ఈవెంట్ సందర్భంగా ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ని గూగుల్ పరిచయం చేయనుంది. దాంతో పాటు, గూగుల్ సంస్థ Pixel 7a, Pixel Fold ఫోన్లను లాంచ్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటివరకు కంపెనీ నుంచి దీనికి సంబంధించి ఎటువంటి ప్రకటన లేదు. కానీ, FrontPageTech వెబ్ సైట్ కి చెందిన John Prosser, Pixel 7a మరియు Pixel Fold డివైజెస్ ఎప్పుడు ప్రీ-ఆర్డర్ మరియు కొనుగోలుకి అందుబాటులోకి వస్తాయో తెలిపారు. దీంతోపాటు, Pixel 7a ధర ఒక రిపోర్ట్ ద్వారా రివీల్ అయ్యింది.

Google Pixel 7a, Pixel Fold లాంచ్ తేదీ (లీక్)

  • మే 10 వ తేదీన Google Pixel Fold లాంచ్ అవుతుందని అంచనా. మే 10 నుంచి గూగుల్ స్టోర్ ద్వారా ప్రీ-ఆర్డర్స్ మొదలవుతాయని సమాచారం.
  • మే 30 నుంచి పార్ట్నర్స్ మరియు క్యారియర్ ఔట్‌లెట్స్ ద్వారా ప్రీ-ఆర్డర్స్ మొదలవుతాయి. జూన్ 27 నుంచి ఫోల్డబుల్ ఫోన్ సేల్ కి వస్తుంది.
  • పిక్సెల్ 7ఏ మే 10 ప్రకటన తర్వాత అందుబాటులోకి వస్తుందని జాన్ చెప్పారు. ఇకపోతే ఈ డివైజ్ చార్‌కోల్, స్నో, సీ అండ్ కోరల్ కలర్ ఆప్షన్స్ లో గూగుల్ స్టోర్ ద్వారా మాత్రమే లభించనుంది.
  • పిక్సెల్ 7ఏ తర్వాత గూగుల్ సంస్థ పిక్సెల్ 6ఏ ని నిలిపివేయదని రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది.

Google Pixel 7a ధర (అంచనా)

  • పిక్సెల్ 7ఏ ధరను 9to5Google వెబ్ సైట్ తన కథనంలో పేర్కొంది. దాని ప్రకారం, ఈ ఫోన్ ధర 499 డాలర్లు (సుమారు రూ.41,000) గా ఉండనుంది. పిక్సెల్ 6ఏ కంటే ఇది 50 డాలర్లు ఎక్కువ.

Pixel 7a స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • Pixel 7a స్మార్ట్ ఫోన్ 6.1-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, సిమ్మెట్రికల్ బెజెల్స్, సెంటర్ పొజిషన్డ్ పంచ్-హోల్ కటౌట్ తో రానుంది.
  • ఈ డివైజ్ లో టెన్సర్ జీ2 చిప్సెట్ వాడనున్నారు. 8జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 128జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో ఈ ఫోన్ రానుంది.
  • పిక్సెల్ 7ఏ లో 64ఎంపి సోని ఐఎంఎక్స్787 సెన్సర్, 13ఎంపి సెకండరీ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 10.8 ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

Pixel Fold స్పెసిఫికేషన్స్ (రూమర్స్)

  • Pixel Fold డివైజ్ లో 7.57-ఇంచ్ ఫోల్డబుల్ మెయిన్ స్క్రీన్ మరియు 5.78-ఇంచ్ ఔటర్ స్క్రీన్ ఉంటాయి.
  • ఈ ఫోల్డబుల్ ఫోన్ టెన్సర్ జీ2 చిప్సెట్ తో వస్తోంది. ఇందులో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉంటాయి.
  • ఈ డివైజ్ లో 4700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని సమాచారం. అయితే ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ గురించి సమాచారం ఇంకా రాలేదు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లీకైన Pixel 7a, Pixel Fold ఫోన్ల లాంచ్ తేదీ, ధర; పూర్తి వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
ఫ్లాగ్షిప్ గ్రేడ్ కెమెరా, వైర్లెస్ చార్జింగ్ తో లాంచ్ కానున్న Google Pixel 7a https://www.91mobiles.com/telugu/google-pixel-7a-flagship-grage-camera-wireless-charging-report/ Wed, 02 Nov 2022 12:28:39 +0000 https://www.91mobiles.com/telugu/?p=3198 హైలైట్స్ ఫ్లాగ్షిప్ గ్రేడ్ కెమెరా, వైర్లెస్ చార్జింగ్ తో లాంచ్ అవ్వనున్న Google Pixel 7a 2023 లో లాంచ్ కానున్న Google Pixel 7a స్మార్ట్ ఫోన్ సిరామిక్ బాడీ, Tensor G2 చిప్ తో వస్తోన్న Google Pixel 7a ఇటీవలె Google కంపెనీ తన ఫ్లాగ్షిప్ సిరీస్ Google Pixel 7 ని లాంచ్ చేసింది. ఇప్పుడు Google Pixel 7a ని తీసుకొని రావాలని ప్లాన్ చేస్తోంది. ఈ మిడ్-రేంజ్ ఫోన్ […]

