ఫ్లాగ్షిప్ గ్రేడ్ కెమెరా, వైర్లెస్ చార్జింగ్ తో లాంచ్ కానున్న Google Pixel 7a

హైలైట్స్

  • ఫ్లాగ్షిప్ గ్రేడ్ కెమెరా, వైర్లెస్ చార్జింగ్ తో లాంచ్ అవ్వనున్న Google Pixel 7a
  • 2023 లో లాంచ్ కానున్న Google Pixel 7a స్మార్ట్ ఫోన్
  • సిరామిక్ బాడీ, Tensor G2 చిప్ తో వస్తోన్న Google Pixel 7a

ఇటీవలె Google కంపెనీ తన ఫ్లాగ్షిప్ సిరీస్ Google Pixel 7 ని లాంచ్ చేసింది. ఇప్పుడు Google Pixel 7a ని తీసుకొని రావాలని ప్లాన్ చేస్తోంది. ఈ మిడ్-రేంజ్ ఫోన్ ఎన్నో కొత్త అప్‌గ్రేడ్స్ తో రాబోతోంది. ఫ్లాగ్షిప్ గ్రేడ్ కెమెరాలు, వైర్లెస్ చార్జింగ్, సిరామిక్ బాడీ తో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానున్నట్లు సమాచారం.

ఓ రిపోర్ట్ ప్రకారం, Google Pixel 7a “Lynx” అనే కోడ్ నేమ్ ని కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో వచ్చిన పిక్సెల్ ఏ-సిరీస్ మోడల్స్ తో పోల్చితే Google Pixel 7a ప్రీమియమ్ ఫీచర్లతో వస్తున్నట్లు తాజాగా బయటకు వచ్చిన లీక్స్ ద్వారా స్పష్టమవుతోంది.

Google Pixel 7a స్పెసిఫికేషన్స్ (అంచనా)

9to5Google వెబ్ సైట్ కథనం ప్రకారం, Google Pixel 7a ఫ్లాగ్షిప్ కెమెరా, వైర్లెస్ చార్జింగ్ ఇంకా మరెన్నో అప్‌గ్రేడ్స్ తో 2023 లో లాంచ్ అవుతుందని తెలుస్తోంది. Google Pixel 7a Tensor G2 చిప్సెట్ తో వస్తోంది. Google Pixel 7 Pro లో కూడా ఇదే ప్రాసెసర్ ని వినియోగించారు. సిరామిక్ బాడీతో వస్తున్న తొలి గూగుల్ ఫోన్ గా Google Pixel 7a నిలవనుంది.

ఎన్నో అప్‌గ్రేడ్స్ తో పాటు, ఈసారి గూగుల్ పిక్సెల్ ఏ-సిరీస్ అప్ కమింగ్ ఫోన్ లో వైర్లెస్ చార్జింగ్ ని కూడా చూడబోతున్నారు. Google Pixel 7a వైర్లెస్ చార్జింగ్ చిప్ అయిన P922 5 వాట్ చార్జింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని సమాచారం.

గూగుల్ సంస్థ ఈసారి తీసుకురాబోయే Google Pixel 7a ఫోన్ లో టెలీఫోటో సెన్సర్ ని కూడా జతచేసే అవకాశం ఉంది. పిక్సెల్ ఏ-సిరీస్ ఫోన్లలో టెలీఫోటో లెన్స్ ఉండటం Google Pixel 7a తోనే మొదలు. మరి ఇంకా ఎన్ని అదనపు హంగులు Google Pixel 7a లో చేరబోతున్నాయో చూడాలి. గమనించదగిన విషయం ఏంటంటే, ఈ టెలీఫోటో లెన్స్ స్టాండర్డ్ వేరియంట్ అయిన Google Pixel 7 లో ఉండబోదు.

భారత్ లో Google Pixel 6a ధర, స్పెసిఫికేషన్స్

Google Pixel 7 సిరీస్ లాంచ్ తర్వాత Google Pixel 6a ధరను గూగుల్ తగ్గించింది. ప్రస్తుతం ఈ ఫోన్ రూ.43,999 కి లభిస్తోంది. గత నెలలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా Google Pixel 6a రూ.27,699 కి లభించింది.

Google Pixel 7a 6.1-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 431పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 1080*2400 పిక్సెల్స్ రెజుల్యూషన్ తో వచ్చింది. గూగుల్ టెన్సర్ చిప్సెట్ ఇందులో ఉంది. గ్రాఫిక్స్ కోసం ఈ ఫోన్ లో మాలి-జీ78 ఎంపీ20 జీపీయూ ని వాడారు. ఇకపోతే ఈ ఫోన్ 6జిబి ర్యామ్ వేరియంట్ తో లాంచ్ అయ్యింది.

Google Pixel 6a డ్యూయల్ కెమెరా సెటప్ తో వచ్చింది. ఇందులో 12.2 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. ఈ ఫోన్ లో 4410 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous articleభారత్ లో లాంచ్ అయిన Nokia G60 5G; ఫోన్ కొనుగోలుపై వైర్డ్ ఇయర్ బడ్స్ ఉచితం
Next articleBSNL 4G నెట్వర్క్ లాంచ్ అయ్యేది అప్పుడే..!!
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.