The post ఫ్లాగ్షిప్ గ్రేడ్ కెమెరా, వైర్లెస్ చార్జింగ్ తో లాంచ్ కానున్న Google Pixel 7a first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • ఫ్లాగ్షిప్ గ్రేడ్ కెమెరా, వైర్లెస్ చార్జింగ్ తో లాంచ్ అవ్వనున్న Google Pixel 7a
  • 2023 లో లాంచ్ కానున్న Google Pixel 7a స్మార్ట్ ఫోన్
  • సిరామిక్ బాడీ, Tensor G2 చిప్ తో వస్తోన్న Google Pixel 7a

ఇటీవలె Google కంపెనీ తన ఫ్లాగ్షిప్ సిరీస్ Google Pixel 7 ని లాంచ్ చేసింది. ఇప్పుడు Google Pixel 7a ని తీసుకొని రావాలని ప్లాన్ చేస్తోంది. ఈ మిడ్-రేంజ్ ఫోన్ ఎన్నో కొత్త అప్‌గ్రేడ్స్ తో రాబోతోంది. ఫ్లాగ్షిప్ గ్రేడ్ కెమెరాలు, వైర్లెస్ చార్జింగ్, సిరామిక్ బాడీ తో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానున్నట్లు సమాచారం.

ఓ రిపోర్ట్ ప్రకారం, Google Pixel 7a “Lynx” అనే కోడ్ నేమ్ ని కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో వచ్చిన పిక్సెల్ ఏ-సిరీస్ మోడల్స్ తో పోల్చితే Google Pixel 7a ప్రీమియమ్ ఫీచర్లతో వస్తున్నట్లు తాజాగా బయటకు వచ్చిన లీక్స్ ద్వారా స్పష్టమవుతోంది.

Google Pixel 7a స్పెసిఫికేషన్స్ (అంచనా)

9to5Google వెబ్ సైట్ కథనం ప్రకారం, Google Pixel 7a ఫ్లాగ్షిప్ కెమెరా, వైర్లెస్ చార్జింగ్ ఇంకా మరెన్నో అప్‌గ్రేడ్స్ తో 2023 లో లాంచ్ అవుతుందని తెలుస్తోంది. Google Pixel 7a Tensor G2 చిప్సెట్ తో వస్తోంది. Google Pixel 7 Pro లో కూడా ఇదే ప్రాసెసర్ ని వినియోగించారు. సిరామిక్ బాడీతో వస్తున్న తొలి గూగుల్ ఫోన్ గా Google Pixel 7a నిలవనుంది.

ఎన్నో అప్‌గ్రేడ్స్ తో పాటు, ఈసారి గూగుల్ పిక్సెల్ ఏ-సిరీస్ అప్ కమింగ్ ఫోన్ లో వైర్లెస్ చార్జింగ్ ని కూడా చూడబోతున్నారు. Google Pixel 7a వైర్లెస్ చార్జింగ్ చిప్ అయిన P922 5 వాట్ చార్జింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని సమాచారం.

గూగుల్ సంస్థ ఈసారి తీసుకురాబోయే Google Pixel 7a ఫోన్ లో టెలీఫోటో సెన్సర్ ని కూడా జతచేసే అవకాశం ఉంది. పిక్సెల్ ఏ-సిరీస్ ఫోన్లలో టెలీఫోటో లెన్స్ ఉండటం Google Pixel 7a తోనే మొదలు. మరి ఇంకా ఎన్ని అదనపు హంగులు Google Pixel 7a లో చేరబోతున్నాయో చూడాలి. గమనించదగిన విషయం ఏంటంటే, ఈ టెలీఫోటో లెన్స్ స్టాండర్డ్ వేరియంట్ అయిన Google Pixel 7 లో ఉండబోదు.

భారత్ లో Google Pixel 6a ధర, స్పెసిఫికేషన్స్

Google Pixel 7 సిరీస్ లాంచ్ తర్వాత Google Pixel 6a ధరను గూగుల్ తగ్గించింది. ప్రస్తుతం ఈ ఫోన్ రూ.43,999 కి లభిస్తోంది. గత నెలలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా Google Pixel 6a రూ.27,699 కి లభించింది.

Google Pixel 7a 6.1-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 431పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 1080*2400 పిక్సెల్స్ రెజుల్యూషన్ తో వచ్చింది. గూగుల్ టెన్సర్ చిప్సెట్ ఇందులో ఉంది. గ్రాఫిక్స్ కోసం ఈ ఫోన్ లో మాలి-జీ78 ఎంపీ20 జీపీయూ ని వాడారు. ఇకపోతే ఈ ఫోన్ 6జిబి ర్యామ్ వేరియంట్ తో లాంచ్ అయ్యింది.

Google Pixel 6a డ్యూయల్ కెమెరా సెటప్ తో వచ్చింది. ఇందులో 12.2 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. ఈ ఫోన్ లో 4410 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post ఫ్లాగ్షిప్ గ్రేడ్ కెమెరా, వైర్లెస్ చార్జింగ్ తో లాంచ్ కానున్న Google Pixel 7a first appeared on 91Mobiles Telugu.

]]>